ప్రేమించడం చిన్న విషయం కాదు… || ఆచార్య ప్రశాంత్ #shortvideo #shortsfeed #telugu #love #ytshorts
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mTXQvdloBI8
Transcript:
(00:00) ప్రేమ అంటే నేను నిన్ను సంతోష పెట్టడం నువ్వు నన్ను సంతోష పెట్టడం కాదు అస్సలు కాదు ఎవరి వల్ల అయితే శారీరక సుఖం దొరుకుతుందో ఎవరి వల్ల మనసుకి హాయిగా ఉంటుందో లేదా ఎవరి వల్ల డబ్బు దొరుకుతుందో వాళ్ళనే మనం ప్రేమిస్తున్నాం అనుకుంటాం. మన ప్రేమ అంటే ఇదే కదా ఎదుటి వారికి సుఖాన్ని ఇవ్వడం ప్రేమ కాదు. ఎదుటి వారి నుండి సుఖాన్ని ఆశించడం కూడా ప్రేమ కాదు.
(00:19) మనం ఎవరినైతే ప్రేమిస్తామో [సంగీతం] వాళ్ళకి కేవలం సుఖాన్ని ఇవ్వడం ముఖ్యం కాదు. అలాగని వాళ్ళని బాధ పెట్టాలని కూడా కాదు. దీని అర్థం ఏంటంటే మనం ప్రేమించే వ్యక్తి గురించి వీళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి అని గాని బాధ పెట్టాలి అని గాని మనం ఆలోచించం. వాళ్ళ గురించి మన మనసులో ఎప్పుడూ ఒకే ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే వీళ్ళకి నిజాన్ని [సంగీతం] ఎలా చూపించాలి వీళ్ళకి స్వేచ్ఛను ఎలా ఇవ్వాలి వీళ్ళు ఇంకా గొప్పగా ఇంకా మెరుగ్గా ఎలా ఎదగాలి వీళ్ళకి ఆకాశమంతా ఎత్తుని ఎలా ఇవ్వాలి నువ్వు ఎవరికైతే ఆకాశాన్ని ఇవ్వాలని చూస్తావో [సంగీతం] వాళ్ళు నిన్ను తిడతారు.
(00:48) ఎందుకంటే వాళ్ళకి కావలసింది నేల మీద ఒక చిన్న ముక్క [సంగీతం] కానీ నువ్వు వాళ్ళకి ఆకాశాన్ని ఇవ్వాలని చూస్తున్నావ్ పర్వాలేదు. ప్రేమలో చాలా ఓపిక ఉంటుంది. చాలా సహనం ఉంటుంది. అవతల [సంగీతం] వ్యక్తి నిన్ను తిట్టినా సరే ప్రేమ ఆ తిట్లను కూడా భరిస్తుంది.
No comments:
Post a Comment