Saturday, May 2, 2026

పెళ్లి=సమాజం పెట్టినఉచ్చు?|RAT RACE? చదువు పెళ్లి పిల్లలు చావు ఇదేనా జీవితం?|Marriage System Exposed

పెళ్లి=సమాజం పెట్టినఉచ్చు?|RAT RACE? చదువు పెళ్లి పిల్లలు చావు ఇదేనా జీవితం?|Marriage System Exposed

Author Name:The Human Fire

Youtube Channel Url:https://www.youtube.com/@idimanaprapancham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=teq3ifD_vLY



Transcript:
(00:02) ఒక్క నిమిషం ఆగి ఆలోచించు నువ్వు పుట్టినప్పటి నుంచి చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు చివరకు మరణం ఇదేనా మన జీవితం మనం నిజంగా జీవిస్తున్నామా లేక ఎవరో సృష్టించిన రాట్రేస్ లో మనం పరిగెడుతున్నామా? కార్ల్ మార్క్స్ ఒకసారి ఇలా అన్నారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఒక్క తల్లి ప్రేమ తప్ప అయితే వివాహం నిజంగా ఏంటి అది ప్రేమ బాధ్యత లేక సమాజం పెట్టిన ఒత్తిడా అసలు మనం ఈ లూప్ లో వచ్చి ఎలా పడ్డాం? ఈ వీడియోలో మహిళలపై అణచివేత ఎందుకు జరుగుతుందో వివాహం తర్వాత పురుషుల జీవితం ఎందుకు మారుతుందో నిజమైన వివాహ బంధం ఎలా ఉండాలి? అది మన పిల్లల
(00:43) భవిష్యత్తు ఎలా మారుస్తుందో వాటన్నింటికీ ఒక శక్తివంతమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే పెళ్లిపై మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాతే వాస్తవం మీకు అర్థమవుతుంది. మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. ఈ రాటరేస్ నుండి మనల్ని మన భవిష్యత్ పిల్లలను ఎలా తప్పించాలో తెలుసుకోవడానికి పదండి పెళ్లి అనే ఈ మహావిశ్వం పుట్టుకలోకి ప్రయాణిద్దాం.
(01:10) వీడియోలోకి మ్యారేజ్ అంటే ఒక అవగాహన ఒప్పందం కాదు అది మానవ చరిత్రలో అత్యంత రక్తపాతంతో నిండి ప్రేమతో మొదలై ఆధిపత్యంగా మారిన జీవ వైజ్ఞానిక ఒప్పందం ఆ ఇద్దరి ఒప్పందం కుటుంబాన్ని గ్రామాల, రాజ్యాల, దేశాల మధ్య తరతరాలుగా ఎంతో రక్తపాతాన్ని సృష్టించింది. కాబట్టి ఆ ఒప్పందం అలా మొదలై ఎలా నడుస్తుందో చూద్దాం. మనిషి లక్షల ఏళ్ల ప్రయాణంలో మానవుడు ఎక్కడి వరకు వచ్చాడో చూద్దాం.
(01:41) 10వేల ఏళ్ల క్రితం వ్యవసాయం కనుగొన్నది స్త్రీలు కానీ అప్పుడు తను అనుకోలేదు తాను కనుగొన్న వ్యవసాయమే వారి పాలిట శాపమై వేల సంవత్సరాలుగా బానిసలుగా బ్రతుకుతామని కేవలం వారు కోరుకునేది ఒక్కటే పిల్లల భద్రత ఇది మనందరి కథ. ప్రతి తల్లిదండ్రుల కథ. ప్రకృతిలో ఏ జంతువుకైనా పిల్లలు పుట్టగానే నిమిషాల్లో నడుస్తుంది. గంటల్లో ఆహారం వెతుక్కుంటుంది.
(02:07) కానీ మనిషి మనిషి శిశువు అత్యంత బలహీనమైనది. పుట్టిన ప్రతి పిల్లలు బ్రతకడం చాలా కష్టం మరియు మానవ మెదడు పరిమాణం పెద్దది కావడం వల్ల అది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందక ముందే శిశువు జన్మించాల్సి వస్తుంది. దీనివల్ల మానవ శిశువుకు కనీసం 15 నుండి 20 ఏళ్ల పాటు పెద్దల సంరక్షణ అవసరం. ఈ సుదీర్ఘ బాల్యదశే మహిళను ఒక ఇబ్బందిలో నెట్టింది. పిల్లవాడిని చూసుకుంటూ ఆమె వేటకు వెళ్ళలేదు.
(02:34) అక్కడే ఆమెకు ఒక స్థిరమైన తోడు రక్షణ ఇచ్చే పురుషుడి అవసరం ఏర్పడింది. అంటే వివాహం మొదట ప్రేమ కోసం కాదు పిల్లల మనుగడ కోసం ఒక జీవ వైజ్ఞానిక ఒప్పందంగా మొదలైంది. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 10వేల ఏళ్ల క్రితం అడవిలో పచ్చి మాంసం వాసన అడవి జంతువుల అరుపుల మధ్య మనిషి మనుగడ సాగుతోంది. పురుషులు వేటకు వెళ్లేవారు.
(02:57) కానీ గర్భవతులుగా ఉన్న మహిళలు చంటి పిల్లలున్న తల్లులు ఆ వేటలో పాలు పంచుకోలేక గుహల దగ్గరో నదీ తీరాల్లోనో విశ్రాంతి తీసుకునేవారు. ఆ నిశశబ్ద సమయం ప్రపంచ గమనాన్ని మార్చేసింది. ఒక గర్భవతి అయిన మహిళ తాను తినిపారేసిన అడవి పండ్ల గింజలు వర్షపు జల్లులకు మొలకెత్తడం గమనించింది. అప్పటివరకు కేవలం సేకరించడం మాత్రమే తెలిసిన మనిషికి సృష్టించడం అనే ఆలోచనను ఆమె ఇచ్చింది.
(03:22) మనం రక్తం చిందించే వేట కోసం ఎందుకు పరిగెత్తాలి? ఈ విత్తనాలను నాటితే ఆహారం మన దగ్గరికే వస్తుంది కదా అనే ఆమె చిన్న ఆలోచన వ్యవసాయ విప్లవానికి పునాది వేసింది. చరిత్రకారులు [సంగీతం] దీనిని నియోలితిక్ విప్లవం అంటారు. కానీ నిజానికి అది మహిళా [సంగీతం] ఆవిష్కరణ. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 15వేల ఏళ్ల నుండి మాతృస్వామ్య వ్యవస్థ నడుస్తుంది.
(03:48) సింధులోయ నుండి మెసోపొటేమియా వరకు భూమిని తవ్వితే దొరికే వేలాది మాతృ దేవత విగ్రహాలే దీనికి సాక్ష్యం అప్పట్లో అధికారం అంటే ఆధిపత్యం కాదు పోషణ ఆస్తి తల్లి పేరు మీద ఉండేది. వంశం ఆమె పేరుతోనే నడిచేది. యుద్ధాలు లేవు రక్తపాతం లేదు ప్రకృతిని తల్లిగా ఆరాధించే ఒక ప్రశాంతమైన యుగం అది. కానీ కాలక్రమేణ ఆ అద్భుతమైన ఆవిష్కరణే ఆమెకు సంకెళ్లు వేసింది. వ్యవసాయం వల్ల ఆహార మిగులు పెరిగింది.
(04:15) మిగులు ఉన్న చోట ఆస్తి పుట్టింది. ఆస్తి ఉన్నచోట వారసత్వం అనే స్వార్థం మొదలైంది. పురుషుడు నాగలి పట్టి పొలాన్ని దున్నడం మొదలు పెట్టాక శారీరక బలాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. తన ఆస్తి తన రక్తానికి అంటే తన పిల్లలకు మాత్రమే చెందాలనే కోరికతో స్త్రీ లైంగికతను నియంత్రించడం మొదలు పెట్టాడు. వ్యవసాయం పెరిగాక ఆస్తి పుట్టింది.
(04:37) ఆస్తి వచ్చాక వారసత్వం పుట్టింది. బిఫోర్ కామన్ ఎరా 5000 బిసిఈ నుండి భూమి పురుషుడి అధీనంలోకి వెళ్ళింది. ఇక్కడి నుండే పితృస్వామ్య వ్యవస్థ పుట్టింది. ప్రపంచంలో మొట్టమొదటి లిఖితపూర్వక వివాహ ఒప్పందం సుమారు 2350 బిసిఈ లో మెసోపొటేమియా నేటి ఇరాక్ ప్రాంతంలో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రేమ గురించి కాదు కేవలం స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి.
(05:02) పుట్టే పిల్లలు అతని ఆస్తికి వారసులు కావాలి అనే నిబంధనలతో కూడుకున్నది. అంటే వివాహం అనేది ఒక చట్టబద్ధమైన యాజమాన్య హక్కుగా రూపాంతరం చెందింది. ఇక్కడ ఒకటి చెప్పాలి మనిషి ప్రేమలో కొత్తగా ఉన్నప్పుడు మెదడులో డోపీన్ నోరెపినెఫ్రీన్ మరియు ఫినాయిల్ ఎథిలమిన్ పిఈఏ వంటి రసాయనాలు వెల్లువలా విడుదలవుతాయి. ఇవి మనకు విపరీతమైన ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
(05:26) [సంగీతం] శాస్త్రవేత్తల ప్రకారం ఈ రసాయన తీవ్రత అనేది సుమారు 18 నుండి 36 నెలల వరకు మాత్రమే బలంగా ఉంటుంది. అక్కడే వివాహం అనే సామాజిక కట్టడం పుట్టింది. అది కేవలం ఒక పవిత్ర బంధం కాదు అది ఒక ఆర్థిక ఒప్పందం మహిళను ఒక వ్యక్తిగా [సంగీతం] కాకుండా వారసులను కనే ఒక యంత్రంగా ఒక ఆస్తిగా మార్చేశారు. ఆమె మెడలో కట్టిన మంగళసూత్రం, చేతికి వేసిన గాజులు, పాదాలకు తొడిగిన మెట్టెలు ఇవి కేవలం అలంకారాలు కాదు ఆనాటి పితృస్వామ్య సమాజం ఆమెపై వేసిన యాజమాన్యపు ముద్రలు పశువులకు యజమాని ఇది తన ఆస్తి అని గుర్తులు వేసినట్లు ఆమె ఒక పురుషుడికి చెందినదనే చూపే సంకేతాలు ఇవి.
(06:06) మనుస్మృతిలో ఇలా ఉంది. నస్త్రీ స్వాతంత్ర అర్హతి అంటే స్త్రీ స్వేచ్ఛకు అర్హురాలు కాదు అనే శ్లోకాల రూపంలో కనిపిస్తుంది. మనుస్మృతిలో ఇలా ఉంది. బాల్యే పితృవసే తిష్టేత్ పాణిగ్రహస్య యవ్వనే అంటే బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త. ముసలితనంలో కొడుకు ఆధీనంలో ఉండాలి తప్ప స్త్రీకి స్వేచ్ఛ [సంగీతం] ఉండకూడదు అనే సూత్రం ఆమె వ్యక్తిత్వాన్ని మూడు ముక్కలు చేసి బంధించింది.
(06:34) చైనాలో ఫుడ్ బైండింగ్ వెయ్యేళ్ల పాటు చైనాలో మహిళల పాదాలను విరగగొట్టి చిన్నవిగా చేసేవారు ఎందుకంటే ఆమె వేగంగా నడవకూడదు పరిగెత్తకూడదు. ఆమె కేవలం నాలుగు గోడల మధ్యే ఉండాలనేది ఆనాటి అందమైన కుట్ర. ఐరోపాలో వెజ్ హంట్స్ మధ్యయుగ ఐరోపాలో ఏ మహిళకైనా తెలివితేటలు ఎక్కువైతే వైద్యం తెలిస్తే ఆమెను చిల్లంగితిది అని ముద్ర వేసి సజీవ దహనం చేసేవారు.
(07:00) మేధస్సు కలిగిన స్త్రీ పురుష ఆధిపత్యానికి ప్రమాదంని వారు భయపడ్డారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నేటికీ కొన్ని దేశాల్లో స్త్రీ చదువుకోవాలన్న ప్రయాణం చేయాలన్న మహరం అనుమతి తప్పనిసరి బుర్కా లేదా నికాబ్ మహిళ శరీరం పూర్తిగా కప్పి ఎవరికి కనిపించకూడదని యజమాని గుర్తు ఆమె జీవితానికి ఆమె యజమాని కాదు ఇక్కడ మీకు చెప్పేది ఒక్కటే ప్రతి వివాహం బానిసత్వం కాదు ప్రతి పురుషుడు దోషి కాదు ప్రతి స్త్రీ బాధితురాలు కాదు కానీ వ్యవస్థలో ఎక్కువ శాతం లోపాలు ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే సమాజంలో ఉన్న 90% చెడు గురించి నేను మాట్లాడుతున్నా భర్త చనిపోతే భార్య కూడా
(07:41) చితిలో దూకడం అనే సతీ సహగమనం భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా ఉంది. భర్త చనిపోయిన మహిళలను సామాజికంగా దూరం పెట్టడం రంగుల దుస్తులు ఆభరణాలు నిషేధించడం వంటివి స్త్రీ మానసిక స్థితిని దెబ్బతీయడమే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన తల్లిని సతీ సహగమనం నుండి కాపాడినా కానీ వ్యవస్థను ఆపలేకపోయారు. ఆయన మరణానంతరం తన భార్య సతీ సహగమనం చేశారు.
(08:07) ఈ వ్యవస్థ ఎంతటి బలమైనదో ఇదే నిదర్శనం. సంప్రదాయాల పేరిట స్త్రీని బతికున్న శవంగా మార్చే సామాజిక కట్టుబాట్లు ఎంతటి క్రూరమైనవో [సంగీతం] ఈ చారిత్రిక సత్యం ప్రతిబింబిస్తుంది. ఇక్కడ రాజులు ఎంత గొప్పవారైనా వ్యవస్థను శతాబ్దాలుగా మనుషుల మెదళ్లలో నాటుకున్న సంప్రదాయాన్ని ఒక్కరే తుడిచి పెట్టడం ఎంత కష్టమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
(08:29) అయితే వివాహ వ్యవస్థ కేవలం ఇంటికే పరిమితం కాలేదు. అది దేవాలయాల గర్భగుడి వరకు పాకింది. అదే దేవదాసి వ్యవస్థ. నువ్వు మనుషులకి భార్యవి కావు దేవుడికి భార్యవి అని నమ్మించి పసిపిల్లలను దేవతలకు ఇచ్చి పెళ్లి చేసేవారు. ఇది భక్తి కాదు అగ్రవర్ణాల వారు భూస్వాములు తమ లైంగిక దాహాన్ని తీర్చుకోవడానికి పన్నిన ఒక వ్యూహాత్మక కుట్ర.
(08:52) పెళ్లి చేసుకుంటే ఒక పురుషుడికే పరిమితం కావాలి. కానీ దేవదాసి అయితే ఆమె దేవుడి సొత్తు కాబట్టి ఆ దేవుడి ప్రతినిధులమని చెప్పుకునే అగ్రవర్ణ పురుషులందరికీ ఆమె అందుబాటులో ఉండాలి. ఒకవైపు తన భార్యను పాతివ్రత్యం పేరుతో నాలుగు గోడల మధ్య బంధించిన పురుషుడు మరోవైపు దేవుడి పేరుతో పేద వర్గాల ఆడపిల్లలను బహిరంగంగా అనుభవించాడు. ఇది చరిత్రలో జరిగిన అతి పెద్ద సంస్థాగత అత్యాచారం అని చరిత్రకారుల అభిప్రాయం.
(09:18) గత శతాబ్దం నుండి మార్పు కోసం ఎన్నో చట్టాలు తెచ్చుకున్న మహిళలను వాకిటి నుంచి ఇంకా బయటకి తీసుకురాలేక అదే అణచివేతను అలవాటుగా సంప్రదాయంగా అనుభవిస్తూ ఒకప్పుడు గాజులు, మెట్టెలు, [సంగీతం] మంగళసూత్రం, బంగారు ఆభరణాలు అన్నీ వాళ్ళను ఒక ఆస్తిగా చూసిన ఈ పితృస్వామ్య వ్యవస్థలో వాటిని ఇప్పుడు వారు అలంకార వస్తువులుగా మార్చుకున్నారు.
(09:39) మరియు తన బిడ్డలకు ఆస్తిలో వాటాల కోసం భరిస్తూ కేవలం బిడ్డలను కనడం వారి భవిష్యత్తు కోసం బ్రతుకుతుంది. కానీ ఈ దేశం మహిళకు ఇచ్చిన సెక్యూరిటీ ఎక్కడ? దేశంలో మహిళల భద్రత ప్రమాణాలు చూస్తే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. నేటి ఆధునిక క్రూఢత్వంతో సాగిన ఒక మహిళ వేదన గాథ. బిల్కిస్ బానో కేసులో గర్భిణి మహిళను గ్యాంగ్ రేప్ చేసి ఆమె కుటుంబాన్ని హత్య చేసిన దోషులను పూలదండలతో సత్కరించి విడుదల చేశారు.
(10:10) 2022 సుప్రీం కోర్టు తర్వాత ఆ ఉత్తర్వును రద్దు చేసిన రాజకీయ రక్షణ ఎంత బలంగా ఉందో చూపించింది. ఉన్న రేప్ కేసులో బీజెపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్ డబ్బు, శక్తి, రాజకీయ రక్షణతో నిర్దాక్షిణీయంగా రేప్ చేసిన బాధితురాలి తండ్రి మరణం వరకు న్యాయం ఆలస్యమైంది. దేశంలోని అగ్రశ్రేణి మహిళా కుస్తీ వీరులు వినేష్ ఫోగాట్ సాక్షి మాలిక్లు కూడా రెస్లర్ స్పోర్ట్స్ మినిస్టర్ బ్రిడ్జ్ భూషణ్ శరణ్ సింగ్ మీద లైంగిక హింస ఆరోపణలు చేసి రోడ్డుపై ఆందోళన చేయాల్సి వచ్చింది.
(10:40) కానీ వారి వేదన ఎవరూ వినలేదు. మణిపూర్లో మహిళలను బట్టలు తీసి నగ్నంగా పరేడ్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన హింసాకాండను దేశం చూసి కూడా నిర్వికారంగా ఉంది. న్యాయం ఇప్పటికీ పూర్తిగా రాలేదు. హత్రాసులో దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేసి చంపిన తర్వాత శవాన్ని కూడా తల్లిదండ్రులకు చూపకుండా అర్ధరాత్రి ప్రభుత్వం కాల్చివేసింది.
(11:02) అయినా కోర్టులు చూస్తూ ఊరుకున్నాయి. ఇంకా ఇది అంతర్జాతీయంగా కూడా వ్యాపించింది. విదేశీ మహిళల మీద అత్యాచారాలు హంపీలో ఇజ్రాయిల్ టూరిస్ట్ మహిళను గ్యాంగ్ రేప్ చేసి ఆమె హోమ్ స్టే హోస్ట్ ను కూడా హింసించి ఒక టూర్ గైడ్ ను చంపిన ఘటన 2025 మార్చి ముగ్గురు దోషులకు డెత్ సెంటెన్స్ వచ్చిన టూరిస్ట్ సేఫ్టీ ఎంత దారుణంగా ఉందో చూపించింది.
(11:24) గతంలో [సంగీతం] స్పానిష్ ఐరిష్ టూరిస్ట్ మహిళల మీద కూడా గ్యాంగ్ రేప్ మరియు మర్డర్ ఘటనలు జరిగాయి. మహిళలు ఇంత అనిచివేతలో కూడా ఎక్కడా నోరు ఎత్తలేదు ఇది ప్రకృతికే వదిలేశారు. ఆ ప్రకృతి ఈ సమాజం మీద తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. నిజానికి పితృస్వామ్యం తెచ్చిపెట్టుకున్న పురుషులకు అదే వారి పాలిట మరణ శాసనం అయ్యేలా స్త్రీ తనకు అనుకూలంగా మార్చుకొని ఈ పితృస్వామ్యంలోనే వారిని సజీవ సమాధి చేసేలా మారుతుందని అప్పుడు వారికి తెలియదు.
(11:55) పురుషులను వారి జీవితం మొత్తం లోలోపలే కుమిలి కుమిలి కుంగి నశించే విధంగా స్త్రీలతో కలిసి ప్రకృతి ఎలా ప్రణాళిక వేసిందో చూద్దాం. వ్యవసాయం వచ్చాక స్థిర నివాసం, ఆహార మిగులు, ఆస్తి పుట్టింది. ఆ ఆస్తిని భర్తలు రక్షించాల్సి వచ్చింది. పొలాలు, పశువులు, గ్రామాలు వీటిని దాడుల నుంచి కాపాడాలంటే భర్తకు యుద్ధాలు అనివార్యమయ్యాయి. చరిత్రకారులు ఆర్కియాలజిస్టులు యుసిఎల్ అధ్యయనాలు 2022 లో చెప్పినట్లు యుద్ధాల్లో పురుషుల శారీరక బలం కీలకమైంది.
(12:26) [సంగీతం] స్త్రీలు గర్భం పాలివ్వడం వల్ల యుద్ధభూమికి సరిపోలేదు కాబట్టి పురుషులు యోధులు అయ్యారు. యానోమా తెగలవంటి సమాజాల్లో కూడా ఇదే జరిగింది. ఆస్తి రక్షణ కోసం రక్తపాత దాడులు ఫలితం పురుషులు యుద్ధాల్లో వేటల్లో రక్షణలో తమ జీవితాలను పణంగా పెట్టేవారు. ఆస్తి వారసత్వం కూడా పురుష వంశంలోకి మారింది. పితృస్వామ్యం ఇలా పుట్టింది.
(12:50) స్త్రీలను ఆస్తిగా చూసి పురుషులను రక్షకులుగా మార్చేసి. ఇది కేవలం ఆర్థిక వ్యవస్థ కాదు సామాజిక ఒత్తిడి. చిన్నప్పటి నుంచి బాలురకు నేర్పించేది ఏమిటి? బాయ్స్ డోంట్ క్రై ఏడవకు బలహీనత చూపకు భావోద్వేగాలు అణచివేయి. ఇది ప్రాచీన యోధ సంస్కృతి నుంచి మొదలై ఆధునిక సమాజంలోకి వచ్చేసింది. టాక్సిక్ మాస్క్లినిటీ అని ఇప్పుడు అంటున్నారు. పురుషుడు ప్రొవైడర్ ప్రొటెక్టర్ స్ట్రాంగ్ అయి ఉండాలి.
(13:17) భావాలు చెప్పకూడదు సహాయం కోరకూడదు. ఫలితం మానసిక ఒత్తిడి ఒంటరితనం లోపలి బాధలు బయటకు రావు. ఆధునిక కాలంలో ఈ బాధ ఎలా కనిపిస్తుంది? స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. హార్ట్ అటాక్లు మరియు కార్డియోవాస్కులర్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా పురుషులు యువకుల్లోనే ఎక్కువ స్ట్రెస్ ధూమపానం ఒత్తిడి వల్ల హార్ట్ డిసీజ్ కు గురవుతారు.డబల్హె్ఓ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటా ప్రకారం పురుషుల్లో సివడి మరణాలు మహిళల కంటే ఎక్కువ ఇండియాలో కూడా హార్ట్ డిసీజ్ పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
(13:47) [సంగీతం] స్ట్రెస్ ఫ్యాక్టర్ ప్రధానం ప్రొవైడర్ ఒత్తిడి, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు ఇవి హార్ట్ ను దెబ్బతీస్తాయి. సూసైడ్ రేట్స్ ఇండియాలోఎన్సిఆర్బి 2021 నుంచి 2022 వరకు డేటా ప్రకారం 72.5% సూసైడ్లు పురుషులవి. పురుషుల ఆత్మహత్యల రేటు మహిళల కంటే 2.5 రెట్లు ఎక్కువ. గ్లోబల్ గా కూడా పురుషుల సూసైడ్ రేటు రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువ.
(14:14) కారణం బ్రెడ్ విన్నర్ రోల్ ఫెయిల్ అయినప్పుడు ఆర్థిక ఒత్తిడి ఉద్యోగం కోల్పోవడం సమాజసం మనిషి కాదు అని చూడటం భావోద్వేగాలు చెప్పలేక సహాయం కోరలేక మౌనంగా మరణిస్తారు. భారతదేశంలో మహిళలపై హింస నిజంగా ఉంది. దాన్ని అరికట్టడానికి సెక్షన్ 498 ఏఐపిసి డౌరీ యాక్ట్ పిడబల్డివి ఏ 2005 వంటి చట్టాలు తీసుకొచ్చారు. కానీ వాస్తవం ఏమిటి?ఎన్సిఆర్బి ఎన్సిఆర్bి 2023 డేటా ప్రకారం 4.
(14:45) 48 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో 498 ఏ కింద మాత్రమే 1,33,676 కేసులు కానీ కన్విక్షన్ రేటు చాలా తక్కువ 12 నుండి 20% మాత్రమే అంటే చాలా కేసులు ఎక్విటల్ అవుతున్నాయి. కొందరు ఆడవాళ్ళు ఈ సెక్షన్ ను మిస్యూస్ చేస్తున్నారు. దీనివల్ల చాలా కుటుంబాలు జైల్లో మగ్గుతున్నాయి. చాలామంది పురుషులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
(15:10) నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు మరీ దారుణం ఇప్పుడు ఆ కథ మన పిల్లల వరకు వస్తుంది. ఈ రక్తపాతం నిండిన వివాహ వ్యవస్థలో పుట్టిన పిల్లలు ఏమవుతారు? ఊహించండి ఒక సాంప్రదాయిక భారతీయ కుటుంబం. బాలుడు పుట్టాడు. అబ్బాయి కదా బలవంతుడై ఉండాలి, ఏడవకూడదు. డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడిపించాలి అని చిన్నప్పటి నుంచి మెదడులోకి నాటేస్తారు.
(15:37) బాలిక పుట్టింది అమ్మాయి కదా పాతివ్రత్యం, త్యాగం, సర్వసమర్పణ, ఇంటి గౌరవం కాపాడాలి. ఈ రెండు సందేశాలు కూడా ఒకే పితృస్వామ్య వ్యవస్థ నుంచి వస్తాయి. ఫలితం ఏమవుతుంది? పిల్లలు తమ భావోద్వేగాలను అణచుకుంటారు. కోపం, భయం, విషాదం ఏదైనా వ్యక్తం చేస్తే అబ్బాయిలు ఏడవరు అమ్మాయిలు ఇలా మాట్లాడకూడదు అని ముద్ర వేస్తారు. ఈ అణచివేత దీర్ఘకాలికంగా డిప్రెషన్, యంజైటీ భావోద్వేగ సమస్యలకు దారితీస్తుంది.
(16:05) శాస్త్రీయ ఆధారాలు ఏమి చెరియోటైప్స్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. గ్లోబల్ ఎర్లీ అడాలసెంట్ స్టడీ whoూహ్ఓ మరియు జాన్స్ హాప్కిన్స్ 2017 10 నుండి 11 ఏళ్లలోనే రిజిడ్ జెండర్ నార్మ్స్ పిల్లల్లో స్థిరపడతాయి. ఇవి టీనేజ్ లో డిప్రెషన్ హింస సూసైడ్ రిస్క్ ను పెంచుతాయి.
(16:29) బాలురు టఫ్ అయి ఉండాలని బాలికలు అందంగా లొంగతీసుకునేలా ఉండాలని నేర్చుకుంటే వారి జీవితాలు హింస యంజైటీతో నిండిపోతాయి. ఫాక్సెడ్ సొసైటీ రీసెర్చ్ జెండర్ స్టీరియోటైప్స్ [సంగీతం] బాలికల్లో సెల్ఫ్ ఎస్టీ తగ్గించి బాడీ ఇమేజ్ సమస్యలు సెల్ఫ్ హార్మ్ పెంచుతాయి. బాలుర్లో టాక్సిక్ మస్క్లినిటీ వల్ల భావోద్వేగాలు అణచివేయడం, అగ్రెషన్ స్కూల్లో అండర్ పర్ఫార్మెన్స్ వస్తాయి.
(16:51) మాతృ జెండర్ ఆటిట్యూడ్ స్టడీ తల్లులు సమానత్వ వైఖరి కలిగి ఉంటే పిల్లల్లో ఎమోషనల్ సింటమ్స్ పీ రిలేషన్ ప్రాబ్లమ్స్ తగ్గి ప్రొసోషల్ బిహేవియర్ పెరుగుతుంది. సాంప్రదాయిక వైఖరి ఉన్న కుటుంబాల్లో పిల్లలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. బెన్సిఈఆర్టి యూనిసెఫ్ఎన్ఎంహెచ్ఎస్ సర్వేల ప్రకారం స్కూల్ విద్యార్థుల్లో డిప్రెషన్ 25 నుంచి 30% వరకు ఉంది. ఒక అధ్యయనంలో 25.
(17:16) 92% [సంగీతం] అడాల్సెంట్లలో డిప్రెషన్ 13.7 70%లో యంజైటీ ఇండియాలో స్టూడెంట్ సూసైడ్స్ ఏటా 13వ000కి పైగా ఎక్కువగా అకాడమిక్ ఫెయిల్యూర్స్ [సంగీతం] ఫ్యామిలీ ప్రెజర్ వల్లఎన్సిఆర్బి డేటా ప్రకారం పురుష విద్యార్థుల సూసైడ్ రేటు ఎక్కువ తండ్రి ఒత్తిడి డబ్బు సంపాదించు తల్లి త్యాగం ఇంట్లో ఉండు చూసి పిల్లలు రాట్ రేస్ లో నెట్టబడుతున్నారు.
(17:40) లింగ ఆధిపత్యం ఉన్న కుటుంబాల్లో పిల్లలు తక్కువ హ్యాపీనెస్ ఎక్కువ హింస అసమానతలు నేర్చుకుంటారు. బాలురు భావాలు చెప్పలేక సూసైడ్ రేట్ పెరుగుతుంది. బాలికలు స్వేచ్ఛ లేక డిప్రెషన్ యంజైటీలో మునిగిపోతారు. ఈ లూప్ కొనసాగుతుంది. చదువు, ఉద్యోగం పెళ్లి మళ్ళీ అదే సైకిల్ ఆస్తి, వారసత్వం, అణచివేత అనే పునాదుల మీద నిర్మించిన కుటుంబ వ్యవస్థ ఎంత కుళ్లిపోయిందో చూపిస్తుంది.
(18:08) దీనికి తోడుగా మన సమాజం చేస్తున్న అతి పెద్ద తప్పు దమన నీతి. లైంగికతను ఒక [సంగీతం] బూతుగా మార్చేయడం. హార్వర్డ్ సైకాలజిస్ట్ డానియల్ వెగ్నర్ వైట్ బేర్ ఎఫెక్ట్ ప్రకారం మనం దేన్నైతే నిషేధించి అణచివేస్తామో మెదడు దానిపైనే విపరీతమైన ఆకర్షణను పెంచుకుంటుంది. సరైన జ్ఞానం లేకపోవటం వల్ల యువతలో విపరీతమైన ఉత్సుకత ఏర్పడి మనిషిని ఒక వస్తువులా చూసే ప్రమాదానికి దారి తీస్తోంది.
(18:33) దేశంలో జరుగుతున్న దారుణమైన రేపులకు వికృతమైన అపరాధాలకు ఈ దమన ప్రభావమే ప్రధాన కారణం. కనీసం పెళ్లయిన తర్వాత కూడా భాగస్వామి శరీరం పట్ల అవగాహన లేక అపరాధ భావనతో సహజమైన కోరికలను కూడా వికృతంగా తీర్చుకునే మనస్తత్వం పెరిగిపోతుంది. దీని నుండి బయటపడాలంటే లైంగిక విద్యను ఇంట్లో [సంగీతం] పెద్దలు స్కూల్లో టీచర్స్ కామశాస్త్రంలా కాకుండా జీవశాస్త్రంగా ఒక మోరల్ స్టోరీ రూపంలో చిన్నప్పటి నుండే నేర్పాలి.
(19:03) ఐదు నుంచితొమ్మిది ఏళ్ల వయసులోనే వారి శరీర భాగాలు సమ్మతి గురించి చెప్తే లైంగిక వేధింపులను వెంటనే గుర్తించగలరు. 10 నుంచి 13 ఏళ్ళు వచ్చేసరికి పిట్యూటీరీ గ్రంధి విడుదల చేసే టెస్టోస్టరాన్ ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్ల వల్ల కలిగే మార్పులు ఆకర్షణ అనేది కేవలం బయోలాజికల్ ప్రాసెస్ అని వివరించాలి. ఇక 14 నుంచి 18 ఏళ్ల వయసులో సెక్స్ అనేది కేవలం శారీరక కలయక మాత్రమే కాదు అది సామాజిక బాధ్యత అని సురక్షితమైన పద్ధతుల గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి.
(19:33) అప్పుడే ఆ విపరీతమైన ఆకర్షణ తగ్గి గౌరవప్రదమైన సురక్షితమైన సమాజం ఏర్పడుతుంది. మరిమని పవిత్ర సంప్రదాయాల మాటఏమిటి? మనం రక్షణ కోసం నిర్మించుకున్న గూడు ఒక ప్రెజర్ కుక్కర్ లా మారిపోయింది. ఒక కొడుకుపై ఆధిపత్యం కోసం అత్త కోడల్ని కోడలు అత్తను చంపుకునే స్థాయికి క్రూరత్వం పెరిగింది. తోడుగా ఉండాల్సిన భార్యా భర్తలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు.
(19:57) పెళ్లైన మొదటి రాత్రే వధువరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంపుకుంటున్నారు. అన్నిటికంటే దారుణం. తల్లి తండ్రి తన బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకొని తను చస్తూ వారిని కూడా వాళ్ళ చేతులతోనే చంపేస్తున్నారు. ఇది కుటుంబం కాదు ఇది వ్యవస్థ పరాకాష్టకు చేరి దాని పర్యావసానం చూపెడుతుంది సమాజానికి ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు ఇది సామాజిక నిర్మాణం పితృస్వామ్యం పిల్లలకు బలం అని నేర్పిస్తుంది.
(20:25) కానీ నిజమైన బలం భావోద్వేగాలను అర్థం చేసుకోవడం సమానంగా బ్రతకడం కానీ మార్పు సాధ్యమే సమానత్వం ఉన్న కుటుంబాల్లో పిల్లలు హ్యాపీగా ఆరోగ్యంగా ఎదుగుతారు. మనం ఈ లూపును బ్రేక్ చేయాలి. ప్రపంచంలోని అన్ని దేశాల కుటుంబ ఆర్థిక సమానత్వం మహిళల గౌరవం మరియు మహిళల సెక్యూరిటీలో మన పరిస్థితి చూడండి. 2026 తాజా నివేదికలు మన దేశ ప్రతి సామాన్య కుటుంబాల వ్యధను బయట పెడుతున్నాయి.
(20:53) ఒకటి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026 147 దేశాలలో భారత్ 116వ స్థానం నేపాల్ 99 కంటే కూడా వెనుకబడి ఉండటం బాధాకరం. రెండు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 148 దేశాలలో మన భారత్ 131వ స్థానంలో ఉంది. మహిళల ఆర్థిక స్వేచ్ఛ రాజకీయ భాగస్వామ్యం దారుణంగా వెనుకబడి ఉన్నాయి.మూడు [సంగీతం] ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025 26 భారత్ 131వ స్థానంలో ఉంది.
(21:26) మహిళల భద్రత న్యాయం ఇంకా దారుణమైన స్థితిలోనే ఉన్నాయి దీన్ని చూసి చెప్పొచ్చు మహిళలు మీకు ఈ దేశంలో మహిళల భద్రత చాలా వెనుకబడింది. ఆడవాళ్ళు మహాలక్ష్మి అనేది మనం చెప్పుకునే పచ్చి అబద్ధం అని తెలుస్తుంది. ఇవి కేవలం సంఖ్యలు కాదు మన పిల్లల భవిష్యత్తు స్వీడెన్, ఫిన్లాండ్, నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్ వంటి దేశాలు టాప్ లో ఉండటం యాదృచ్చికం కాదు.
(21:50) వారు ఆధిపత్యాన్ని త్రోసివేసి సమాన భాగస్వామ్యం షేడ్ పేరెంటింగ్ ఎమోషనల్ హెల్త్ ను నిజంగా అమలు చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చి మన దేశ పరిస్థితి చూస్తే ఒక్కటే అనాలనిపిస్తుంది. మన కుటుంబ వ్యవస్థ ప్రతి మనిషి మానసిక వ్యధ మన సంప్రదాయాలు చాలా వరకు ఇంకా అనాగరికంగానే ఉన్నాయి. దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పటికీ ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైన ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థను నిర్మించలేకపోయాం.
(22:19) ఈ సమాజం ఈ సంస్కృతి ఈ పితృస్వామ్య బానిసత్వం మన పిల్లల జీవితాలను ఒక రాక్షస లూపులో నెట్టేస్తుంది. మనం ఇప్పటివరకు చర్చించుకున్న చీకటి చరిత్రకు అణచివేతకు సరిగ్గా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న దేశాలు ఇవి. డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడెన్ వంటి దేశాలు సంతోష సూచిలో అగ్రస్థానంలో ఉండటానికి కారణం అక్కడ మనుషులు కేవలం బతుకుతున్నారు అని కాదు వారు వికసిస్తున్నారు.
(22:47) వారు అనుసరిస్తున్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో ముఖ్యంగా కుటుంబం మరియు పిల్లల విషయంలో వారు చేసే పనులు ఏంటో ఇక్కడ చూడవచ్చు. అక్కడ పెళ్లి అంటే ఒకరు మరొకరికి బానిసత్వం కాదు. స్వీడన్ నార్వే వంటి దేశాల్లో పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి ఇంటికో అబ్బాయి అమ్మాయి ఇంటికో వెళ్లరు. వారు తమకంటూ ఒక స్వతంత్ర ప్రపంచాన్ని ఇండిపెండెంట్ హోమ్ నిర్మించుకుంటారు.
(23:11) అక్కడ అతమామల ఆధిపత్యం ఉండదు. కేవలం ఒకరిపై ఒకరికి గౌరవం [సంగీతం] మాత్రమే ఉంటుంది. ఇక గుర్తింపు విషయానికి వస్తే ఐస్లాండ్ లాంటి దేశాల్లో భార్య తన సొంత ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆమె ఒక పురుషుడి సొత్తు కాదు. ఒక సమాన భాగస్వామి. ఈ ఆర్థిక స్వేచ్ఛ సామాజిక సమానత్వమే ఆ దేశాలను ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలుగా నిలబెట్టాయి.
(23:36) బంధం అనేది బాధ్యత అనే బరువుతో కాకుండా ప్రేమ అనే ఇష్టంతో అక్కడ కొనసాగుతుంది. అక్కడ రెండు వైపుల అత్తమామలకు సమానమైన విలువ ఉంటుంది. మా ఇల్లే గొప్ప అనే అహంకారం అక్కడ కనిపించదు. ఆర్థికంగా ఇద్దరు స్వతంత్రులు కాబట్టి వారి బంధం ఆస్తి మీద కాకుండా కేవలం నమ్మకం మరియు ప్రేమ మీద మాత్రమే నిలబడుతుంది. అందుకే అక్కడ గొడవలు తక్కువ సంతోషం ఎక్కువ ఒకటి లింగ సమానత్వం అది కేవలం మాట కాదు ఒక చట్టం జెండర్ ఈక్వాలిటీ యస్ లా ఈ దేశాల్లో స్త్రీ పురుషులు సమానం అనేది ఒక నినాదం కాదు అది ఒక వాస్తవం.
(24:12) ఆర్థిక స్వతంత్రత ఉండటం వల్ల పెళ్లి అనేది ఒక ఆర్థిక భద్రత కోసం కాకుండా కేవలం ప్రేమ తోడు కోసమే చేసుకుంటారు. అలాగే పారెంటల్ లీవ్ పిల్లలు పుట్టినప్పుడు కేవలం తల్లికి మాత్రమే కాదు తండ్రికి కూడా సమానంగా సెలవులు ఇస్తారు. దీనివల్ల పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత అనే పాత పద్ధతి తుడిచిపెట్టుకుపోయింది. రెండు పిల్లలు దేశం యొక్క ఆస్తి.
(24:35) ఈ దేశాల్లో పిల్లలను పెంచడం అనేది కేవలం ఆ తల్లిదండ్రుల బాధ్యతగా ప్రభుత్వం చూడదు. ఉచిత విద్య మరియు వైద్యం వల్ల తల్లిదండ్రులకు ఆర్థిక [సంగీతం] ఒత్తిడి ఉండదు. తల్లులు మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళడానికి వీలుగా అత్యాధునికమైన శిశు సంరక్షణ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. మూడు పని జీవిత సమతుల్యత ఫ్లెక్సిబిలిటీ సాయంత్రం నాలుగు లేదా 5ు గంటలకే ఆఫీసులు ముగుస్తాయి.
(25:00) మిగిలిన సమయమంతా కుటుంబంతో పిల్లలతో గడపడానికి కేటాయిస్తారు. డెన్మార్క్ లో హిగ్గే స్వీడెన్ లో లాగోం అనే ఫిలాసఫీలను అనుసరిస్తారు. అంటే అనవసరమైన పోటీ విలాసాల కంటే మానసిక ప్రశాంతతకు ఎక్కువ విలువ ఇస్తారు. నాలుగు సామాజిక విశ్వాసం స్కాండినేవియన్ దేశాల్లో ప్రజల మధ్య ప్రభుత్వం మీద నమ్మకం చాలా ఎక్కువ. అక్కడ రోడ్డు మీద పసిపిల్లల స్ట్రోలర్లను బయట వదిలిపెట్టి తల్లిదండ్రులు లోపల కాఫీ తాగుతుంటారు.
(25:26) అంటే తన బిడ్డను ఎవరో ఎత్తుకుపోతారనే భయం లేని సేఫ్ సొసైటీని వారు నిర్మించుకున్నారు. పన్నుల రూపంలో కట్టిన డబ్బు మళ్ళీ సౌకర్యాల రూపంలో తమకే అందుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఒక్కసారి తేడా గమనించండి. వివాహం ఇక్కడ మనుగడ కోసం చేసుకునే ఒప్పందం అక్కడ స్వేచ్ఛాయుత ఇద్దరి సమాన భాగస్వామ్యం పిల్లల పెంపకం ఇక్కడ తల్లి ఒక్కరిదే బాధ్యత అక్కడ తల్లి తండ్రి మరియు ప్రభుత్వం ముగ్గురిది బాధ్యత స్త్రీ హోదా [సంగీతం] ఇక్కడ పురుషుడిపై ఆధారపడటం అక్కడ ఆర్థిక స్వయం ప్రతిపత్తి స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానం ఆస్తి హక్కు ఇక్కడ పురుషుడికే అక్కడ ఇద్దరికీ సమాన
(26:05) ప్రాధాన్యత ముగింపు ది ప్రూవెన్ వర్కింగ్ సొల్యూషన్ ఈ దేశాల విజయానికి కారణం వారు మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టారు. స్త్రీని అణచివేస్తే దేశం సగం వెనకబడిపోతుందని వారు గుర్తించారు. మనం పైన చర్చించుకున్న మణిపూర్ బిల్కిస్ బానో లేదా దేవాదాసి వంటి క్రూడత్వారు లేని సమాజం కావాలంటే మన దేశంలో కూడా స్త్రీలకు ఆర్థిక రక్షణ మరియు శారీరక భద్రత కల్పించాలి.
(26:33) ఎప్పుడైతే ఒక మహిళ తన జీవిత నిర్ణయాలను స్వయంగా తీసుకోగలదో అప్పుడే ఆ సమాజం హ్యాపీనెస్ ఇండెక్స్ లో పైకి వెళ్తుంది. ఆనాడు ఆ గర్భవతి అయిన మహిళ వ్యవసాయాన్ని కనిపెట్టి ఎలాగైతే ఆహారాన్ని ఇచ్చిందో నేడు ఈ దేశాలు అదే మహిళా మేదస్సుకు స్వేచ్ఛనిచ్చి సంతోషాన్ని పండిస్తున్నాయి. పెళ్లి తప్పు కాదు కానీ మనం నిర్మించిన వ్యవస్థ పెళ్లి అంటే నరకంలా పురుషులు మహిళలు భయపడిపోయే స్థాయికి వచ్చింది.
(26:58) మనం మార్చితే భవిష్యత్తు మారుతుంది. మనము ఆ దేశాల స్థాయికి వెళ్లేలా మన వ్యవస్థను మార్చుకుందామా లేక మనం ఈ లూప్ లోనే బ్రతుకుతామా లేదా మన పిల్లల కోసం ఒక బెటర్ సిస్టం నిర్మిస్తామా? ఈ కుళ్లిన సమాజంలోనే చచ్చి బతుకుదామా? మనం సిస్టం ను మార్చకపోతే మన పిల్లలు ఈ కుళ్లిన సమాజంలో మనకంటే ఎక్కువ బాధపడతారు. ఆలోచించండి. మీ అభిప్రాయం కింద కామెంట్ [సంగీతం] బాక్స్ లో తెలియజేయండి.
(27:24) ఇలాంటి వీడియో ప్రతి మనిషి చూడాలని మీరు భావిస్తే షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా పాత వీడియో దేవుడు. మనిషి ఊహాత్మక వాస్తవమా? వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను చూడండి. తరువాత వీడియో ఏ టాపిక్ పై చేస్తే [సంగీతం] బాగుంటుందో చెప్పండి ధన్యవాదాలు

No comments:

Post a Comment