Sunday, May 3, 2026

మీ బంధంలోEGO అడ్డు వస్తోందా?" 5 tips to reduce ego in married life!

మీ బంధంలోEGO అడ్డు వస్తోందా?" 5 tips to reduce ego in married life!

Author Name: Greeshma’s Guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4km0CLqHNiA



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనెందుకు తగ్గాలి తప్పు తనదే కదా తనే వచ్చి సారీ చెప్పాలి. నా మాట చెల్లుబాటు కావల్సిందే. ఇలాంటి ఆలోచనలు మీ మనసులో ఎప్పుడైనా వచ్చాయా భార్యా భర్తల మధ్య ప్రేమ ఎంత ఉన్నా ఒక్క అహంకారం లేదా ఈగో ప్రవేశిస్తే ఆ బంధం బీటలు వాడుతుంది. మనం బయట ప్రపంచంలో ఎంతో మందిని గెలుస్తాం. కానీ ఇంట్లో మన జీవిత భాగస్వామిని గెలవాలని చూస్తే చివరకు ఆ బంధమే ఓడిపోతుంది.
(00:35) పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి నడిచే ప్రయాణం ఇక్కడ ఎవరు గొప్ప అనేదానికి చోటు లేదు కానీ చాలా మంది తెలియకుండానే ఈగో వల్ల తమ అందమైన సంసారాన్ని నరకం చేసుకుంటున్నారు. ఈరోజు వీడియోలో పెళ్లి అనే బంధంలో అహంకారం అంటే ఏంటి? అది ఎలా మొదలవుతుంది మరియు దానిని అధిగమించి మీ బంధాన్ని మరింత బలంగా ఎలా మార్చుకోవాలో ఐదు అద్భుతమైన మార్గాల ద్వారా వివరించబోతున్నాను.
(01:04) వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ జీవిత భాగస్వామితో కలిసి చూడండి. ఎందుకంటే సంతోషకరమైన సంసారము మీ చేతుల్లోనే ఉంది. అవును కదా. చాలామందికి ఈగో అంటే ఏంటో సరిగ్గా తెలియదు. అది ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అని పొరబడతారు కానీ ఈగో వల్ల కలిగే సమస్యలు ఇవి. చిన్న గొడవ జరిగినా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేయడం తను మాట్లాడితేనే
(01:49) నేను మాట్లాడతాను అని రోజులు గడిపేయడం మొదటి గుర్తు అవతలి వారి మాట వినకుండా తప్పు తనది కాకపోయినా ఎదుటివారిపై నెట్టడం ప్రస్తుత సమస్య గురించి కాకుండా పదేళ్ల క్రితం జరిగిన విషయాలను గుర్తు చేస్తూ అవమానించడం. సంపాదనలో కానీ ఇంటి పనుల్లో కానీ నేను ఎక్కువ చేస్తున్నాను నువ్వు తక్కువ అనే భావన రావడం. సపోజ్ ఒక దారపు బంతిని
(02:35) ఊహించుకోండి. గొడవ జరిగినప్పుడు వెంటనే పరిష్కరించుకోకపోతే ఆ ఈగో అనే దారం చిక్కులు పడిపోతుంది. కాలక్రమేణ ఆ చిక్కులు విడదీయలేనంతగా పెరిగిపోయి చివరకు ఆ బంధమే తెగిపోయే పరిస్థితి వస్తుంది. సో బీ కేర్ఫుల్ మనము మన అహంకారాన్ని పక్కన పెట్టి బంధాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇలా
(03:24) చేశావు అని నిందించే బదులు మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుందాం అని ఆలోచించండి. సమస్య మీ భాగస్వామి కాదు ఫ్రెండ్స్ సమస్య అనేది మీ ఇద్దరికీ బయట ఉన్న ఒక విషయం అని గుర్తించండి. మీరిద్దరూ ఒకే టీమ అని గుర్తుంచుకోండి. సారీ చెప్పడం అంటే మీరు ఓడిపోయారని కాదు ఫ్రెండ్స్ ఆ వ్యక్తి కంటే మీ బంధమే మీకు ఎక్కువ అని అర్థం.
(04:00) తప్పు ఎవరిదైనా సరే గొడవను ఆపడానికి మొదటి అడుగు మీరే వేయండి గెలిచేది మీ అహంకారం కాదు మీ ప్రేమ కావాలి. చాలామంది ఎదుటివారు ఏం చెప్తున్నారో వినడానికి సిద్ధంగా ఉండరు. కేవలం సమాధానం చెప్పడానికే వింటారు. మీ భాగస్వామి బాధను వారి వర్షన్ ని ప్రశాంతంగా వినండి. వారి స్థానంలో నిలబడి ఆలోచించండి దాన్నే ఎంపతీ అంటారు. ఈగో ఉన్నచోట విమర్శలు ఎక్కువ ప్రశంసలు తక్కువ మీ భాగస్వామి చేసే చిన్న చిన్న
(04:45) పనులను కూడా మెచ్చుకోండి. ఈరోజు వంట బాగుంది పిల్లల విషయంలో నువ్వు బాగా కష్టపడుతున్నావు వంటి చిన్న చిన్న మాటలు ఈగో అనే గోడను పూచేస్తాయి ఫ్రెండ్స్. గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండిపోవద్దు. దానివల్ల అపార్థాలు పెరుగుతాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోండి. నీ మాట వల్ల నేను బాధపడ్డాను అని మీ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పండి.
(05:23) ఓకేనా నేను ఒక కుటుంబాన్ని చూశాను ఆ దంపతులు ఇద్దరూ చదువుకున్నవారే మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. ఓసారి భార్యకి ప్రమోషన్ వచ్చింది అనుకుంటా భర్త కంటే ఎక్కువ జీవితం రావడం మొదలైంది. అక్కడ భర్తలో తెలియని ఈగో మొదలైంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం ఆమెను తక్కువ చేసి మాట్లాడడం ఇలా చేసేవాడు. చివరకు వారు కౌన్సిలింగ్ కి వెళ్ళాల్సి వచ్చింది.
(05:47) అక్కడ సమస్య చీతం కాదు నేనే గొప్ప అనే అహంకారం ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు గర్భపడాలి కానీ అది పోటీగా పారకూడదు. రైలు పట్టాలు రెండు సమాంతరంగా ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అవును కదా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని ఉండదు. మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఈ టెక్నిక్ పాడండి. ఆ చోటు నుండి ఐదు నిమిషాలు పక్కకి వెళ్ళిపోండి.
(06:23) లోతైన శ్వాస తీసుకోండి. మీ భాగస్వామి చేసిన ఐదు మంచి పనులను గుర్తు చేసుకోండి. ఈ ఐదు నిమిషాల సమయం మీ మెదడులోని ఈగోని తగ్గించి మీలో ఉన్న ప్రేమను బయటకి తెస్తుంది ఫ్రెండ్స్. కోపంలో అన్న మాటలు తిరిగి తీసుకోలేము. అందుకే మౌనం కంటే ప్రశాంతత ముఖ్యం. ఫ్రెండ్స్ జీవితం చాలా చాలా చిన్నది ఇందులో ఈగోకు చోటిస్తే మనము ఎన్నో అందమైన క్షణాలను కోల్పోతాము.
(06:53) మీరు గెలవాల్సింది మీ భాగస్వామి మీద కాదు మీ భాగస్వామితో కలిసి ఈ ప్రపంచం మీద అహంకారాన్ని వదిలేసి ప్రేమతో ఒక్క అడుగు ముందుకు వేయండి. మీ సంసారం నందనవనం అవుతుంది. ఈ వీడియో మీ జీవితంలో ఏమాత్రం మార్పు తెచ్చినా నేను చాలా అంటే చాలా సంతోషిస్తాను. మీ బంధంలో ఈగో వల్ల ఎప్పుడైనా గొడవలుఅయ్యాయా మీరు వాటిని ఎలా అధిగమించారు? కింద కామెంట్ లో షేర్ చేయండి.
(07:22) మీ అనుభవం మరొకరికి స్ఫూర్తి కావచ్చు. చివరిగా ఒక మాట హ్యాపీ మ్యారేజెస్ ఆర్ రూట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఒక సంతోషకరమైన దాంపత్యమే మన జీవితంలోని అన్ని సుఖాలకు అసలైన పునాది మీ బంధం బాగుంటేనే మీ ఆరోగ్యం మీ పిల్లల భవిష్యత్తు మరియు మీ ప్రశాంతత అన్నీ బాగుంటాయి. ఈ విషయాన్ని మీరు నమ్మితే ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్ లో హ్యాపీ మ్యారేజెస్ ఆర్ రూట్స్ ఆర్ హ్యాపీనెస్ అని టైప్ చేయడం మర్చిపోకండి.
(07:52) మీ ఒక్క పాజిటివ్ కామెంట్ చదివి గొడవల్లో ఉన్న మరికొన్ని జంటల ఆలోచనా విధానం మారవచ్చు. వారి జీవితాల్లో వెలుగులు నిండవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ భాగస్వామితో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రిలేషన్షిప్ టిప్స్ కోసం గ్రీస్ మాస్ గైడెన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో పవర్ఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.
(08:16) అందాక స్టే హ్యాపీ స్టే హెల్దీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్

No comments:

Post a Comment