ఒక్క క్షణంలో అంతా పోతుంది, గర్వపడకు! | Adi Shankaracharya Life Changing Philosophy | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=t_QwqX3KFNM
Transcript:
(00:05) బట్టలక ఇచ్చే వాల్యూ మనిషికి ఇవ్వని సమాజం ఇది. మీరు రోజు 10 సార్లు అద్దంలో చూసుకునే మీ ముఖం ఒంటి మీద వేసుకునే బ్రాండెడ్ బట్టలు కాళ్ళకు తొడిగే షూస్ ఇవే ఈ రోజుల్లో మీ విలువను డిసైడ్ చేస్తున్నాయి. మీరు ఎలాంటి వారనేది పక్కన పెడితే మీరు ఎలా కనిపిస్తున్నారనే దాన్ని బట్టే ఈ లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఒక ఖరీదైన షోరూం కి చిరికిన బట్టలతో వెళ్ళండి.
(00:29) వాడు మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వడు అదే అప్పు చేసి కొన్న బ్రాండెడ్ సూట్ వేసుకొని వెళ్ళండి వంగి వంగి సలాం కొడతాడు. మనిషి లోపల ఏముంది అని చూసే ఓపిక ఇంట్రెస్ట్ ఈ సొసైటీకి ఎప్పుడో పోయాయి. బయట కనిపించే హంగుల్ని చూసి జడ్జ్ చేసే ఒక బూటకపు లోకంలో మీరు బ్రతుకుతున్నారు. మీకో విషయం చెప్పనా మీరు వేసుకునే బట్టలు తీసేసినంత మాత్రాన మీ క్యారెక్టరే మారిపోదు కానీ మిమ్మల్ని చూసే జనాల మైండ్ సెట్ మారిపోతుంది.
(00:56) నిజం ఏంటంటే మనం ఒక బ్రమ సామ్రాజ్యంలో జీవిస్తున్నాం. ఆదిశంకరాచార్యుల వారు మోహముద్గారం స్తోత్రంలో ఒక మాట చెప్పారు మా కురుధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలః సర్వం అంటే మీకున్న ధనం మీ చుట్టూ ఉన్న ధ్యానం మీకున్న అందం చూసుకొని గర్వపడకండి. కాలం వీటన్నిటిని ఒక్క క్షణంలో లాగేసుకుంటుందని ఆయన హెచ్చరించారు. కానీ ఈరోజు 18 నుంచి 35 ఏళ్ల యువత ఏం చేస్తుంది? అదే బాహ్య సౌందర్యం వెనకాలఇస్గ [సంగీతం] ఫిల్టర్స్ వెనకాల బ్రాండెడ్ ట్యాగుల వెనకాల పరిగెడుతుంది.
(01:30) లోపల వ్యక్తిత్వం శూన్యం కానీ బయట మాత్రం అంతా రిచ్నెస్ ఒక మనిషి వేసుకున్న బట్టల రేటును బట్టి వాడి క్యారెక్టర్ అంచనా వేసే ఈ సమాజంలో అసలైన సమస్య ఎక్కడఉందో తెలుసా అది ఎదుటి వారి చూపులో లేదు. ఆ చూపును చూసి మిమ్మల్ని మీరు మార్చేసుకుంటున్న మీ బలహీనతలో ఉంది. మీ బట్టల కోసం లుక్స్ కోసం పడే తపనలో సగం కూడా మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడానికి పెట్టడం లేదు.
(01:54) ఒక 5000 షర్ట్ కొంటే వచ్చే కాన్ఫిడెన్స్ ఒక మంచి పుస్తకం చదివితేనో ఒక మంచి అలవాటు నేర్చుకోవడంలోనో రావడం లేదు మీకు ఎందుకంటే మీకు లోపల స్టఫ్ ముఖ్యం కాదు. బయట జనాలు ఇచ్చే వావ్ అనే కామెంట్ ముఖ్యం రోడ్డు మీద వెళ్తున్న ఒక పేదవాడు ఎంతో జ్ఞానంతో మాట్లాడితే పిచ్చోడు అంటారు. అదే ఒక సెలబ్రిటీ సూటు వేసుకొని సూది మాట్లాడిన ఫిలాసఫీ అంటారు.
(02:18) ఈ లోకం మిమ్మల్ని ఒక వస్తువులాగా చూస్తుంది. ఈ లుక్స్ వర్సెస్ క్యారెక్టర్ యుద్ధంలో మీరు రోజు రోజుకి మీ అసలైన ఉనికి కోల్పోతున్నారు. మీ బట్టల విలువ పెరుగుతుంది కానీ ఒక మనిషిగా మీ విలువ పడిపోతుంది. ఈ సమాజం ఒక పెద్ద మార్కెట్ [సంగీతం] ఇక్కడ ప్రతి ఒక్కడు తనని తాను అమ్ముకోవడానికి రెడీగా ఉన్నాడు మీరు వేసుకునే డ్రెస్ అవ్వచ్చు మీరు వాడే ఫోన్ అవ్వచ్చు మీరు మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ అవ్వచ్చు ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని కప్పేయడానికి మీరు వాడుతున్న ముసుగులు లోపల ఏదో తెలియని ఒక బాధ ఒక అభద్రత భావం దాన్ని కవర్ చేయడానికి బయట రంగులు పోసుకుంటున్నారు. రోడ్డు మీద
(02:52) వెళ్లేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూస్తే [సంగీతం] మీ క్యారెక్టర్ తక్కువ అవుతుంది అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు. మీ బట్టలు బాలేవని ఫీల్ అవుతారు ఎందుకంటే మీ ఐడెంటిటీ మీరు ఆ వస్తువులతోనే ముడేసుకుంటున్నారు కాబట్టి మనిషి విలువను బట్టల రేట్లతో కొలిచే ఈ దౌర్భాగ్యపు వ్యవస్థ చూసి కూడా మీకు ఎందుకు కోపం రావట్లేదు ఎందుకు మీరు కూడా అదే మందలో కలిసిపోతున్నారు నిజం ఏంటంటే ఈ లోకం మిమ్మల్ని ఒక భ్రమతో బతికేలా ట్రైన్ చేస్తుంది.
(03:21) ఆదిశంకరాచార్యుల వారు అంగం కలితం ఫలితం ముండం దశ నవహితం జాతం తుండం అన్నారు. అంటే ఒక రోజు వయసు అయిపోతుంది. శరీరం ముడతలు పడిపోతుంది. నోట్లో పళ్ళు ఊడిపోతాయి. జుట్టు నెరిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది మీ గ్లామర్ అప్పుడు ఎక్కడికి పోతాయి మీ బ్రాండెడ్ బట్టలు. ఈరోజు మిమ్మల్ని నిలబెట్టేది మీ రూపం కాదు మీ క్యారెక్టర్ మాత్రమే. కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నారు చూశారు వీళ్ళకి రేపటి గురించి ఆలోచించే తేలిక లేదు.
(03:45) ఈరోజు Instagram లో లైకులు రావాలి. పక్కనోడు చూసి ఈర్ష పడాలి అంతే. క్లారిటీ లేని ఈ మైండ్సెట్ వల్లే సమాజం మిమ్మల్ని ఈజీగా వాడుకుంటుంది. సమస్య ఎక్కడఉందో తెలుసా బాహ్య సౌందర్యానికి ఇచ్చే ప్రయారిటీలో ఒక శాతం కూడా మీ ఆలోచనకి మీ క్రమశిక్షణకి ఇవ్వలేకపోతున్నారు. [సంగీతం] మీరు ఎంత పెద్ద బ్రాండెడ్ బట్టలు వేసుకున్నా మీరు నోరు తెరిస్తే మీ సంస్కారం ఏంటో తెలిసిపోతుంది.
(04:09) [సంగీతం] మీ ఆలోచనల్లో మురికి ఉంటే మీరు వేసుకునే పట్టు బట్టలు కూడా దాన్ని దాచలేవు. [సంగీతం] కానీ మనం ఆ మురికిని కడగడానికి ఇష్టపడం. కేవలం పైన పర్ఫ్యూమ్ కొట్టుకొని తిరుగుతాం. బట్టలక ఇచ్చే వల్యూ మనిషికి ఇవ్వని ఈ లోకంలో మీరు ఒక వస్తువుగా మారిపోతున్నారు అనేది చేదు నిజం కాకపోతే ఆ విషయం మీకు అర్థం కాదు అనుకోండి ఈ రోగం మనకి ఎందుకు పట్టుకుంది ఈ సమస్య వెనుకున్న అసలు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా దానికి ప్రధాన కారణం మనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరియు ఈ సమాజం మన నిత్యన వృద్దిన సక్సెస్ డెఫినిషన్ చిన్నప్పటి నుంచి మనక ఏం నేర్పారు ఎవడైతే
(04:42) సూటు బూటు వేసుకొని కార్లోనుంచి దిగుతాడో వాడే గొప్పవాడు. ఎవడైతే సింపుల్ గా ఉంటాడో వాడు వేస్ట్ గాడు. సినిమా హీరోల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ల వరకు ప్రతి ఒక్కరు చూపిస్తున్నది ఇదే మీ బ్రెయిన్ ని వాళ్ళు అలా ప్రోగ్రాం చేశారు. మీరు ఒక రోబోలా మారిపోయారు. వాడు చూపించిన బ్రాండ్ ని మీరు కొనాలి.
(05:01) వాడు క్రియేట్ చేసిన ట్రెండ్ ని మీరు ఫాలో అవ్వాలి. లేకపోతే మీరు వెనక పడిపోయినట్లే. నిజం ఏంటంటే ఈ రోజుల్లో మీ ఆలోచనలు మీవి కావు. మీ టేస్టులు మీవి కావు. ఎవడో డిసైడ్ చేస్తున్నాడు మీరు ఏ బట్టలు వేసుకోవాలో ఎవడో చెప్తున్నాడు మీరు ఎలా కనిపిస్తే అందంగా ఉంటారో మీ మైండ్ ని కార్పొరేట్ కంపెనీలు హైజాక్ చేశయి. మీకు ఒక బ్రమ నమ్ముతున్నాయి.
(05:22) మీరు దాన్ని నిజమని కొనుకుంటున్నారు. ఒక ఖరీదైన వాచ్ పెట్టుకుంటే మీ టైం మారిపోదు. ఒక బ్రాండెడ్ షూ వేసుకుంటే మీ గమ్యం మారదు. కానీ ఇవి లేకపోతే నేను సమాజంలో తక్కువైపోతానేమో అనే ఒక తెలియని భయం మీలో క్రియేట్ చేశారు. [సంగీతం] ఆ భయమే ఈ సమస్యకి మూలం. ఆ భయమే మిమ్మల్ని క్యారెక్టర్ కంటే లుక్స్ వెనకాల పరిగెత్తేలా చేస్తున్నాయి.
(05:43) మీరు బ్రాండెడ్ కార్లలో ఉన్నంతవరకే ఖరీదైన డ్రెస్సులు ఉన్నంతవరకే ఈ లోకం మిమ్మల్ని ఓనర్స్ లాగా చూస్తుంది. మీరు వాళ్ళు అనుకున్న లుక్ లో లేకపోతే మిమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించరు. ఈ కృత్రిమమైన సంబంధాల కోసం ఈ తాత్కాలికమైన మెచ్చుకోళ్ళ కోసం మీరు మీ అసలైన వ్యక్తిత్వాన్ని [సంగీతం] మీకున్న ప్రశాంతతని దయచేసి తాకట పెట్టకండి.
(06:07) ఈ మోసపూరితమైన వలయం ఎందుకు క్రియేట్ అయిందో ఎందుకంటే సమాజానికి ఆలోచించే మనుషుల కంటే కేవలం చూసి మురిసిపోయే గొర్రెలే కావాలి. మీరు లోతుగా ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళ బిజినెస్ లు నడవవు. మీ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే మిమ్మల్ని ఎవడూ డామినేట్ చేయలేడు. అందుకే మిమ్మల్ని ఎప్పుడూ బాహ్య ప్రపంచం వైపు తిప్పుతున్నారు. [సంగీతం] నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం కాదు.
(06:27) నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేదానికి మిమ్మల్ని అడిక్ట్ చేసేశారు. ఈ అడిక్షన్ యువతర్ని ఒక డార్క్ నెట్ లోకి నెట్టేస్తుంది. లోపల మాత్రం భయంగా బ్రతికేస్తూ బయట మాత్రం గొప్పలు ప్రదర్శించే ఒక డ్రామా కంపెనీగా మనల్ని మార్చేస్తున్నారు. సరే సమస్య ఏంటో తెలిసింది. ఇది ఎందుకు వస్తుందో కూడా అర్థమైంది. మరి దీన్ని ఎలా అధిగమించాలి? ఈ బూటకపు ప్రపంచం నుంచి బయటపడటం ఎలా? దానికి ఒకటే మార్గం.
(06:52) మిమ్మల్ని మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవడం. ఈ క్షణం నుంచి జనాల జడ్జిమెంట్లకు వాల్యూ ఇవ్వడం ఆపేయండి. వాడు మీ బట్టలు చూసి మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నాడా వేసుకొనివ్వండి. అది వాడి అజ్ఞానం మీ విలువని ఒక డ్రెస్సో ఒక కారో డిసైడ్ చేయకూడదు. మీ నాలెడ్జ్ మీ ఆటిట్యూడ్ మీ క్యారెక్టర్ డిసైడ్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ మీ కలల్లో కనిపించాలి.
(07:12) మీరు ఒక రూమ్లోకి అడుగు పెడితే మీరు వేసుకున్న బ్రాండెడ్ బట్టలు కాదు మీ పర్సనాలిటీ మాట్లాడాలి. నిజం ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం మీ వల్ల కాదు. మీరు ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా ఏదో ఒక తప్పు వెతికేవాడు వెతుకుతూనే ఉంటాడు. అందుకే ఈ బాహ్య ప్రదర్శనల మీద పెట్టే శ్రద్ధని మీ మైండ్ సెట్ ని మార్చుకోవడం మీద పెట్టండి.
(07:34) ఆదిశంకరాచార్యులు గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు. వైరాగ్యం ఎవ్వరికీ సుఖాన్ని ఇవ్వదు. ఇక్కడ వైరాగ్యం అంటే అడవులకు వెళ్ళడం కాదు ఈ బాహ్య వస్తువుల మీద జనాల మెచ్చుకోళ్ల మీద ఉన్న మోహాన్ని వదిలేయటం. ఆ అటాచ్మెంట్ ని కట్ చేసిన రోజు మీకు అసలైన ఫ్రీడం వస్తుంది అని. ఎప్పుడైతే మీరు ఎవడో ఏదో అనుకుంటాడనే భయం నుంచి బయట పడతారో అప్పుడే మీరు నిజంగా బ్రతకడం స్టార్ట్ చేస్తారు.
(07:57) మీకు తెలుసా మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ చుట్టూ ఉన్న బూటకపు మనుషులు అంతగా ఫిల్టర్ అవుతారు. మీకు [సంగీతం] నచ్చినట్లుగా ఉండటం వల్ల మీకు నచ్చిన మనుషులు మీ పక్కనే ఉంటారు. మీరు నచ్చని వాళ్ళు మీ పక్కన నుంచి వెళ్ళిపోతారు. ఈ రోజు నుంచి ఒక రిస్క్ తీసుకోండి. సమాజం చెప్పే రూల్స్ ని బ్రేక్ చేయండి.
(08:16) కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. లుక్స్ కోసం వేల రూపాయలు తగలేసే ముందు ఇది నా క్యారెక్టర్ కి ఏం యాడ్ చేస్తుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాలెడ్జ్ పెంచుకోండి స్కిల్స్ నేర్చుకోండి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీరు సాదా సీదా బట్టల్లో ఉన్న ఈ లోకం మీ వైపు చూస్తుంది. అంతేకాకుండా ఇంత పెద్ద మనిషి ఎంత సింపుల్ గా ఉన్నాడో చూడండి అని చెప్పేసి మీకు వాళ్ళు లేనిపోని వాల్యూని యాడ్ చేస్తూ ఉంటారు.
(08:42) సమస్య అధిగమించడం అంటే సమాజానికి ఎదురు తిరగడం కాదు. సమాజం మిమ్మల్ని ఇన్ఫ్లయెన్స్ చేయకుండా మీ చుట్టూ ఒక స్ట్రాంగ్ మైండ్ షీల్డ్ ని బిల్డ్ చేసుకోవడం వాడు బట్టలకు వాల్యూ ఇస్తున్నాడా ఇవ్వనయండి. మీరు మాత్రం మనిషికి వాల్యూ ఇవ్వండి. మీ చూపు మారితే మీ ప్రపంచం మారుతుంది. ఇతరుల జడ్జిమెంట్లనే చెరసాల నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోండి.
(09:01) ఎందుకంటే మీ లైఫ్ కి మీరే హీరో ఎవడో రాసిన స్క్రిప్ట్ కి మీరు జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా మిగిలిపోకూడదు. ఇప్పుడు అసలైన క్లారిటీ కి వద్దాం. మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్ళాలి ఈ లుక్ వర్సెస్ క్యారెక్టర్ లో గెలిచి ఒక పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ లా ఎలా ఎదగాలి దానికి మొదటి స్టెప్ మీ సెల్ఫ్ వర్త్ ని కనుక్కోవడం.
(09:22) మీ విలువ మీ లోపల ఉంది కానీ మీరు వేసుకునే బట్టలలో లేదు. జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకొని బ్రాండెడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కాదు మీ థింకింగ్ ప్రాసెస్ ని మెరుగుపరుచుకోవడం మీ చుట్టూ ఉన్న భ్రమలను తొలగించుకొని రియాలిటీని యాక్సెప్ట్ చేయడం నిజం ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సక్సెస్ వెనకాల పరిగెడుతున్నారు. కానీ అసలైన సక్సెస్ ఎవరికీ తెలియదు.
(09:43) ఒక లగ్జరీ కారు కొని 10 మందికి చూపించడమే సక్సెస్ అనుకుంటున్నారు. అది కాదు సక్సెస్ ఆదిశంకరాచార్యుల వారు ఎంతో అద్భుతంగా చెప్పారు. మీ మనసు ఎప్పుడైతే అనవసరమైన ఆశల నుంచి తాత్కాలికమైన మోహాల నుంచి విముక్తి పొందుతుందో అప్పుడే మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే ప్రపంచాన్ని మెప్పించడం కాదు, మీ అంతరాత్మ ముందు మీరు నిజాయితీగా నిలబడటం.
(10:05) మీరు మీ క్యారెక్టర్ ని ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటారో ఈ సమాజం మిమ్మల్ని అంతగా గౌరవించక తప్పదు. బ్రాండెడ్ బట్టలు వేసుకున్నవాడు కొన్నాళ్లకు బాధపడిపోతాడు కానీ బ్రాండెడ్ క్యారెక్టర్ ఉన్నవాడు చరిత్రలో నిలిచిపోతాడు. వివేకానందుడు ఏనాడు సూటు బూటు వేసుకోలేదు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ లగ్జరీ లైఫ్ కోసం ప్రాకులాడలేదు.
(10:26) వాళ్ళని ఈరోజు ప్రపంచం ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది? వాళ్ళ లుక్స్ ని చూసా కాదు వాళ్ళ క్యారెక్టర్ ని చూసి ఆ క్యారెక్టర్ మీకు రావాలి. రేపటి నుంచి మీ ఫోకస్ మారాలి. అర్థంలో మీ ముఖాన్ని కాదు మీ ఆలోచనల్ని సరిచేసుకోండి. మీ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని ఎవరో ఇచ్చే జడ్జిమెంట్ల కోసం ఎవరో డిసైడ్ చేసే ట్రెండ్స్ కోసం తగలేయకండి.
(10:48) బట్టలక ఇచ్చే వాల్యూ మనిషికి ఇవ్వని ఈ సమాజంలో మీరు మాత్రం ఒక మనిషిగా బ్రతకండి. మీ వేషధారణ సింపుల్ గా ఉన్నా మీ విజన్ మాత్రం స్కై లెవెల్ లో ఉండాలి. రిస్క్ తీసుకోండి. మీ క్యారెక్టర్ ని ఒక పదునైన ఆయుధంలా మార్చండి. గుర్తుపెట్టుకోండి బట్టలు కేవలం మీ శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే. మీ ఐడెంటిటీ డిసైడ్ చేయడానికి కాదు. రేపు మీరు చనిపోయాక మీరు ఏ బ్రాండ్ షర్ట్ వేసుకున్నారో ఎవడు గుర్తుపెట్టుకోడు.
(11:11) మీరు ఎలాంటి మనిషిగా బ్రతికారో మాత్రం మాట్లాడుకుంటారు. ఆ రియాలిటీ చెక్ ని ఎప్పుడూ మైండ్ లో ఉంచుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అంతేకాకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.
(11:32) [సంగీతం] ఆ [సంగీతం]
No comments:
Post a Comment