*కష్టం*
*మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది! దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు!*
*అదిగో..... అక్కడుంది అని చూపించినా కనిపించదు!*
*కోపం*
*ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపంలాంటిది! ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు! కానీ అది చేసే నష్టం మాత్రం మాములుగా ఉండదు.*
*జీవితం*
*ఒక రైలు ప్రయాణం లాంటిది! మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే.. మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది!*
*కోపం, కష్టం, జీవితం*
*మూడూ మనవే కానీ... మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు! మనకు చెప్పి రావు, పోవు..*
*దయచేసి నేను ఏదో వేదాంతం చెప్తున్నాను అనుకోకండి..*
*వాస్తవాన్ని వివరిస్తున్నాను అంతే..*
*కష్టం చూసి బేంబేలు పడిపోకండి, కష్టాన్ని చుట్టములా రానివ్వండి, మనతో పాటు ఒక రెండు రోజులు ఉండనివ్వండి.. తర్వాత నవ్వుతూ సాగనంపండి.. లేదంటే అలవాటుగా మార్చుకుంటే, అది మనకు జీవిత భాగస్వామిలా అంటిపెట్టుకునే ఉండిపోతుంది..*
*కష్టం వచ్చినప్పుడు భయపడితే ఆ కష్టం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు.. నువ్వు ఎంత అన్నట్టు కష్టాన్ని చూసి నవ్వితే అది ఇట్టే పారిపోతుంది..*
*ఇక కోపం ఇది మనలోనే ఉంటుంది, మనల్నే దహించి వేస్తుంది.. కాబట్టి కోపాన్ని అధిగమించమని నేను చెప్పను. ఎందుకంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు.. కానీ కోపాన్ని దిగమింగుకోండి..కోపం పదిమందిని దూరం చేస్తే,ప్రేమ వందమందిని దగ్గర చేస్తుంది. కోపంలో కోల్పోవడమే తప్ప దక్కించుకోవడం, సాధించడం ఏమీ ఉండదు..*
*కాబట్టి ఎవరి మీదైనా కోపం వచ్చిన ప్రతీ సారి అంతకుముందు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోండి.. ఆ కోపం ప్రేమగా మారిపోతుంది..*
*ఎప్పుడైతే కోపాన్ని దిగమింగుతూ, కష్టాన్ని నవ్వుతూ స్వీకరిస్తామో అప్పుడు ఎవరి జీవితమైనా స్వర్గతుల్యమవుతుంది.. కష్టానికి భయపడి పోకుండా, కోపాన్ని అధిగమించుకుంటూ, అందరూ ఆనందమైన జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ....*
🟢🟡🔴🔵🙏🔵🔴🟡🟢
Have a nice day 😊
No comments:
Post a Comment