Friday, April 10, 2026

What is Delulu Dating? The Viral Trend That Might Be Ruining Your Relationship! Sakshi Tv Digital

What is Delulu Dating? The Viral Trend That Might Be Ruining Your Relationship! Sakshi Tv Digital

Author Name:Sakshi TV Digital

Youtube Channel Url:https://www.youtube.com/@SakshiTVDigital

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Vzl_H5T6jlc



Transcript:
(00:00) ప్రస్తుత రోజుల్లో డేటింగ్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. అందులో తాజాగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సరికొత్త ట్రెండ్ డెలూలు డేటింగ్ డెలూలు అంటే డెల్యూషనల్ అంటే భ్రమలో బతకడం అని అర్థం. ప్రేమ పేరుతో వాస్తవాన్ని [సంగీతం] పూర్తిగా విస్మరించి భాగస్వామి గురించి ఒక కల్పితమైన పరిపూర్ణమైన చిత్రాన్ని మనసులో ముద్రించుకునే ధోరణినే డెలూలు డేటింగ్ అంటారు.
(00:27) ఇందులో వ్యక్తులు తమ సంబంధం పట్ల ఒక ఊహా లోకంలో విహరిస్తూ ఉంటారు. ఈ డేటింగ్ ట్రెండ్ లో కనిపించే అతి పెద్ద సమస్య ఏంటంటే ఎదుటి వ్యక్తి వాస్తవానికి ఎలా ఉన్నాడు అనే దానికంటే [సంగీతం] భవిష్యత్తులో ఎలా మారుతాడు లేదా ఏం జరగొచ్చు అనే ఊహలకే వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ భాగస్వామి ప్రవర్ధనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్న వారి వల్ల బాధ కలుగుతున్న వాటిని పట్టించుకోరు.
(00:49) [సంగీతం] కాలం గడిస్తే అంతా సర్దుకుంటుందిలే అని తమని తాము నమ్మించుకుంటారు. [సంగీతం] తాము కోరుకున్నట్లుగా బంధం లేకపోయినా ఒక అద్భుతమైన కథను తమ మనసులో అల్లుకుంటారు. అందుకే ఎదుటి వ్యక్తి ప్రవర్ధనలో ఎన్ని ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా వాటిని గుడ్డిగా [సంగీతం] విస్మరిస్తూ ఉంటారు. దీని వెనక బలమైన మానసిక కారణాలు దాగున్నాయని నిపుణులు చెబుతున్నారు.
(01:10) మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతామేమో అన్న భయం లేదా గత బంధాల్లో ఎదురైన చేదు అనుభవాల వల్ల దొరికిన ఈ కొత్త బంధాన్ని ఎలాగన్నా కాపాడుకోవాలి అని వీరు ఆరాటపడతారు. అలాగే సినిమాటిక్ ప్రేమ నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి సమస్యనైనా జయించొచ్చు అని ప్రేమను అతిగా రొమాంటిసైజింగ్ గా ఉంచడం కూడా ఒక కారణం. అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా ఒకటి.
(01:36) సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ కపుల్స్ వారి రొమాంటిక్ రీల్స్ చూసి [సంగీతం] నిజ జీవితంలో కూడా తమ బంధం ఎలాంటి లోపాలు లేకుండా అలాగే ఉండాలని వీరు ఆశిస్తారు. మొదట్లో ఈ భ్రమల ప్రపంచం చాలా ఆనందంగా సానుకూలంగా అనిపించొచ్చు. కానీ వాస్తవం పదే పదే చంపదెబ్బ కొడుతున్నప్పుడు తీవ్రమైన నిరాశ ఆవహిస్తుంది. [సంగీతం] పదే పదే అంచనాలు తలకిందులు అయినప్పుడు అది మానసికంగా భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం [సంగీతం] చూపుతుంది.
(02:02) పరిస్థితులు చేయి జారినప్పుడు తమను తామే నిందించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అంతేకాకుండా ఒక తప్పుడు వ్యక్తి కోసం కాలం వృధా చేయడం వల్ల నిజమైన ప్రేమను ఆరోగ్యకరమైన [సంగీతం] సంబంధాలను గుర్తించే అవకాశాన్ని కూడా వీరు చేయజార్చుకుంటారు. అందుకే ప్రేమలో గుడ్డి నమ్మకం పనికి రాదు వాస్తవానికి [సంగీతం] దగ్గరగా ఉండే సమతుల్య దృక్పథం ఉండాలి బంధం మొదట్లోనే ఏవైనా తేడాలు గమనిస్తే వాటిని దాటి వేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలి ఒక బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం మంచిదే కానీ అది మీ ఆత్మగౌరవాన్ని మీ భావోద్వేగాలను ఫణంగా పెట్టి మాత్రం కాకూడదని నిపుణులు చెబుతున్నారు. గారు

No comments:

Post a Comment