మనుషులు!
***********
పక్షిజంతు సమూహాలకు
ఉన్నప్రేమమనిషికి లేదు!
వీడిని వాటితో పోల్చొద్దు
అవిబాధపడతాయి!
దున్నపోతా!కుక్కా!నక్కా
కోతీ!గాడిదా.. ఇవి అన్నీ
ప్రేమలోఅగ్రస్థానంతెల్సా!
వీడెందుకూ పనికి రాడు!
కుక్కపిల్ల'కుంట'లోపడితే
అదిచూసినకోతిపిల్లబాధ
జాతివివక్షకూడా లేదు!
కిచకిచమంటూ ఏడుపు!
పిల్లిపిల్లకుపాలిచ్చేకుక్క!
కాకి చనిపోతే చుట్టూ
కాకులుచేరి 'కాకిగోల'!
గోలకాదుహృదయవేదన
కాని మనుషులకేమైంది?
రోడ్డుపైప్రమాదంజరిగితే
వీడు వీడియో తీస్తాడు!
చూసుకుంటూ పోతాడు!
వీధిలో సంగతి సరే!
ఇంట్లోనే దిక్కులేదు!
డబ్బుకోసం గడ్డితిని
లుప్తమైన ప్రేమలు!
భార్యాభర్తలుతల్లీపిల్లలు
అక్రమసంబంధాలు
హత్యలు ఉన్మాదం
ఎవరికిఎవరోఈలోకం!
విలువల్లేవు!డబ్బుకోసం
ఎంత నీచానికైనా రెడీ!
కొట్టుకుచస్తున్నారు!
దున్నపోతు వెధవలు!
అయ్యో!దున్నపోతుతో
పోలిక కుదరదు!ఎలా
తిట్టాలోఅర్ధం కావట్లేదు!
చావండి 'డబ్బు'కోసం!
గల్లీ తగాదాలే కాదు
ఢిల్లీ రాజకీయాలు
ప్రపంచమంతా డబ్బే!
'చిన్న'లేదు'పెద్ద'లేదు !
ప్రేమలేమైపోయాయ్!
డబ్బులు మింగేసాయ్!
అంతా నటచక్రవర్తులు!
డబ్బులు!మనుషులు!
********
-తమ్మినేని అక్కిరాజు
హైదరాబాద్
13-5-2026
No comments:
Post a Comment