పూర్వజన్మ వాసనలను మార్చుకోగలమా? Is our life Pre-determined and Well-determined?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2sMVVPZL72s
Transcript:
(00:01) ప్రతి జీవి పూర్వజన్మ వాసనలతో లేదా సంస్కారాలతో ఈ భూమి మీదకి వస్తుంది అన్న విషయాన్ని భారతీయులుగా మనందరం నమ్ముతాం. ఉపనిషత్తులు గాని వేదాలు గాని చివరికి భగవద్గీత గాని ఇదే మాట చెప్తున్నదండి అయితే అసలు ఏం జరుగుతుందంటే బాల్యంలో మనకి తెలియకుండా కొన్ని పూర్వజన్మ వాసనలు మన చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటాయి. అలా ఎందుకు చేయిస్తున్నాయి అన్నది మనకే తెలియదు కానీ అది పూర్వజన్మల వాసనల యొక్క బలం అన్నమాట.
(00:33) అలా అవి మెల్లమెల్లగా మొగదడుగుతూ ఉంటాయి. ఈ జర్మినేషన్ గనుక గమనించే పరిజ్ఞానం గనుక మనల్ని గాన తల్లిదండ్రులకు గనుక ఉంటే ఆ మనం గానీ లేకపోతే ఆ పిల్లలు గాని చాలా దృష్టివంతులు కానీ చాలా మంది పేరెంట్స్ లో ఈ పరిజ్ఞానం ఉండదు. అయినా వాస్తవం ఏంటంటే ప్రతి వ్యక్తిని బాల్యంలో ఆ మాటకు వస్తే ఆ తర్వాత కూడాను ఆ పూర్వజన్మ వాసనగా నడిపిస్తూ ఉంటాయి వాళ్ళు మాట్లాడే తీరు గాని ఆలోచించే విధానం గాన లేకపోతే ఆ పని చేసే తీరు గాని అవన్నీ కూడాను పూర్వజన్మ వాసనల యొక్క లింక్ తో ఉంటాయండి.
(01:11) ఇవి క్రమం క్రమంగా వ్యక్తి పెరుగుతున్న కొద్ది ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇందాక నేను అన్నట్టుగా తల్లిదండ్రులుగా పరిజ్ఞానం లేనప్పుడు ఇక ఆ వ్యక్తి జీవితంలో అలాగే ఉండాలా ఆ పూర్వజన్మ విలువలను ఐమీన్ వాసనలను ఆ వ్యక్తి మార్చుకునే అవకాశం ఉందా అన్నది ఈ వీడియో లోని సారాంశం అండి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఆ వాసనలే మన జీవితం అయిపోతే ఇంకా మనలో ఉన్న క్రియేటివిటీ ఏమి ఉండదా అంటే ఒక ఉత్కృష్ట స్థాయికి ఎదిగే అవకాశం ఉండదా అన్నది ఒక ప్రశ్న
(01:57) అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులు గనుక నిజంగా పసిగెట్టకపోతే మన జీవితం అలాగే కొనసాగుతుందా ఇటువంటి ప్రశ్నలతోనే వీడియో నడుస్తూ ఉంటుందండి ఇప్పుడు ప్రతి అనుభవము ఏం చేస్తుందంటే బాల్యంలో ఆ తర్వాత కూడాను ఒక ముద్రని వదిలి పెడుతుందండి ఇలా అనేక వాసనలు ముద్రలుగా ఏర్పడి మనకు ఒక ధోరణని ఏర్పరుస్తాయి అందువల్లనే ఏ వ్యక్తి కూడాను ఇంకొక వ్యక్తిలాగా ఉండడు.
(02:28) ఇప్పుడు కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచే సంగీతం వైపు ఆకర్షితులు అవుతారు మరి కొంతమంది ధ్యానం వైపు దేవుడి వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు అన్నమాట. మరి కొంతమంది ఏంటంటే అలా మౌనంగా ఉండి దీర్ఘలోచనలో ఉండిపోతూ ఉంటారు. అది వాళ్ళకి బాల్యం నుంచి ఒక ఆటిట్యూడ్ గా మారిపోతూ ఉంటుంది. సరే మరి కొంతమంది హింస కోపం ఒక ఆధిపత్య ధోరణి ఇవన్నీ కూడాను వస్తూ ఉంటాయి అన్నమాట.
(02:54) కొంతమంది చిన్న పిల్లల నుంచే అపారమైన కరుణ చూపెడుతూ ఉంటారు. ఆ కుక్క పిల్లలు గానీ పిల్లలు గానిీ ఏమనా కనిపించాయి అనుకోండి గబగబ వంటింట్లోకి పోయి ఏదో తీసుకొచ్చేసి వాడికి పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఏం చెప్పరు అసలు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా చేస్తూ ఉంటారు ఇలా రకరకాల మనస్తత్వాలు బాల్యం నుంచే మెల్లమెల్లగా బయట పడుతూ ఉంటాయండి.
(03:16) ఈ భారతీయ తత్వశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇవి యాదృచ్చికం కాదు అంటే కేవలం అలా వచ్చేసినవి కాదు అని నేను ఒక రెండు వీడియోల్లో చెప్పాను ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఈ పనిని కిందటి జన్మల్లో చేసి అసంపూర్ణంగా వదిలేసాం. వాటిని మళ్ళీ ఈ జన్మలో మనం కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి అదేంటంటే బాల్యంలో ఈ చైతన్య మనసు అంటే కాన్షియస్ మైండ్ పూర్తిగా అభివృద్ధి చెందదండి ఎందుకంటే ఒక పిల్లవాడు భూమి మీదకి రాంగానే తల్లిపాలు తాగిన తర్వాత మెల్లమెల్లగా ప్రపంచం అంటే ఏమిటో తెలుసుకుంటున్న క్రమంలో అతని యొక్క మైండ్
(04:04) మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటుంది కదా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటుంది అందువల్ల కాన్షియస్ మైండ్ కూడా మెల్లమెల్లగా ఎదుగుతూ ప్రపంచానికి కనెక్ట్ అవుతూ ఉంటుందండి అందుకనే వాళ్ళు కొన్ని కొన్ని పనులు అలవోకగా తెలియకుండా ఈ వాసనల ద్వారా ఇందాక నేను చెప్పినట్టు చేసేస్తూ ఉంటారున్నమాట. అయితే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది దీన్ని అంతర్మనస్సు అని అంటారు.
(04:32) ఈ కాన్షియస్ మైండ్ పూర్తిగా ఎదగకపోయినా ఈ సబ్కాన్షియస్ మైండ్ మన చేత బాల్యంలో తర్వాత ఎదిగిన తర్వాత కూడా ఈ పనులని మెల్లమెల్లగా తోస్తూ ఉంటుంది. చేయిస్తూ ఉంటుంది అంటే అది ఒక ఫోర్స్ అన్నమాట అందుకనే బిడ్డకు ఎవ్వరు ఏమి నేర్పకపోయినా సంగీతం మీద లేకపోతే ధ్యానం మీద ఇందాక అనుకున్నట్టు దేవుడి మీద తెలియకుండా మొక్కు వేర్పడుతూ ఉంటుంది అన్నమాట అలాగే కొంతమంది అసాధారణ భయంతో ఉంటారు.
(05:01) అసలు కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ లక్షణాలు కూడాను పూర్వ సంస్కార బలం అండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది కేవలం బలం మాత్రమే బలం మాత్రమే ఆ బలం ఏ స్థాయిలో ఉందనేది తెలియదు మనకి ఒక్కొకసారి కొన్ని కొన్ని వాసనలు కనుమరుగ అయిపోతూ ఉంటాయి కొత్త వాసనలు బయటికి వస్తూ ఉంటాయి మనిషి అనుకోకుండా పరివర్తన చెందుతూ లోకానికి కొత్తగా పరిచయం అయిపోతూ ఉంటాడు అన్నమాట ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తానండి అదేంటంటే ఈ వాసన అనేది ఒక విత్తనం కదా ఆ విత్తనం పెరగాలంటే వాతావరణం ఉండాలి కదా అంటే నేల బాగు ఉండాలి నీరు దొరుకుతూ ఉండాలి అట్లాగే సఫిషియంట్ సన్లైట్ కూడాను
(05:41) దొరుకుతూ ఉండాలి. అప్పుడే ఈ మామిడి టెంక అనే విత్తనం చిన్న మొక్కగా మారి తర్వాత మహావృక్షంగా మారుతుంది అన్నమాట నేల బాగలేకపోయినా నీరు సరిగ్గా అందకపోయినా సన్లైట్ కూడా సరిగ్గా అందకపోయినా మనందరికీ తెలుసు కదా చెట్టు పెరుగుతుంది కానీ బలహీనంగా పెరుగుతుంది మహా వృక్షం అయ్యే అవకాశం లేదున్నమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బిడ్డలో ఈ సహజ ప్రతిభ ఉంది కదా దాన్ని కూడాను తల్లిదండ్రులు తెలిసో తెలియకో అణచివేస్తే అది క్షీణించే అవకాశం ఉందండి ఆ సహజ ప్రతిభ క్షీణించే అవకాశం ఉంది సహజ ప్రతిభ అంటే ఏం లేదు ఇది వాసన అన్నమాట
(06:28) అయితే ఆధ్యాత్మిక మనసు ఉంది కొన్ని విలువలు ఉన్నాయి మనిషిలో లేకపోతే బాల్యంలో అనుకుందాంండి కానీ ఈ ఊరుకుల పరుగుల జీవితంలో ఈ వెతుకులాట లో ఉండేటప్పటికి ఏమైతాయి అంటే మనలో ఉన్న ఈ వాసనలు అవి నిద్రాణంగా ఉంటాయి అన్నమాట నిద్రాణంగా ఉంటాయి తగిన వాతావరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.
(06:53) అంటే కొందరి జీవితాల్లో ఇదే జరుగుతుందండి. ఉద్యోగ రందిలో పడి సంసార బాధ్యతల్లో కూరికిపోయి చివరికి వాళ్ళకి ఉద్యోగ విరమణ తర్వాత లేకపోతే వ్యాపార విరమణ తర్వాత కొంత ఫ్రీ టైం దొరుకుతుందన్నమాట. బాధ్యతలు అయిపోయాయి. ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనం మడిన ఒక ఆందోళన నుంచి మనం హాయిగా ఇప్పుడు ప్రశాంతంగా దొరికాము అని అనుకున్న టైం లో ఏమవుతుందంటే వాళ్ళలో దాగిఉన్న ప్రతిభ ఈ ప్రశాంతతలో మెల్లగా బయట పడుతూ ఉంటుంది అన్నమాట తర్వాత కొంత కాలానికి కొంతమందికి 10 ఏళ్ళు పట్టొచ్చు కొంతమందికి ఐద ఏళ్ళు పట్టొచ్చు అవి మెల్లమెల్లగా బయటిక వచ్చి అది సామాజికమై సహజ సిద్ధ గుణమై వాళ్ళకి అనుకోకుండా
(07:36) గుర్తు గుర్తింపు తీసుకొస్తూ ఉంటుంది. ఇదేంటి అలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఉన్నటువంటి ఇలా మారిపోయాడు ఏంటి అని మనం అనుకుంటా ఉంటాం. దానికి వాళ్ళ నిద్రాణంగా ఉన్న వాసనలు ఈ లౌకిక జీవితం నుంచి బయట పడిన తర్వాత ఒక ప్రశాంత జీవితం జీవిస్తున్న తర్వాత ఇవన్నీ మెల్లమెలగా బయట పడుతూ ఉంటాయండి అది వాళ్ళ యొక్క వాసనా బలం అన్నమాట అంతకంటే ఏం లేదు.
(07:58) నిజంగా చెప్పాలంటే నా జీవితంలో కూడా అదే జరిగిందండి. చిన్నప్పుడు బాగా పుస్తకాలు చదివేవాడిని ఏ పుస్తకం కనపడినా చదివేవాడిని పెద్దవాళ్ళు ఎవరనా మాట్లాడుతుంటే ఉపన్యాసాలు వినేవాడిని హరకథలు బుర్ర కథలు ఎక్కడున్నా సరే నేను వెళ్ళేవాడిని అక్క గుళ్ళ గుళలో జరుగుతూ ఉంటాయి అయితే ఏదో చెప్పాలి అన్న తపనతో కూడాను నేను మాట్లాడుతూ ఉండేవాడిని వీటన్నిటికీ మూలం మా అమ్మగారు మా నాన్నగారు అనుకోండి వాళ్ళద్దరు చాలా బాగా మాట్లాడుతారు మా అమ్మగారు చాలా దైవభక్తి సంపందరాలు మా నాన్నగారు గొప్ప టీచర్ అన్నమాట బహుశా ఈ జెనటికల్ గా కూడాను ఆ వాసనలు ఏమన్నా నాకు వచ్చాయమో నాకు
(08:28) తెలియదు. అయితే రిటైర్మెంట్ తర్వాత నేను ఇలాగ YouTube స్టార్ట్ చేయటం అనేక విషయాల మీద కృషి చేయడం మాట్లాడటం జరుగుతున్నదండి అలాగే సభల్లో సమావేశాల్లో కాలేజీల్లో యూనివర్సిటీలో ఇలా నేను నా యొక్క సహజమైన ప్రతిభను కొనసాగించే ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే పూర్వజన్మ వాసనల్ని మనం మార్చుకోవచ్చు అదండి ఇక్కడ ప్రశ్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం వాసనలు ఎప్పుడూ కూడా బలమైనవే అంటే విత్తనాలులాగానే కానీ శాశ్వతం కావు కాబట్టి వాటిని మనం మార్చుకోవచ్చు.
(09:11) ఇప్పుడు ఆ వాసన అలాగే ఉందనుకోండి దాన్ని మార్చుకోలేని స్థితిలో ఉన్నామ అనుకోండి మన జీవనం అలాగే కొనసాగిపోతూ ఉంటుంది. అవి బలపడే అవకాశం లేదు. అయితే ఎలాగ అంటే మనిషి లో కేవలం వాసనలుఏమ ఉండవండి. వాసనలే ఉండేది చాలా ముఖ్యమైన విషయం అండి మీరు గమనించండి మనిషిలో కేవలం వాసనలే ఉండవు అతనిలో సాక్షి చైతన్యం కూడా ఉంటుంది. అంటే అన్నింటిని పరిశీలిస్తూ గమనిస్తూ విశ్లేషిస్తూ గుర్తుపెట్టుకుంటూ తనదైన ఒక శైలిని ఒక దశ తర్వాత ఏర్పరుచుకుంటాడు అతను ఇప్పుడు నది వడ్డున చెట్టు ఉందండి లేకపోతే వృక్షం ఉంది.
(09:54) నది నీళ్ళు అలా పారుతూ ఉంటే ఆ నీటిని గమనిస్తూ ఉంటుంది. అవసరమైన మేరకే అది తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ మాటక వస్తే ఆ నదిలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొంతమంది కేరింతలు కొడుతూ ఉంటారు ఒక్కోసారి ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి కొంతమంది ఆత్మహత్యలు కూడా నువ్వు చేసుకుంటూ ఉంటారు వీటన్నిటికీ కూడాను సాక్షిభూతంగా ఉంటుంది. అలాగే మనలో కొన్ని వాసనలు ఉన్నా కూడాను సాక్షి చైతన్యం అనేది మనలో ఉంటుందండి మనలో ఉంటుంది ఇలా ఈ సాక్షి చైతన్యం జరుగుతున్న వాటన్నిటికీ కూడాను సాక్షిగా ఉంటూ ఈ అద్భుతమైన అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటుందండి ఒక వేళ గనుక అటువంటి అవకాశాలు దొరికాయి
(10:37) అనుకోండి వాటిని వదలదు ఎందుకంటే ఆ విత్తనానికి కావలసిన సరిైన వాతావరణం ఒక వయసు తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఈ సాక్షి తన కోపాన్ని గమనించగలదు భయాన్ని గమనించగలదు అట్లాగే అలవాట్లను కూడాను గమనిస్తూ ఉంటుంది. ఈ గమనించడం మొదలైనప్పుడే మెల్లమెల్లగా ఆ వ్యక్తిలో మార్పు మొదలైతూ ఉంటుంది అంటే సరైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట.
(11:00) ఈ మార్పే నిద్రాణంగా ఉన్న వాసన అనే విత్తనాన్ని మొలకెత్తేటట్టు చేస్తుంది. ఇదండి అంటే ఈ మార్పు క్రమక్రమంగా ఏమవుతుందంటే అవేర్నెస్ గా మారుతుంది. అప్పుడు తగిన పరిస్థితుల కోసం వెతుకులాట మొదలైతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము ఆ తరహా వ్యక్తులనే కలుస్తాము అట్లాగే అటువంటి సత్సంగాలకే వెళ్తాము పుస్తకాలే చదువుతాము అటువంటి విషయాలే ఆలోచనలు చేస్తూ ఉంటాము అంతకుముందు సంసారలో పడి మనం లౌకిక జీవనంలో ఉంటాం కదా ఇప్పుడు వాస్తవ జీవితంలోకి మనం అలుగుపెడుతూ ఉంటామండవు చివరికి అది మనకు తెలియకుండా అది క్రమక్రమంగా ధ్యానంగా మారుతుంది. జ్ఞానంగా
(11:44) మారుతుంది ఇప్పుడు నా పరిస్థితి చూడండి రోజు పుస్తకాలు చదవటం కాన్సెప్ట్స్ రాసుకోవడం ఏదో ఒకటి చెప్పాలన్న తపనతో ఇలాగ వీడియో చేయడం అన్నమాట అంటే నిద్రాణంగా ఉన్న ఆశలు హాస్యాలు ఇవన్నీ కూడాను క్రమక్రమంగా బలపడుతూ ఉంటాయండి ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి మనిషి జీవితంలో కూడాను అదే జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే అంతవరకు మనల్ని నిలబెట్టిన ఈ లౌకిక ప్రక్రియలన్నీ కూడాను మెల్లమెల్లగా బలహీనమైపోతూ ఉంటాయి అంటే ఒక ప్రయోజనం వైపుకి మన బలమైన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.
(12:18) సైకాలజిస్ట్ులు వీటిని ఈ జెనటిక్ టెండెన్సీస్ అని సబ్కాన్షియస్ కండిషనింగ్ అని ఎర్లీ చైల్డ్హుడ్ ఇంప్రింటింగ్ అని లేకపోతే టెంపర్మెంట్ అని అంటూ ఉంటారండి. సో ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇక్కడే ఇంకొక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం కూడా దాగుందండి. అదేంటంటే ఈ వాసనలు మనిషిని నడిపిస్తాయి కానీ అవే ఫైనల్ కావు గుర్తుపెట్టుకోవాలి మనం ఈ వాసనలు మనుషులని నడిపిస్తాయి కానీ అవే ఫైనల్ కావు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వచ్చినట్లు మన మనసుల్లో కూడాను రకరకాల వాసనలు వస్తూ ఉంటాయండి కానీ ఆకాశం వేరు మేఘం వేరు కదా అలాగే మనిషి ఒక స్థాయికి వచ్చేటప్పటికీ తన వాసనలు
(13:06) ఉన్నప్పటికీ కూడాను వాటిని గొప్పగా పట్టించుకోడు అయితే వాటిని అలా గమనిస్తూ ఉంటాడు అన్నమాట సాక్షిభూతంగా ఉంటాడు ఎలా అయితే ఆకాశ మేఘాలని గమనిస్తూ ఉంటుందో మనం కూడా రకరకాల వాసనలని సాక్షిభూతంగా మారి గమనిస్తూ ఉంటాం అన్నమాట ఈ వాస్తవాన్ని గనుక మనం తెలుసుకుంటే మనం యాంత్రిక జీవితం నుంచి చైతన్య జీవితం వైపుకు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఉంటామండి.
(13:31) ఇంకో ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేంటంటే నదీ ప్రవాహం ఉందండి అంటే అదిఒక చైతన్యం అవి పూర్వవాసనలు పడవ ఉంది కదా అది మన శరీరము ప్లస్ మనసు మరి తెడ్డు లేకపోతే ఆ మన పడవ అనే శరీరం ప్రయాణం సాగిస్తుందా సాగించదు కదా కాబట్టి ఆ తెడ్డు ఏదైతే ఉందో అదే జాగృత అండి అన్ని వాసనలను అధిగమించి తనదైన బలమైన ఒక వాసనని ఒక జీవన ప్రవృత్తిని ఓ జీవన సరళ అనేది పట్టేసుకుంటుంది అన్నమాట.
(14:06) అంటే ప్రవాహాన్ని పూర్తిగా ఆపలేం కానీ తెడ్డును ఉపయోగించి దిశని కొంతవరకు మనం మార్చగలం. ఇదే మనిషి యొక్క అసలు శిషలైన జీవితం అండి. అంతే అంటే ఆ స్థాయిలో అతను ఏమనుకుంటాడుఅంటే ఇది కాదు జీవితం ఇంకేదో ఉంది అని అనుకుంటూ ఉంటాడు అన్నమాట. అందుకే ఋషి వాక్యం ఒకటి ఉంది మనిషి తన గతానికి బానిసగా ప్రారంభం అవుతాడు కానీ స్పృహతో జీవిస్తే సృష్టికర్త అయతాడు అంటే కొత్త ఆలోచన చేస్తాడు అని మనిషి తన గతానికి బానిసగా ప్రారంభం అవుతాడు కానీ స్పృహతో గనుక జీవిస్తే అతను తన జీవన శైలిని అద్భుతంగా మార్చుకొని దాన్ని సామాజికంగా చేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అంటే జీవన
(14:49) సాఫల్యం వైపుకి అడుగులు వేస్తాడు. అందుకనే సినిమా పాట ఏదో ఉంది కదా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని ఇదేనండి ఇదే ఇంతకంటే ఏం లేదు [నవ్వు] [ఆశ్చర్యం] అయితే ఈ జీవన కర్మల్లో ఏం జరుగుతుందంటే వాసనలు బలంగానే ఉంటాయి ఆ వయసు తగ్గట్టు అలా నడిపిస్తూ ఉంటాయి కానీ పరిస్థితులు కూడాను బలంగా ఉంటాయండి కానీ మనలో ఒక చైతన్యం ఉంది చూసారా ఒక స్పృహ ఉంది చూసారా అది అన్నిటి కన్నా గొప్పదండి అది అన్నిటికన్నా గొప్పది ఈ స్పృహ నే అంతరాత్మ రూపంలో మనలో ఉంటూ ఎప్పుడు నిజం చెబుతూ దిశా నిర్దేశం చేస్తూ ఉంటుందండి చివరికి చెప్పొచ్చేది అదే నేను
(15:34) అయితే ఒక్కసారి మళ్ళీ బాల్యంలోకి వెళ్దామండి అంటే బాల్యంలో జరుగుతున్న పొరపాట్లు ఇది ముఖ్యంగా పేరెంట్స్ గమనించాలి. బాల్యంలో పిల్లలకు ప్రేమ దొరికిన గద్ది వాళ్ళలో సహజత్వం తొందరగా బయటిక వస్తూ ఉంటుంది. ఆ విత్తనం లాంటి వాసన త్వరగా బయటికవచ్చి మొక్కగా గారి మారి ఆ తర్వాత వృక్షంగా మారి ఎంతమందికో నీడని ఫలాలని ఇస్తూ ఉంటుందండి.
(15:57) ఈ ప్రేమతోనే నిజంగా ప్రపంచాన్ని జయించవచ్చు. అందుకనే తల్లిదండ్రులు పిల్లల్ని తక్కువ చేయకుండా కసురుకోకుండా కించపరచకుండా ప్రేమతో గనుక జాగ్రత్తగా పెంచినట్లయితే వాళ్ళలోని వాసనలు తొందరగా బయటక వచ్చి బలపడతాయి. చివరిగా ఒకటే ఒక వాక్యం అండి పిల్లలు అమూల్యం అయితే రేపు పొద్దున మీరు మూల్యం చెల్లించుకునే పరిస్థితి రాదండి అంటే వృద్ధాశ్రమాలకు పోయే పరిస్థితి రాదండి.
(16:26) ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు ఎంత గొప్పగా చెప్పానో తెలియదండి. అంటే ఏదో ఆలోచనలు వచ్చాయి కొన్ని రాసుకున్నాను ఇలా మీతో పంచుకుంటున్నానండి ఇదే వీడియోలోన సంగతి విన్నందుకు కృతజ్ఞతలు నచ్చితే నలుగురికి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ని పెట్టండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడొచ్చు నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ అండి.
(16:49) YouTube లోకి వెళ్లి ఎంఏఆర్టిహ్ ఐ స్పేస్ హచ్కఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్ యు ఆర్ఐ పూరూర్ అని మా ఇంటి పేరు వస్తుందండి. ఉంటానండి నమస్కారం.
No comments:
Post a Comment