భర్త దగ్గర.. కోరికలు తీరని ఆడవాళ్ళు!! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n3R8pdGVyrg
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం పుడుతూనే ఎవరూ తప్పులు చేస్తూ పుట్టారండి అలాగే తప్పు దోవలో కూడా వెళ్లరు. ఆడవాళ్ళు కొన్ని తప్పులు చేస్తే మగవాళ్ళు కొన్ని తప్పులకి కారకులు అవుతూ ఉంటారు. దీనికి జీవితమే ఒక సమాధానం మనకి చెప్తుంది. అదేమిటి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనతో ఆ తప్పులని చేయిస్తూ ఉంటాయి. పుట్టుకుతో అందరూ చెడ్డవాళ్ళు తప్పులు చేస్తూనే పుడుతూ ఉంటారు తప్పుడు పనులు చేస్తారు బిహేవియర్ ఇలాగే ఉంటది అని జడ్జ్ చేయడానికి మనం సరిపోమాట అంటే కొంతమంది లైఫ్ లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి సిచువేషన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది.
(00:44) ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఒక భర్తకి ఒక భార్యకే ఎందుకు స్టిక్ అయి ఉండట్లేదు ముఖ్యంగా ఆడవాళ్ళని ఈ రోజు మనం ప్రస్తావించుకుందాం అండి ఎందుకు అంటే అనాదిగా మన ఆచారాలలో మగవాడు పాత్ర ఇలానే నడుస్తూ వచ్చింది అంటే మగవాళ్ళకి ముగ్గురు భార్యలా ఇద్దరు భార్యలా 10 మంది భార్యలా లేదా మగవాడు భార్య ఉంచుకొని వేశ గృహాలకు వెళ్ళటమా నచ్చిన స్త్రీని అనుభవించడ మా ఇది కూడా మన సంప్రదాయాల్లో భాగమైపోయింది.
(01:19) మరి ఆడవాళ్ళు ఇటువంటి సంప్రదాయాలకు గాని పద్ధతులకు గాని అంటే నీచమైన పద్ధతులకు గాని చాలా దూరంగా ఉండేవారు వాళ్ళ పడికట్టు చాలా శుద్ధిగా ఉండేది. భర్త తప్ప పరాయి మగవాడిని కన్నెత్తి కూడా చూసేవారు కాదు. ఎందుకు అంటే ఆడవాళ్ళు క్యారెక్టర్ ఎప్పుడూ లూస్ కానివ్వలేదు. అది ఎప్పుడు పదిలింగా పవిత్రంగా చూసుకునేవారు మరి ఈరోజు ఆడవాళ్ళు చేరలు మార్చినట్టుగా మొగుడిని గాని మగాల్ని గాని ఎందుకు మారుస్తున్నారు ఒక్కరికే ఎందుకు కట్టుబడి ఉండట్లేదు ఇది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం.
(02:03) నిజం చెప్పుకోవాలంటే ఏ ఆడదానికి పరపురుషుడి మీద మోజు ఉండదండి అది అరుదుగా ఉంటారు ఆ జీన్స్ వేరే ఉంటాయి వాళ్ళ పెంపకం బట్టి ఉంటది ఆచార వ్యవహారాలు ఎలా చెప్పుకుంటామో కులాల వారీగా అలాగే ఉంటారు కొంతమంది దేవదాసి కుల వ్యవస్థ వారు ఉంటారు అది మీ అందరికీ తెలుసు తర్వాత భోగం వారు ఉంటారు ఇలాగ ఆ పోకుడు నుంచి వచ్చిన ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ అటు వైపు మొగ్గు చూపిస్తారు మోజుపడుతూ ఉంటారు.
(02:35) తక్కిన వారు ఎవరికీ ఇటువంటి వక్రబుద్ధి ఉండేది కాదు మరి ఈ రోజుల్లో అదే వక్రబుద్ధి అందరికీ ఎక్కువైపోయింది అంటే ఇక్కడ కులమా మతమా లేదా ఒక నికార్స అయిన ఆ సన్యాసినిలా ఇవేమీ లేదు అందరికీ ఇదే అలవాటు అన్నమాట. ఏమన్నా అంటే కలిపురుషుడు కలికాలం అంటున్నారు. మరి మనం ఈరోజు దీని గురించి అసలు ఏం మాట్లాడుకోవాలి ఆడది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది మగవాళ్ళతో సమానంగా పోటాపోటీగా వంతులు వేయటం మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయటం సంపాదించటం అలాగే ప్రతిదీ సమానత్వం కోరుకుంటుంది. ఎక్స్ట్రా మ్యరిటల్ అఫైర్స్
(03:21) లో కూడా ఆమె ముందుంది. భర్త నుంచి చిన్న చిన్న కోరికలు తీరకపోవటం భర్త నుంచి సుఖాన్ని పొందలేక పోవటం భర్త నుంచి ప్రేమానురాగాలు పొందలేకపోవడం ఇవన్నీ కారణాల కింద మనం చెప్పుకోవచ్చు ఎందుకు ప్రతి ఆడది ముందుగా తన భర్తనే ఇష్టపడుతుంది. తన భర్తతోనే శృంగార కామవాంచలు తీర్చుకోవాలని చూస్తుంది. తన భర్తతోనే తోడు నీడగా నడవాలని చూస్తుంది.
(03:53) మరి ఈ రోజుల్లో అటువంటి ఆలోచనలు గాని ఇష్టాలు గాని లేకపోవటానికి కారణం ఏమిటి అంటే మగవాడిదే తప్పు అవునండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీ మగవాళ్ళదే తప్పు మాట ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే చాలా మంది ఆడవాళ్ళకి డబ్బు పిచ్చి ఉంటది బంగారం పిచ్చి ఉంటది విదేశాలు తిరగాలని సినిమాలకు వెళ్ళాలని పార్కులక వెళ్ళాలని పెద్ద పెద్ద మాల్స్ లో షాపింగ్ చేయాలని రిచ్ గా బతకా ని లగ్జరీ లైఫ్ ఉండాలని కార్ ఉండాలని ఇంకా చెప్పాలంటే వాళ్ళ కోరికలు అంతూ పొంతూ ఉండదు మీరు చూస్తే గనుక శుభలగ్నం సినిమాలో ఆమెని ఎలా ప్రవర్తిస్తుంది ఉన్నవాళ్ళతో వంతులేస్తుంది వాటాలు
(04:38) వేస్తుంది భర్త ఎంతటి చక్కటి భర్తని మనశశాంతి లేకుండా ఆమె చెడ కొట్టుకుంటూ ఉంటది. అలాగే భర్తని కోటి రూపాయలకి అమ్మేస్తుంది అమ్మేసి రోజా దగ్గర నుండి కోటి రూపాయలు తీసుకొని లంక అంత కొంప కట్టుకుంటది ఆ కొంపలో భర్త లేనప్పుడు సుఖం లేనప్పుడు మనశశాంతి ఉండదు ఆ మనశశాంతి లేనప్పుడు ఆమె చేసేది ఏముంటది అది చిట్టచివరికి తెలుసుకుంటది.
(05:05) మరి ఈ రోజుల్లో మహిళలందరూ ఇంకా ముదిరిపోయారు. మనం మాట్లాడుకునేది ఈరోజు అదే విషయం ఇంకా మనం ఎక్కువగా మాట్లాడుకోవాలంటే ఆడవాళ్ళు భర్త నుంచి శారీరక సుఖం కోసం చాలా వేచి చూస్తూ ఉంటారు అవి సిగ్గువిడిచి వాళ్ళు చెప్పలేరు. భర్త కోసం పడిగాపలు కాస్తూ ఉంటారు కానీ భర్తకి ఇంత సమయం కూడా ఉండని వాళ్ళు ఉంటారు నేను తప్పుగా ఏం మాట్లాడట్లేదు ఎందుకు అంటే వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళు ఈ రోజుల్లో చేస్తున్న పని రీత్యా వాళ్లకున్న టెన్షన్ లో టైం సర్దుపాటు అవ్వకపోవటం జీవితం అనే ప్రయాణం ఒక సవాలుగా మారిందని చెప్పవచ్చు కాబట్టి వాళ్లకున్న ఇష్టాలు కూడా వాళ్ళు
(05:49) చంపుకొని భార్యల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా మనం మాట్లా మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది భర్తలకి బయట తిరగటం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండటం తిరుగుబోతోళ్ళు ఉంటారు అంటే పెళ్ళం తప్ప ఊరు ఆడవాళ్ళందరూ నచ్చుతారు వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. మందుబాబులు ఉంటారు వాళ్ళతో మందేస్తూ చిందేస్తూ రెండింటికి మూడింటికి నాలుగింటికి ఇళ్లకు చేరుతారు.
(06:14) ఆ క్రమంలో కూడా భార్యను పట్టించుకోకపోవటం ఉంటది. పని ఒత్తిడి ఒక్కటే కాదు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకనే భార్య మానసికంగా నలిగిపోతూ ఉంటుంది. భర్త నుంచి ఇంత ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నువ్వు తిన్నావా అని ఎప్పుడు అడుగుతాడా అని కడుపు మార్చుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. బయట టూర్లక వెళ్ళటమా లేక భర్తతో పాటు చట్టా పట్టాలు వేసుకొని తిరగటమా ఇవఒక్కటే ఆడవాళ్ళ కోరికలు కాదండి కనీసం వారానికి ఒక్కసారైనా నా భర్త నాతో పాటు టైం స్పెండ్ చేస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది.
(06:48) వారమంతా కష్టపడిన భర్తకి ఈమె కూడా వారమంతా ఇప్పుడు అందరి జాబులే కదండీ ఈమె కూడా వారమంతా కష్టపడి ఆ ఒక్క రోజు ఇద్దరు ఇంట్లో కలిసి ఉండాలని చూస్తారు ఇప్పుడు ఉద్యోగం చేసే ఆడవాళ్ళా లేదా ఇంట్లో గృహిణిలా అని మనం చెప్పుకోవడానికి అంటే డివైడ్ చేయడానికి లేదు ఏ స్త్రీ మనస్తత్వం అన్నా ఇలాగే ఉంటుంది కలిసి భోం చేయాలి కలిసి కబుర్లు చెప్పుకోవాలి కష్టం సుఖం మాట్లాడుకోవాలి కష్ట సుఖాలు పంచు చుకోవాలి ఆనందాలు వ్యక్తం చేయాలి భార్య వంట చేస్తూ ఉంటే భర్త చిన్న చిన్నగా పనులు హెల్ప్ చేయాలి లేదా దగ్గరగా తీసుకోవాలి సడన్ గా వెనక నుంచి పట్టుకోవాలి ప్రేమ
(07:34) చూపించాలి జోక్స్ వేయాలి ఇవన్నీ కూడా ఆడది ఆలోచిస్తూనే ఉంటుంది మనసు పారేసుకొని ఇటువంటి వాటిల మీదే మనసు పడుతుంది కూడా మరి ఇవేమి దక్కనప్పుడు ఆ భార్య భార్య ఎలాగా బయట మనిషిగా అలవాటు పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళ ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళ అంటే హౌస్ వైఫ్స్ అని కాదండి వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళ అభిరుచులకి దగ్గరయ్యే వాళ్ళు దొరికితే ఆఫీస్ లో గాని వాళ్ళ బంధువుల్లో గాని ఇళ్ల దగ్గర గాని వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళతో కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా భార్య భర్తల మధ్య సంభాషణని జరుగుతున్న కష్టాలని ఆమె పడుతున్న
(08:19) నరకాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అప్పుడు అప్పుడు అవతల మనిషి ఏమంటాడు నీకుఎందుకు నేను ఉన్నాగా అని చెప్పి మంచి చేసుకుంటూ ఉంటాడు. అతను ఎందుకు మంచి చేసుకున్నాడో కూడా తెలుసు తెలిసినా కూడా ఆమెకి ఫ్రీడం కావాలి. ఆ ఓదార్పు కావాలి నాలుగు మాటలు చెప్పి టైం స్పెండ్ చేసే వ్యక్తి కావాలి. ఈ ప్రేమకి ఆమె నోచుకోక కరువు ఓసిపోయి అలా పరపురుషుడికి అలవాటు పడటం జరుగుతుంది.
(08:46) మరి ఈ రోజుల్లో ఇంకా చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. ఇక్కడ షాపింగ్ కి వెళ్ళటం ఇష్టమైన వస్తువులు కొనివ్వటం సినిమాలకు తీసుకువెళ్ళటం ఇలా అలవాటు పడినప్పుడు ఒక్కసారి చేస్తే అది పొరపాటులా ఉంటది. పదే పదే చేస్తే అదే అలవాటుగా మారుతుంది అలా అలవాటుగా మారినప్పుడు భర్తని గాని పిల్లల్ని గాని ఫ్యామిలిని గాని పరువుని గాని లెక్కచేయరు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారా బంధువులు ఏమనుకుంటున్నారా నా పరిస్థితి ఏమైపోద్ది అని భయపడరు కూడా మరి పెళ్లి కానీ ఆడపిల్లలు అయితే ఇంకా చాలా డేంజర్ ఎందుకంటే వీళ్ళు భర్త కైనా భయపడతారు ఎవరైనా నా భర్తకు చెప్తారేమో అని
(09:25) వీళ్ళు ఎవరికీ భయపడనవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇష్టమైనట్టు ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి ఇష్టమైతే ఉంటున్నారు నాలుగు మూడేళ్ళు తర్వాత అమ్మాయికి పెలుగుతే వెళ్ళిపోతుంది లేదే అభిరుచులు కలవకపోతే వీలే విడిపోతున్నారు. అటు భర్త ఉన్నా కూడా ఇవే పనులు చేస్తున్నారు. మరి సమాజం ఎందుకు ఇంతగా పాడైంది మళ్ళీ ఏమి ఎరగనట్టు అంతమందితో తిరుగుతున్నారు ఒక ఒక్కరితో కాదు ఎంతో మందితో రిలేషన్షిప్ లో ఉంటున్నారు ఆడవాళ్ళు.
(09:56) ఈ తప్పుడు రిలేషన్ల వల్ల ఆడది ఎంత నాశనం అవుతుందో వాళ్ళు మర్చిపోయారు. ఇవన్నీ చేసి కూడా తలంచుకొని చక్కగా బుట్టబొమ్మలాగా తాలి కట్టించుకుంటారు. అటువైపు మగవాడిని మసిపూసి మారేడికాయ చేస్తారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామో తెలుసుకోవాలి అని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేశన్నమాట. ఎందుకు అంటే ఆడది చేర్లు మార్చినంత తేలిగ్గా మగవాళ్ళని మార్చేస్తుంది.
(10:27) సమాజంలో ఒక పరువు గురించి ఆలోచించట్లేదు. తన పిల్లలు భర్త తన సంసారం గురించి కూడా ఆలోచించని దౌర్భాగ్య స్థితిలో ఉంది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మన బుర్రకు ఎక్కట్లేదు ఒకరికొకరు నరుకోవడం పొడుచుకొని చావడం ఇష్టం లేనప్పుడు సర్దుకొని ఉండలేక పోతున్నారు. అభిరుచులు కలవట్లేదు ఏమన్నా అంటే నా భర్త తాగుబోతోడు తిరుగుబోతోడు అంటున్నారు అలాగే మగవాళ్ళు కూడా అందమైన భార్యలని పెట్టుకొని కూడా బయట బిర్యానీలకి ఆశపడుతున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్టో నువ్వు చేశవు తప్పు నేను చేశాను సమానమే అంటున్నారు ముందు నువ్వు చేసింది ఏంటో చూసుకో అని చెప్పి మొగుణని
(11:10) ప్రశ్నిస్తున్నారు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది సమాజం ఎంతవరకు నాశనం అయింది అనేది మనం చక్కగా తెలుసుకోవచ్చున్నమాట ఇటువంటి బానిీలోనే వెళితే రేపు అన్నటి రోజులు మాయమైపోతాయి అంటే మంచి భవిష్యత్తులు ఎవరికీ ఉండవు ఎక్కడ చూసినా చేడపట్టిన వాళ్లే ఉంటారు అంటే మేడిపండి చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులు ఉండు అన్న పద్యం ఒకటి మీ అందరికీ తెలుసు తెలుసు అది ఈ రోజుల్లో ఖచ్చితంగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది.
(11:41) భర్తలకి బయట తిరగడం అంటే ఇష్టం ఉండదు అంటే కొంతమందికి బయట తిరగడం ఇష్టం ఉండదు బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేయమంటారు వాళ్ళేమో రెస్టారెంట్ కి వెళ్దాం అంటారు ఇవేమి వద్దు అనిని అంటాడు బయట పరిస్థితులు బాలేదు అంటాడు ఆడవాళ్ళు బయటకి రావడం నచ్చదు అంటాడఅన్నమాట మరి ఇటువంటి కట్టుబాట్లని ఈరోజు ఆడవాళ్ళు లెక్క చేస్తున్నారా ఎప్పుడో దాటేశారు.
(12:03) వాళ్ళ కోరికలు తీరకపోవడం కూడా ఒక కారణం అన్నమాట. అందుకనే వాళ్ళ కోరికలు ఎక్కడైతే తీరుతాయో ఆడవాళ్ళు దాన్ని వీలుగా వెసులుబాటుగా చేసుకుంటున్నారు. మరి మగవాళ్ళు తప్పులు చేయట్లేదా శ్రీదేవిగారు అని మీరు అడగవచ్చు. మగవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక ఇష్టా ఇష్టాలు ఉంటాయి. అంటే కొంతమందికి తాగుడు ఇష్టం ఉంటది. కొంతమందికి ఆడవాళ్ళ పిచ్చి ఉంటది కొంతమందికి చదువు పిచ్చి ఉంటది.
(12:31) కొంతమందికి సమాజంలో పేరు గౌరవం పరపతి డబ్బు సంపాదించే పిచ్చి ఉంటది. కొంతమందికి పేకాట పిచ్చి ఉంటది. అది ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అంటే పెద్దయిన తర్వాత వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఫ్రీగా వస్తే వదలరు కదా దాన్నే ఒక అలవాటుగా చేసుకుంటారు దానికే బానిస అవుతూ ఉంటారు మరీ ఇటువంటి బానిస బతుకులో నుంచి మగవాడిని అంటే భర్తని ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి భార్య ఆలోచించకుండా తనే పర పురుషులకి బానిసగా మారుతుంది కేవలం తన కోరికలు తన డబ్బు పిచ్చి తన లగ్జరీ లైఫ్ రాయల్ లైఫ్ ఇవన్నీ చూపించుకోవడానికి సమాజంలో ఆడది ఒక బలి
(13:18) పశువుగా మారుతుంది. వాడుకున్నంత వాడుకొని వదిలేస్తున్నారు మగవాళ్ళు. అదే కాకుండా వాళ్ళ బట్టే వాళ్ళ పిల్లలు కూడా ఉంటున్నారు. ఇక్కడ ఒక్కలతో కాదు ఎంతమందితో పదుల సంఖ్యలో రిలేషన్లు పెట్టుకుంటున్నారంటే మీరు నమ్మరున్నమాట. ఇంకో విషయం ఏమిటి అంటే ఇదివరకు ఆడవాళ్ళు భర్త తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా సర్దుకొని ఉండేవారు ఎందుకు అంటే ఆ రోజుల్లో విడాకులు లేవు అదిఒక పరువు తక్కువ పని పెద్ద మనుషుల్లో కూడా తీర్పులు చెప్పినా కూడా పెద్ద మనుషులు సర్దుబాటు చేసి మళ్ళీ కలిపేవారు.
(13:55) పుట్టింటికి వెళ్ళే దారి లేదు పుట్టింటి వలే నోరు మూసుకొని బుద్ధి తెచ్చుకొని ఉండు అని గట్టిగా చెప్పేవారు భర్త తప్పయినా సరే కాబట్టి వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి అందుకనే చచ్చినట్టు పడి ఉండేవారు మన కర్మ ఇదే అనుకునేవారు అలాగే పూర్వకాలం పద్ధతులను అనుసరించి చాలా గౌరవంగా ఉండేవారు అన్నమాట పర పురుషుడితో కూడా మాట్లాడటం తెలీదు అంత గౌరవాన్ని వాళ్ళు పాటించేవారు మరి ఇప్పుడు అంత అవసరం లేదు కదా చాలా ఛాయిసులు ఉన్నాయి అలాగే ఎన్నో దారులు ఉన్నాయి.
(14:28) సమాజం చాలా మారింది ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి కాకపోతే 100 దారులు ఉన్నాయి అన్నట్టు ఆడవాళ్ళు వాటిల్ని ఉపయోగించుకుంటున్నారు. అందుకనే ఇన్ని చిక్కులు వచ్చినయి మరి ఇంతకీ ఇదంతా చెప్పారు గానీ ఆడమగ ఎలా కలిసి ఉండాలి? ఆడది కోరికల్ని అనుచుకొని ఉండాలా లేదా ఆడదాని కోరికలు భర్త తీర్చాలా ఇవేమి చెప్పలేదఏంటి మీరు అని అడగొచ్చు ఒక్కటే చెప్తానండి నేను పూర్వకాలం పద్ధతులు పాతకాలం పద్ధతులు మన గ్రాండ్ పేరెంట్స్ పద్ధతులని మనం పాటించుకుంటే చాలు ఆడవాళ్ళ ఇష్టా ఇష్టాలకి అభిరుచులకి కొన్నిటికన్నా ప్రయారిటీ ఇవ్వాలి బరితెగింపులకు ఇవ్వకపోయినా మగవాడు భార్యని అర్థం
(15:11) చేసుకోవాలి మరి మీరేమనుకుంటున్నారు ఆడదాని కానీ కోరికలు భర్త తీర్చాలా అంటే చిన్న చిన్న కోరికలు న్యాయమైన కోరికలు కాదండి బలిదిగ్గింపు కోరికలు కూడా భర్త తీర్చాలా భర్త పూర్తిగా మారిపోవాలా అలాగే భార్య కోరికల్ని అనుచుకొని ఉండాలా లేకపోతే దొడ్డిదారిన వెళ్ళాలా మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని మీద నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే పార్ట్ట అని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది [సంగీతం]
No comments:
Post a Comment