Sunday, May 3, 2026

"రిజెక్షన్ అంటే మనసుకి గాయం కాదు, మెదడుకి తగిలిన దెబ్బ! | Rejection Science Part 1"

"రిజెక్షన్ అంటే మనసుకి గాయం కాదు, మెదడుకి తగిలిన దెబ్బ! | Rejection Science Part 1"

Author Name: Greeshma’s Guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=v-YzyWOMcVo



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఒక మనిషి మనల్ని వద్దు అన్నప్పుడు మన గుండెల్లో ఏదో బరువుగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఎవరో ఒకరు వద్దు అన్నందుకు మన శరీరం ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది. మీరు కింద పడినప్పుడు తగిలిన దెబ్బ కంటే ఈ రిజెక్షన్ వల్ల కలిగే మనోవేదన మనల్ని ఇంత ఎక్కువగా బాధించడానికి ఒక కారణం ఉంది.
(00:28) శరీరానికి తగిలిన దెబ్బ మానుతుంది. కానీ మనసుకు తగిలిన దెప్పని మీ మెదడు పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది. మీకు తెలుసా సైన్స్ ప్రకారం రిజెక్షన్ వల్ల కలిగే బాధ ఒక యక్సిడెంట్ అయినప్పుడు కలిగే ఫిజికల్ పెయిన్ తో సమానం. అంటే మీ మనసు మాత్రమే కాదు మీ మెదడు కూడా దెబ్బ తిన్నట్లు ఫీల్ అవుతుంది. ఈరోజు మన ద ఆర్ట్ ఆఫ్ మూవింగ్ ఆన్ సిరీస్ మొదటి భాగంలో అసలు ఈ రిజెక్షన్ మనల్ని ఎందుకంతలా బాధిస్తుంది దాని వెనుక ఉన్న సైకాలజీని లోతుగా విశ్లేషించుకుందాం.
(00:58) ఓకేనా వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి. ఇది చూసాక మీ బాధ వెనుక ఉన్న సైన్స్ మీకు అర్థమై మీరు త్వరగా కోలుకుంటారు. సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ లో ఫిజికల్ గా దెబ్బ తగిలినప్పుడు ఏ ఏ భాగాలైతే యాక్టివేట్ అవుతాయో అవే భాగాలు యాక్టివేట్ అవుతాయి. అందుకే రిజెక్షన్ అంటే కేవలం మనసుకు కలిగిన బాధ మనసుకు కలిగిన గాయం కాదు అది శరీరానికి తగిలిన దెబ్బలాంటిది.
(01:34) మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వద్దు అన్నప్పుడు మనకు కోపం రావాలి. కానీ విచిత్రంగా మనకు వారి మీద ఇంకా ఎక్కువ ప్రేమ పుడుతుంది. దీన్నే సైకాలజీలో ఫ్రస్ట్రేషన్ అట్రాక్షన్ అంటారు. ఇది ఒక జూదం లాంటిది. ఒక రిప్లై వస్తే చాలు అనుకుంటూ మీరు వారి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ ఒక్క రిప్లై మీ బ్రేన్ కి ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది.
(01:58) ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె నో చెప్పింది. ఆ క్షణం నుండి అతను ఆమె ఫోటోలు చూడడం, ఆమె స్టేటస్ లు చెక్ చేయడం ఆపలేకపోతాడు. ఎందుకంటే ఆ నో అనే మాట అతని బ్రెయిన్ లో డోపమిన్ ని విపరీతంగా పెంచేస్తుంది. అంటే దొరకని దాని కోసం మన బ్రెయిన్ ఇంకా ఎక్కువగా తప్పిస్తుంది. ఇది ఒక రకమైన డ్రగ్ అడిక్షన్ లాంటిది.
(02:22) మీరు గమనించారా ఒక అబ్బాయి లేదా అమ్మాయి మనల్ని ప్రేమిస్తున్నంత కాలం మనకు వారి మీద అంత క్రేజ్ ఉండదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనం ఇక కలవద్దు అని ఫోన్ కట్ చేస్తారో అప్పటి నుండి మనకు పిచ్చి మొదలవుతుంది. వారి పాత మెసేజ్లు చదవడం లాస్ట్ సీన్ చెక్ చేయడం ఇది మీ ప్రేమ కాదు ఫ్రెండ్స్ ఇది మీ బ్రెయిన్ లో పెరిగిన డాప్మెంట్ ఒక డ్రగ్ ఎడిక్ట్ కి డ్రగ్ దొరకనప్పుడు ఎలా తప్పిస్తాడో మీ బ్రెయిన్ కూడా ఆ వ్యక్తి కోసం అలా తప్పిస్తుంది.
(02:52) గుర్తుంచుకోండి ఇది ప్రేమ కాదు ఇది కేవలం ఒక కెమికల్ లోపం మాత్రమే. పాతకాలంలో ఒక మనిషిని తన తెగ నుండి రిజెక్ట్ చేస్తే అతను అడవిలో ఒంటరిగా బ్రతకడం కష్టం. రిజెక్షన్ అంటే అప్పట్లో మరణంతో సమానం. ఇక్కడ లింక్ ఏంటంటే అందుకే ఈ రోజుల్లో ఒకరు ఐ డోంట్ లైక్ యు అని మెసేజ్ చేసినా మన సబ్కాన్షియస్ మైండ్ అది ఏదో పెద్ద ప్రమాదం లాగా ఫీల్ అయిపోతుంది.
(03:23) అందుకే మనం పానిక్ అవుతున్నాం. వారికి పదే పదే కాల్ చేస్తాం బ్రతిమాలుతాం. ఇది మనలోని సర్వైవల్ ఇన్స్టింగ్ మనం ఏదైనా పనిని మధ్యలో ఆపేస్తే మన మైండ్ దాన్ని మర్చిపోతుంది. దీన్నే జీగార్నిక్ ఎఫెక్ట్ అంటారు. తెలుగులో చెప్పాలంటే పూర్తిగాని పనుల మీద ఉండే ధ్యాస. మన మైండ్ కి క్లారిటీ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. వారు ఎందుకు వెళ్ళిపోయారు అని మీరు వేల సార్లు ఆలోచించిన సమాధానం దొరకదు.
(03:55) ఎందుకంటే ఆ కథకి శుభం కార్డు పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా చూస్తున్నారు. సరిగ్గా క్లైమాక్స్ ముందు కరెంట్ పోయింది అనుకుందాం. మీకు ఆ రోజంతా క్లైమాక్స్ గురించే ఆలోచన ఉంటుంది. అవును కదా రిలేషన్షిప్ కూడా అంతే ఫ్రెండ్స్. అవతలి వ్యక్తి క్లారిటీ ఇవ్వకుండా లేదా సడన్ గా వెళ్ళిపోతే మన మైండ్ ఆ స్టోరీని కంప్లీట్ చేయాలని చూస్తూ ఉంటుంది.
(04:19) నేను ఏం తప్పు చేశాను ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నలతో మిమ్మల్ని మీరు వేధించుకుంటారు. రిజెక్షన్ అంటే అవతలి వ్యక్తికి మనకి సెట్ అవ్వలేదు అని అర్థం కానీ మనం ఏమనుకుంటాం నాలోనే ఏదో లోపం ఉంది నేను అందంగా లేనేమో నాకు అర్హత లేదేమో ఇలా మనల్ని మనము నిందించుకుంటాం. సెల్ఫ్ బ్లేమ్ ఒక ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ కాలేదు.
(04:52) అప్పుడు నాకు ఇంకా స్కిల్స్ కావాలి అని ఆలోచించడం హెల్దీ కానీ నాకు అస్సలు టాలెంట్ లేదు నేను దేనికి పనికి రాను అనుకోవడం అన్హెల్దీ టాక్సిక్ రిలేషన్షిప్ లో కూడా ఒకరు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది వారి అభిప్రాయం మాత్రమే మీ విలువ కాదు ఫ్రెండ్స్ ఒకరికి బిర్యానీ ఇష్టం ఉండొచ్చు మరొకరికి పప్పన్నం ఇష్టం ఉండొచ్చు అంతమాత్రాన బిర్యానీ గొప్పది పప్పన్నం తక్కువది అని కాదు కదా అది కేవలం వారి రుచికి సంబంధించింది మీకు వారి మీద ఇప్పుడు ప్రేమ కూడా ఉండకపోవచ్చు కానీ నన్ను ఎలా కాదంటారు అనే అహంకారం మిమ్మల్ని వారి వెనకాల తిరిగేలా చేస్తుంది. ఇది ప్రేమ కోసం చేసే పోరాటం
(05:36) కాదు మీ ఓటమిని తట్టుకోలేక చేసే ప్రయత్నం అవును కదా చాలాసార్లు మనకి ఆ వ్యక్తి మీద ప్రేమ కంటే నన్ను ఎలా వద్దంటాడు అనే ఈగో దెబ్బ తింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ లో టాపర్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేయగానే మీ ఈగో తట్టుకోలేకపోతుంది. వారిని ఎలాగైనా ఒప్పించాలని మీరు ప్రయత్నిస్తారు.
(06:07) ఇది ప్రేమ కోసం కాదు మీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మీరు చేసే పోరాటం దట్స్ ఇట్. యక్సెప్ట్ ద రియాలిటీ మొదటగా వారు నా లైఫ్ లో లేరు అనే నిజాన్ని అంగీకరించండి. హోప్ అనేది చాలా చాలా డేంజర్ ఆ ఆశే మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుంది. స్టాప్ సోషల్ మీడియా స్టాకింగ్ వారు ఏం చేస్తున్నారో చూడడం ఆపండి. ప్రతిసారి మీరు
(06:52) వారి ప్రొఫైల్ చూసినప్పుడు మీ గాయం మళ్ళీ కొత్తగా మారుతుంది. అవుట్ ఆఫ్ సైడ్ అవుట్ ఆఫ్ మై డోంట్ సీక్ క్లోజర్ వారితో మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి అనుకోకండి మీ సైలెన్స్ లోనే మీకు కావలసిన క్లారిటీ ఉంటుంది. రీరైట్ ద స్టోరీ నేను ఓడిపోయాను అనడం మానేసి మేమఇద్దరం ఒకరికొకరం సరిపోము అని మీకు మీరు చెప్పుకోండి.
(07:27) రిజెక్షన్ అనేది మనల్ని మనము ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఫ్రెండ్స్ ఇది మీ ముగింపు కాదు రైట్ గుర్తుంచుకోండి ఒకరు మీ జీవితం నుండి వెళ్ళిపోయారు అంటే మీ జీవితం ముగిసిందే [గొంతు సవరించుకోవడం] అని కాదు కొత్త జీవితానికి ఆరంభం అని అర్థం. మీ విలువను మరొకరు నిర్ణయించే అవకాశం వారికి ఇవ్వకండి ఫ్రెండ్స్. ఈ రిజెక్షన్ పెయిన్ లో ఉన్నప్పుడు మనము తరచుగా మనము టాక్సిక్ వ్యక్తుల వైపు ఎందుకు ఆకర్షితుల అవుతామో తెలుసా? దాని గురించి మనం పార్ట్ ట లో క్లియర్ గా మాట్లాడుకుందాం.
(07:58) ఈ వీడియో మీకు ఐ ఓపెనర్ లాగా అనిపిస్తే కామెంట్స్ లో ఆల్ ఇస్ వెల్ అని టైప్ చేయడం మర్చిపోకండి. వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ స్టోరీని కామెంట్స్ లో షేర్ చేయండి. గ్రీస్ మాస్ గైడెన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరందరూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి. ప్లీజ్ లైక్ అండ్ హైప్ మై వీడియోస్ మనమందరం కలిసి ఎదుగుదాం.
(08:19) వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక స్టే స్ట్రాంగ్ స్టే హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్

No comments:

Post a Comment