జీవితం అంటేనే confusions తో నిండిపోయిన ఒక చీకటి గది. పుట్టినప్పటి నుండి చచ్చే వరకు, ప్రతి stage లోనూ ఒకటే గందరగోళం. చదువు, career, relationships, డబ్బు, సంతోషం... దేనిలోనూ clarity లేదు. వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి అని నువ్వు పిచ్చోడిలాగా వెతుకుతున్నావ్ కదా?
కానీ ఇక్కడే నువ్వొక ప్రాథమికమైన తప్పు చేస్తున్నావ్. అసలు నీకు దొరుకుతున్న సమాధానాలు నిజమైనవేనా? కాసేపు ఆ విషయం పక్కన పెట్టు. సమాధానం వెతికే ముందు, అసలు నీకు నువ్వు వేసుకుంటున్న ప్రశ్నలు నీవేనా? అవి సరైనవేనా అని ఎప్పుడైనా Logical గా ప్రశ్నించుకున్నావా?
నిజం చెప్పనా? నీ బుర్రలో మెదిలే ప్రశ్నల్లో 99% నీవి కావు. అవి సమాజం, నీ parents, నువ్వు చూసే movies, media, ఇవన్నీ కలిసి నీ మెదడులో plot చేసిన పనికిమాలిన programs.
ఉదాహరణకు, నువ్వో ప్రశ్న అడుగుతావ్.. నా relationship ని ఎలా నిలబెట్టుకోవాలి? లేదా నేను సంతోషంగా ఎలా ఉండాలి? చూడటానికి ఇవి చాలా అమాయకమైన ప్రశ్నల్లా కనిపిస్తాయి. కానీ వీటికి అడుగున ఉన్న subtext వేరు. అసలు సంతోషం అంటే ఏమిటో నీకు తెలుసా? పక్కింటి వాడి కంటే పెద్ద కారు కొనడమా? society లో status సంపాదించడమా? నువ్వడిగే ప్రశ్నలోనే ఒక పెద్ద అబద్ధం దాగి ఉంది.
నిజానికి నువ్వు సత్యం తెలుసుకోవాలి అనుకోవట్లేదు. నువ్వు పడుతున్న బాధనుంచి తాత్కాలికంగా బయటపడేయడానికి, నీ అహంకారాన్ని satisfy చేయడానికి నీకొక comfort pill కావాలి. ఈ ప్రపంచంలో ఉన్న motivational speakers, గురువులు చేసే వ్యాపారం ఇదే. నువ్వు ఏ ప్రశ్న అడిగితే, దానికి తగ్గట్టు నీకు మత్తు ఇచ్చే ఒక నకిలీ సమాధానం వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే నీకు నిజం చెబితే నువ్వు తట్టుకోలేవ్. వాళ్ళ వ్యాపారం నడవదు.
ఒక సమస్యకి సమాధానం కావాలంటే, ముందు నిన్ను నువ్వు నిర్దాక్షిణ్యంగా ప్రశ్నించుకోవడం రావాలి.
మన channel comments లో ఎంతో మంది, ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. Infact కొంత మంది emails పంపిస్తున్నారు. నాతో personal గ మాట్లాడాలి అని అడుగుతూన్నారు. ఐతే పాపం వాళ్ళు మనస్ఫూర్తిగానే అడుగుతున్నారని తెలిసినా, ప్రతి ప్రశ్నకి ఒక video లేదా ఒక podcast చేయడం, or questions ఎక్కువవుతున్న కొద్దీ, ప్రతి question కి, ఒక్కడ్నే individual గ lengthy replies ఇవ్వడం practical గా సాధ్యం కాని పని. So, పైపైన ఆకులు తుంచితే చెట్టు చావదు, పూర్తిగా వేళ్ళతో సహా నరకాలి అని అర్ధమౌతుంది.
అందుకే, కేవలం నీ పైపైన ఆకలి తీర్చడం కాదు, అసలు నువ్వెందుకు జీవితాంతం ఇలా అసంతృప్తితో అల్లాడుతున్నావో నీకు చూపించడానికి, మనందరి కోసం ఒక కొత్త దారి వేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను.
కొద్ది రోజుల్లో ఒక కొత్త channel start చేయబోతున్నా. దాని పేరే PRATIKULA VEDAM.
ఈ ఫిలాసఫర్ ఆలా అన్నాడు, ఆ ఫిలాసఫర్ ఇలా చెప్పాడు, ఆ పుస్తకంలో ఇలా ఉంది, ఈ పుస్తకంలో ఆలా ఉంది అని, వాళ్లెవరో చెప్పిన మాటలు కాకుండా, కాస్త deep గ, practical గ, మనక్కూడా సొంతంగా ఒక బుర్ర ఉంది గాబట్టి, కాస్త Common Sense ని use చేద్దాం.
ఇది నీ Ego కి, నీ కపటత్వానికి, సమాజం నీ మీద రుద్దిన conditioning కి ఒక వ్యతిరేక వేదం. అయితే, ఇక్కడ కేవలం videos తోనే ఆగిపోకుండా, ఒక Blog ని కూడా start చేసాను.
ఈ blog లో, Videos లో మనం మాట్లాడుకునే దానికంటే కంటే ఇంకా detailed గా, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి అంశాన్ని, బంధాలు, భయం, డబ్బు, కామం, అధికారం, ఇంతవరకు ఎవ్వరూ చర్చించని కోణంలో విశ్లేషిస్తూ, దాదాపు రోజు విడిచి రోజు నేను అందులో రాస్తూ ఉంటాను.
ఇది time-pass కోసం చదివే చెత్త కాదు. ఇది నీ మెదడుకి చేసే ఒక open-heart surgery.
ప్రతి article నిన్ను నిలదీస్తుంది. అసలు ఇలాంటి దృక్పధంతో ఆలోచించొచ్చా? ఈ idea నాకెందుకు తట్టలేదు? అని చదివే, వినే ప్రతి ఒక్కరికీ అనిపించేలానే ఉంటాయి.
సమస్య బయట ఎక్కడో లేదు, సమస్య 'నువ్వు' అనే భ్రమలో ఉంది అని పక్కా logic తో నిరూపించే ప్రయత్నం అందులో జరుగుతుంది.
ఆ Blog లో నీ opinions ని, ఎవరికీ భయపడకుండా free and frank గా comment చేయొచ్చు. వాటి బట్టి, నీ comments కి reply గ, very detailed and indepth గ new artciles లో explain చేస్తాను.
So, నువ్వు నిజంగా నిజాన్ని face చేయగలవా? తట్టుకోగలవా? సమాజం నీకు కప్పిన భ్రమల ముసుగును అడ్డంగా చించేయడానికి సిద్ధమేనా? అయితే PRATIKULA VEDAM లోకి వొచ్చేయ్. లేదంటే, ఆ అబద్ధపు బతుకులోనే చక్కర్లు కొడుతూ, నకిలీ సమాధానాల కోసం వెతుకుతూ బ్రతికేయ్. The choice is yours.😊 #pratikulavedam
PRATIKULA VEDAM blog link:
https://pratikulavedam.blogspot.com/
No comments:
Post a Comment