తమిళనాడు ఈ స్థితికి ఒక్కరోజులో రాలేదు. ఇది 5 ఏళ్ల రాజకీయాల ఫలితం కాదు. దాదాపు 200 ఏళ్లుగా నెమ్మదిగా నిర్మించిన ఆలోచన. బ్రిటిష్ పాలకులకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. హిందూ నాగరికత బలంగా ఉన్నంత వరకు భారతదేశాన్ని పూర్తిగా మార్చడం కష్టం. కానీ తమిళనాడులో వాళ్లకి పెద్ద అడ్డంకి ఎదురైంది. అక్కడి ప్రజలు గట్టిగా హిందూ సంప్రదాయాల్లో ఉండేవారు. గుడులు బలంగా ఉండేవి. భక్తి ఉద్యమం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆళ్వార్లు, నాయనార్లు అక్కడివాళ్లే. 1822 నుండి 1826 మధ్య జరిగిన థామస్ మన్రో సర్వేలో తమిళనాడులో గురుకులాల్లో చదివిన విద్యార్థుల్లో పెద్ద భాగం శూద్రులేనని నమోదైంది. అంటే తర్వాత చెప్పినట్టు “హిందూ వ్యవస్థ వల్లే అందరూ అణచివేయబడ్డారు” అనే కథ అంత సింపుల్ కాదు. అప్పుడు వాళ్లు కొత్త పద్ధతి మొదలుపెట్టారు. తమిళుడిని హిందువు నుండి వేరు చేయాలని నిర్ణయించారు. “నువ్వు హిందువు కాదు…” “నీ సంస్కృతి వేరు…” “నీ చరిత్ర వేరు…” అని నెమ్మదిగా నమ్మించడం ప్రారంభించారు. 1816లో ఫ్రాన్సిస్ ఎలిస్ అనే బ్రిటిష్ అధికారి దక్షిణ భారత భాషలు సంస్కృతానికి వేరు అని చెప్పాడు. తరువాత థామస్ మన్రో ని తిట్టి ....ప్రత్యేకంగా 1835 లో మెకాలే పిలిపించ బడ్డాడు. దాని ప్రభావం 2026 లో కూడా ఉందిగా ... కాంగ్రెస్ మినిస్ట్రీస్ తోటి ..... 1856లో రాబర్ట్ కాల్డ్‌వెల్ అనే మిషనరీ ఆ ఆలోచనను ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. “ఆర్యులు బయటివాళ్లు…” “ద్రావిడులు అసలు స్థానికులు…” “బ్రాహ్మణులు ఆక్రమణదారులు…” అనే భావనలను వ్యాప్తి చేశాడు. ఈ ఆలోచనలు కేవలం పుస్తకాలలోనే ఆగిపోలేదు. చదువుల్లోకి వెళ్లాయి. పాఠ్యపుస్తకాలలోకి వెళ్లాయి. తర్వాత ప్రజల ఆలోచనల్లోకి వెళ్లాయి. 1901లో బ్రిటిష్ జనగణనలో ఉత్తర భారతీయుడు - ఆర్యుడు దక్షిణ భారతీయుడు - ద్రావిడుడు అని వర్గీకరణ చేశారు. తర్వాత ఈ ఆలోచనలు రాజకీయ రూపం దాల్చాయి. జస్టిస్ పార్టీ వచ్చింది. బ్రిటిష్ మద్దతు ఇచ్చింది. తర్వాత పెరియార్ ఉద్యమం వచ్చింది. హిందూ దేవుళ్లపై విమర్శలు, బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు, వేరు ద్రావిడ దేశం డిమాండ్. ఇవి పెరుగుతూ వచ్చాయి. తర్వాత వేలాది హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లాయి. ఆ దేవాలయాలు కేవలం ప్రార్థన స్థలాలు కాదు. భూములు, ఆస్తులు, సమాజ ఆర్థిక బలం. కానీ చర్చిలు, మసీదులు మాత్రం స్వతంత్రంగానే ఉండిపోయాయి. అంటే హిందూ సమాజం యొక్క సంస్థాగత శక్తి బలహీనపడింది. ఆ తర్వాత సినిమాలను ఉపయోగించారు. సినిమాల ద్వారా ద్రావిడ రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. డైలాగులు, స్క్రిప్టులు, హిందూ సంప్రదాయాలపై ఎగతాళి, “ద్రావిడ గర్వం” పేరుతో కొత్త గుర్తింపు. సినిమాల్లో బొట్టు పెట్టుకున్నవాడిని వెనుకబడినవాడిలా, ఆచారాలు పాటించేవాడిని హాస్య పాత్రలా చూపించడం కేవలం వినోదం కాదు. అది మెల్లగా మనసుల్లోకి వెళ్లే మానసిక యుద్ధం.#hindu #hinduism
Sekarana

No comments:
Post a Comment