Monday, October 5, 2026

ప్రపంచాన్ని నిందించడం ఆపేయ్ ఒక్కసారి | Stop Being A Victim | Satyagrahi

ప్రపంచాన్ని నిందించడం ఆపేయ్ ఒక్కసారి | Stop Being A Victim | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dLtPmsoUWBg





Title: ప్రపంచాన్ని నిందించడం ఆపేయ్ ఒక్కసారి | Stop Being A Victim | Satyagrahi

Author Name: Satyagrahi

Description: Welcome to Satyagrahi, your sanctuary for relentless growth and profound self-discovery.
This isn't just a channel; it's a movement dedicated to unlocking the powerful, authentic person you were meant to be. We believe that true motivation isn't a fleeting spark—it's the steady, unwavering soul-force (Satyagraha) that arises when you align your actions with your deepest truths.
Every video here is designed to be a catalyst for life-changing clarity. We cut through the noise to deliver powerful insights, actionable strategies, and enduring wisdom that will help you:
⚡️ Overcome Procrastination and Fear: Break free from limiting beliefs and step into decisive action.
💡 Find Your Purpose: Discover your unique calling and build a life of meaning, not just routine.
🧘 Build Unstoppable Resilience: Learn to navigate challenges with grace and emerge stronger from every setback.
🌟 Master Your Mindset: Cultivate the mental toughness required to achieve ambitious goals.
Stop surviving and start thriving. Join the community committed to the force of truth and begin the extraordinary journey of mastering your inner world.
New videos every [Day of the week, e.g., Monday and Thursday]!

➡️ Subscribe now and claim your power. Your life-changing moment starts here.





This channel may feature content under Section 107 of the Copyright Act (1976). Fair use is permitted for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship, motivation, and research. Any use of copyrighted material in our videos is for educational, motivational, and non-profit purposes only, and is not intended to infringe upon the rights of the original copyright holders.







#motivation #inspiration #success #mindset #positivity #discipline #focus #growth #nevergiveup #selfimprovement #successmindset #confidence #lifelessons #dailyquotes #motivationdaily #motivationalvideo #successquotes #hardwork #positivethinking #mindpower

Transcript:
(00:01) [సంగీతం] రాత్రంతా ఇంటి తలుపులు కిటికీలు బార్లా తెరిచి పడుకొని తెల్లవారు జామును ఒళ్ళంతా దోమలు కొట్టాయి అని చెప్పేసి బాధపడితే ఏమైనా అర్థం ఉందా నవ్వువస్తుంది కదా మన జీవితాల్లో మనం రోజు చేస్తున్న పని సరిగ్గా ఇదే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే ఏడుపు నాకు మనశశాంతి లేదు సమాజం నన్ను తొక్కేస్తుంది.
(00:24) చుట్టూ ఉన్న మనుషులు నన్ను మోసం చేస్తున్నారు. పరిస్థితులు నన్ను నాశనం చేస్తున్నాయి. నిజం ఏంటంటే మనం రోజు బయట శత్రువులతో కాదు మన నీడతో మనం కొట్లాడుతున్నాం. శ్రీ అరవింద్ గారు మానవ మనస్తత్వం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటారు. మనిషి ఎప్పుడు తన బయట ప్రపంచాన్ని జయించాలని తాపత్రాయ పడతాడు.
(00:46) కానీ తన లోపల ఉన్న గందరగోళాన్ని ఏనాడు పట్టించుకోడు అని. మన జీవితంలోకి అశాంతి, భయం, బలహీనత రావడానికి బయట ఎవరో కారణం కాదు వాటికి మనమే వెనుక వైపు దొంగతలు తీసి ఉంచాం. మనందరం అనుకుంటాం సమస్య ఎక్కడో బయట ఉందని ఆఫీస్ లో బాస్ తిట్టాడని ఒకడు రగిలిపోతూ ఉంటాడు. వ్యాపారంలో అనుకున్నంత లాభం రాలేదని ఇంకొకడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి రోజూ బాధపడుతుంటాం.
(01:12) కానీ శ్రీ అరవిందో గారు చెప్పిన ఇంటిగ్రల్ ఫిలాసఫీ లోతుల్లోకి వెళ్లి చూస్తే ఒక షాకింగ్ నిజం కనిపిస్తుంది. మనం ఎదుర్కొనే ప్రతి బాహ్య సంక్షోభం కేవలం మన అంతర్గత అచేతన స్థితికి ప్రతిబింబం మాత్రమే. మనం సమాజం చూడనప్పుడు చేసే చిన్న చిన్న నిజాయితి లేని పనులు ఉన్నాయి చూసారా ఎవరు గమనించట్లేదు కదా అని చెప్పేసి ఆఫీస్ పని సమయంలో మన పర్సనల్ పనులు చేసుకోవడం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరూ లేరని చెప్పేసి సిగ్నల్ జంప్ చేయడం మన తప్పు ఉందని తెలిసినా ఎదుటి వారి మీద గెలవడానికి అనవసరమైన అహంకారం ప్రదర్శించడం వీటిని మనం చాలా లైట్ తీసుకుంటాం.
(01:48) అంత చిన్న విషయానికి ఏమవుతుందిలే అని చెప్పేసి సర్ది చెప్పుకుంటాం. కానీ అక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. మన లోపల మనం చేసుకునే ఈ చిన్న చిన్న కాంప్రమైజ్లే మన అంతర్గత శక్తికి పడుతున్న అతి పెద్ద రంధ్రాలు మన ఉపచేతన మనసు చాలా విచిత్రమైనది మనం చేసే ప్రతి చిన్న మోసాన్ని ప్రతి దొంగ ఆలోచనని అది నిశ్శబ్దంగా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది.
(02:09) లోకానికి మనం ఎంత గొప్ప మేధావిగా కనిపించినా, ఎంత నీతిమంతుడిగా ఫోజులు కొట్టిన, రాత్రి ఒంటరిగా దిండు మీద తలపెట్టినప్పుడు మన అంతరాత్మకు తెలుసు మనం ఎక్కడ రాజీ పడ్డామో అంటే మనం ఎక్కడ తప్పు చేసాము అని చెప్పేసి. శ్రీ అరబిందు గారు తన సాధనలో స్పష్టంగా చెప్పారు అంతర్గత సమగ్రత లేని మనిషి బాహ్యంగా ఎంత బలవంతుడిగా కనిపించినా లోపల శిధిలమైపోతూనే ఉంటాడు అని.
(02:36) మనం బయట ప్రపంచంలో ధైర్యంగా నిలబడలేకపోవడానికి కారణం ఎదుటివాడి బలం కాదు మన లోపల మనమే కల్పించుకున్న ఈ సూక్ష్మమైన బలహీనతలు ఇంకో దారుణమైన విషయం ఏంటో తెలుసా మనం మన శక్తి నిరంతరం వృధా చేస్తున్నాం ఎక్కడో ఎవడో ఏదో అన్నాడని రోజంతా వాడి గురించే ఆలోచిస్తాం. గతం గురించి కుమిలిపోతాం. భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేస్తాం. కానీ ప్రస్తుతం మనం జీవిస్తున్న క్షణంలో మన ప్రవర్తన ఎలా ఉందో పట్టించుకోం.
(03:02) మనం ప్రపంచాన్ని సరిదిద్దడానికి సిద్దపడతాం కానీ మన ఆలోచన సరళిని సరిచేసుకోవడానికి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యం. శ్రీ అరవింద్ గారి మాటల్లో చెప్పాలంటే మనిషి ఎప్పుడు ఒక విక్టిమ్ లా బ్రతకడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే బాధ్యత తీసుకోవడం కంటే ఇతరులను నిందించడం చాలా సులువు. కానీ సమస్యను గుర్తించకుండా పరిష్కారం కోసం బయట వెతకడం అంటే రోగం కడుపులో ఉంటే తలకు మందు రాసుకోవడం లాంటిది.
(03:29) మనం ఇప్పుడున్న ఈ నిస్సహాయత స్థితికి అసలు మూలం ఎక్కడుందో లోతుగా చూడాల్సిన సమయం వచ్చింది. అందులోనూ అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది మనకు ఎప్పుడైనా అనిపించిందా మనం ఇంతలా ఎందుకు విచ్చిన్నమై పోతున్నామని శ్రీ అరవిందో గారు మానవ స్వభావాన్ని శోధిస్తూ ఒక అద్భుతమైన తాత్విక నిజాన్ని బయట పెట్టారు. మనలో మూడు వేరు వేరు శక్తులు నిరంతరం కొట్టుకుంటూ ఉంటాయి.
(03:51) మన మెదడు ఆలోచించే ఆలోచనలు మన ప్రాణ శక్తిలో పుట్టే స్వార్ధ పూరిత కోరికలు. మన శరీరంలో పేరుగుపోయిన జడత్వం మరియు సోమరితనం. ఈ మూడింటి మధ్య ఏ కోశాన పొంతన ఉండదు. మనం పైకి గొప్పగా ఉండాలని ఆలోచిస్తాం. కానీ మన శరీరం మాత్రం చిల్లర సుఖాల కోసం చౌకబారు గుర్తింపు కోసం వెంబర్లాడుతుంది. శ్రీ అరవిందో గారి భాషలో దీన్ని లోయర్ వైటల్ అంటారు.
(04:14) ఈ క్రింది స్థాయి స్వార్థమే మనల్ని ఎప్పుడు అసూయతో, ద్వేషంతో, పోలికలతో ఉడికించి చంపుతుంది. పక్కవాడు బాగుపడితే మన కడుపు మండుతుంది. వాడు కింద పడితే లోపల ఏదో పైశాచిక ఆనందం కలుగుతుంది. ఇలాంటి సంకుచిత బుద్ధి లోపల దాచి పెట్టుకొని బయట మాత్రం నాకు శాంతి కావాలి. విజయం కావాలి అని చెప్పేసి దేవుని వేడుకుంటే ఆ శాంతి ఎలా వస్తుంది మనం ఎప్పుడూ ఇతరుల నుంచి అప్రూవల్ కోరుకుంటాం.
(04:39) సమాజం మనల్ని గొప్పగా చూడాలి 10 మంది మెచ్చుకోవాలి దానికోసం లేని వ్యక్తిత్వాన్ని ఉన్నట్లు నటిస్తాం. ఆఫీస్ లో బాస్ ముందర వినయంగా వంగి దండాలు పెడతాం. ఆయన గది దాటగానే వెనుక్క తిట్టిపోస్తాం. ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని లేని గొప్పలు చెప్పుకుంటాం. ఇంట్లో వాళ్ళ మీద ఆ చిరాగ అంతా చూపిస్తాం. శ్రీ అరవిందో గారు ఒక హెచ్చరిక చేస్తారు.
(05:00) ఎప్పుడైతే మనిషి తనలోని అసలైన స్వభావానికి బయట ప్రవర్తనకి మధ్య ఉన్న అగాధాన్ని పెంచుకుంటాడో అప్పుడు వాడు తన శక్తిని తానే దొంగలించుకుంటున్న వాడు అవుతాడు అని మన నటనతో సమాజాన్ని మోసం చేయగలుగుతామేమో కానీ విశ్వ చైతన్యాన్ని ప్రకృతి నియమాలని మోసం చేయలేం. ఎక్కడైతే నిజాయితీ లోపిస్తుందో అక్కడ బలహీనత స్థావరం ఏర్పరచుకుంటుంది.
(05:23) బయట నుంచి వచ్చే చిన్న ఎదురు దెబ్బలకే మనం కొప్పుకోలిపోవడానికి కారణం ఇదే. మన పునాది లోపల మొత్తం అబద్ధాల మీదే నిర్మితమై ఉంది. మనల్ని వేధించే ఇంకో ప్రమాదకరమైన జబ్బు ఏంటంటే క్షమించలేనితనం పగని లోపల దాచిపెట్టుకొని బ్రతకడం ఎవరో మనల్ని గతంలో మోసం చేశారు అవమానించారు. వాళ్ళు ఎప్పుడో ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.
(05:44) కానీ మనం వాళ్ళు మనకు చేసిన గాయాన్ని పదే పదే గిల్లుకుంటూ వాళ్ళ మీద కసితో ప్రతీకారంతో రగిలిపోతూ మన నెత్తురు మనమే మరిగించుకుంటున్నాం. శ్రీ అరవింద్ గారు చెప్పిన ఒక సూక్ష్మమైన సత్యం ఇక్కడ గుర్తించాలి ద్వేషం అనేది మనం తాగి ఎదుటివాడి చచ్చిపోవాలని కోరుకునే ఒక విషయం లాంటిది మనం ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకున్న ప్రతిసారి వాళ్ళ చేతికి మనమే మనశశాంతి తాలూకు తాళం చెవులు ఇచ్చేస్తున్నాం.
(06:08) వాడి ముఖం గుర్తొస్తే మన బీపీ లెగుస్తుంది. వాడి పేరు వింటే మన పనులు ఆగిపోతాయి అంటే మనం మన జీవితాన్ని జీవించట్లేదు. వాడు మనల్ని ఎమోషనల్ గా నడిపిస్తున్నాడు. ఈ అంతర్గత విషయాన్ని కడుపులో మోస్తూ మనం బయట సంతోషంగా ఎలా ఉండగలం? సమస్య ఎక్కడుందో చూశారా మనం బాహ్య శత్రువుల మీద యుద్ధం ప్రకటిస్తున్నాం కానీ మన లోపల ఉన్న అసూయ, కోపం, కపటత్వం అనే అసలైన శత్రువులకి రాజభోగాలు పెడుతున్నాం.
(06:32) శ్రీ అరవిందో గారు దీన్నే అచేతనత లేదా ఇగ్నోరెన్స్ అంటారు. మనం చీకట్లో కూర్చొని కాంతి రావట్లేదు అని చెప్పేసి గుండెల్ని బాదుకుంటున్నాం. కానీ మన కళ్ళకి మనమే కట్టుకున్న అజ్ఞానం అనే గంతలను మనం విప్పట్లేదు. ఎక్కడైతే అంతర్గత నిజాయితీ ఉండదో అక్కడ మనో ధైర్యం ఉండదు. మనోధైర్యం లేని చోట భయం రాజ్యం వెలుతుంది. మనం నిత్యం భయపడుతూ ఒత్తిడితో బతకడానికి మూల కారణం బాహ్య పరిస్థితులు కావు.
(06:58) మన లోపల మనం నింపుకున్న అసలు పరిష్కారం కానీ భావోద్వేగాల చెత్త చెదారమే. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి? ఈ విష వలయం నుంచి బయటపడటానికి మొదటి మెట్టు తీవ్రమైన ఆత్మ పరిశీలన మనల్ని మనం మోసం చేసుకోవడం ఆపేయాలి శ్రీ అరవింద్ గారు చెప్పిన అత్యంత విలువైన పద్ధతి సాక్షి భావం అంటే మన ఆలోచనల్ని మన భావోద్వేగాలని మనం ఒక నిర్లిప్త ప్రేక్షకుడిగా గమనించడం నేర్చుకోవాలి.
(07:27) కోపం వస్తున్నప్పుడు వెంటనే అరవడం కాదు. ఒక క్షణం ఆగి ఈ కోపం ఎవరి కోసం వస్తుంది? నా అహంకారం దెబ్బ తిన్నందుకా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎదుటివాడి మీద అసూయ పడుతున్నప్పుడు దాన్ని కప్పు పుచ్చుకోకుండా అవును నా లోపల అభద్రత ఉంది. అందుకే వీడి ఎదుగుదల నన్ను కలవర పెడుతుందని మనతో మనం నిర్భయంగా ఒప్పుకోవాలి.
(07:48) శ్రీ అరవిందో గారు అంటారు చీకటిని తరిమి కొట్టడానికి కర్రలు అక్కర్లేదు. అక్కడ ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. అలాగే నీ లోపల బలహీనతలను నిజాయితీతో చూసిన మరుక్షణమే వాటి బలం సగానికి సగం నశిస్తుంది. మనం ఇప్పుడు చేయాల్సింది బయట ప్రపంచాన్ని ఎదిరించడం కాదు మన అంతర్గత శక్తులని ఒకే తాటి పైకి తీసుకురావడం శ్రీ అరవిందో గారి పూర్ణ యోగంలో ప్రధాన సూత్రం సమలేఖనం మన ఆలోచన మన మాట మన చేత ఈ మూడు ఒకే సరళ రేఖలో ఉండాలి.
(08:17) ఎవరు చూడనప్పుడు మనం ఎలా ఉంటామో సమాజం ముందు అలాగే ఉండాలి. అంతర్గత భారాన్ని దించేసుకోవాలి. గతంలో ఎవరో చేసిన తప్పుకి ఈ క్షణంలో మనం ఎందుకు నరకం అనుభవించాలి, క్షమాపణ అనేది ఎదుటి వాడికి ఇచ్చే దానం కాదు. మన మనసుని మనం శుభ్రం చేసుకునే ఒక ప్రాక్టికల్ డీటాక్స్ ప్రక్రియ వాడి తప్పులు వాడి కర్మకే వదిలేసి ఆ భారం అంతా దించి పక్కన పెట్టేయాలి.
(08:40) ఎప్పుడైతే మనం ద్వేషాన్ని మోయడం ఆపేస్తామో, అప్పుడు మన చేతులు అసలైన జీవితాన్ని పట్టుకోవడానికి ఖాళీ అవుతాయి. ఇక్కడ మనం పాటించాల్సిన అత్యంత కీలకమైన సూత్రం ఒకటి ఉంది. దాన్నే మనం అదృశ్య సమగ్రత అనుకుందాం. శ్రీ అరవిందో గారు అంతర్గత క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మార్గదర్శనం చేస్తారు. ప్రపంచం చూస్తున్నప్పుడు ప్రదర్శించే ధర్మం కంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాటించే చిత్తశుద్ధే నీ నిజమైన చేతనను నిర్ణయిస్తుంది.
(09:09) ఆఫీస్ లో మేనేజర్ పక్కన లేనప్పుడు కూడా మన బాధ్యతని పూర్తి నిజాయితీతో చేయటం. ట్రాఫిక్ లో పోలీసులు లేకపోయినా రెడ్ లైట్ పడగానే ఆగిపోవడం షాపింగ్ చేసి బయటకు వచ్చాక ట్రాలీని నిర్లక్ష్యంగా గాలిలోకి వదిలేయకుండా దానికి కేటాయించిన చోట పెట్టడం ఇవి సమాజానికి పెద్దగా కనిపించని అతి చిన్న పనులు కావచ్చు కానీ ఈ చిన్న పనులే మన ఉపచేతన మనసులో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నిర్మిస్తాయి.
(09:35) మనం మన కళ్ళ ముందే ఒక నిజాతిపరుడుగా నిలబడినప్పుడు మన అంతరాత్మకి ఒక కొత్త శక్తి వస్తుంది. ఆ శక్తి ముందు ప్రపంచంలో ఏ చిన్న సమస్య కూడా మనల్ని భయపెట్టలేదు. మనం పోరాడాల్సింది బయట వ్యక్తులతో కాదు మనలోని జడత్వం సోమరితనంతో. శ్రీ అరబిందో గారి మాటల్లో చెప్పాలంటే మనిషి తన దిగువ స్థాయి ప్రవృత్తులకు లొంగిపోయి బ్రతకడం చాలా సులభం.
(10:00) కానీ తన చేతనని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం అసలైన వీరత్వం. మన మైండ్ చెప్పే ప్రతి నెగిటివ్ ఆలోచనకి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఏదైనా చెడు ఆలోచన రాగానే దాన్ని వెంటనే గుర్తించి దానికి ఆహారం ఇవ్వడం ఆపేయాలి. మనం మన లోపల ద్వారాలు మూసేస్తే బయట నెగిటివిటీ ఎంత పెద్ద తుఫాన్ లా వచ్చినా లోపలికి ప్రవేశించలేదు. ఎందుకంటే ముందు సమలేఖనం ముఖ్యం.
(10:24) ఎప్పుడైతే మనం మన ఆలోచనల్లో చేతల్లో ఒక పవిత్రమైన క్రమశిక్షణని అలవరుచుకుంటామో అప్పుడు అసలైన విజయం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సరి ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? జీవితాన్ని మార్చుకోవడం అంటే కొండలు పిండి చేయాల్సిన పని లేదు. మనం రోజువారి స్పృహని ఒక అంగులం పైకి లేపితే చాలు. శ్రీ అరవింద్ గారు చెప్పిన అత్యంత విప్లవాత్మకమైన ఆలోచన ఇదే.
(10:47) జీవితం అనేది పారిపోవడానికి కాదు దాన్ని ఉన్నతమైన చైతన్యంలో రూపాంతరం చెందించడానికి మనం రోజు ఉదయం నిద్ర లేవగానే ప్రపంచం మీదకి దాడికి వెళ్ళినట్లు పరిగెత్తడం మానేయాలి కనీసం ఒక 10 నిమిషాలు నిశశాబ్దంగా కూర్చొని మన అంతరాత్మ వైపు చూడటం నేర్చుకోవాలి. ఈరోజు నేను ఎవరితో మాట్లాడాలి నా పనిని నేను ఎంత పర్ఫెక్ట్ గా చేయాలి నా స్వార్థాన్ని ఎంతవరకు అదుపులో ఉంచుకోవాలి ఈ స్పష్టతతో మనం రోజు ప్రారంభిస్తే పరిస్థితులు మనల్ని నియంత్రించలేవు మనమే పరిస్థితులకు దిశా నిర్దేశం చేస్తాం.
(11:21) మనం గుర్తుంచుకోవలసిన గొప్ప సత్యం ఏంటంటే మన విలువ మనం సంపాదించే డబ్బులోనో సమాజం ఇచ్చే హోదాలోనో లేదు. మన చేతన ఎంత నిర్మలంగా ఉందనే దానిపైనే మన జీవితపు ఘాఢత ఆధారపడి ఉంటుంది. శ్రీ అరవిందో గారి మాటల్లో చెప్పాలంటే మనిషి ఒక సంపూర్ణమైన సృష్టి మాత్రమే. ఆ సృష్టి యొక్క అసలైన గమ్యం ఏంటంటే తనను తాను అధిగమించి పరిపూర్ణత వైపు ఎదగడమే అసలైన గమ్యం.
(11:46) బయట వ్యక్తుల తీర్పులను పట్టించుకోవడం ఆపేయండి. ఎవరో మనల్ని పొగిడినంత మాత్రాన మనం ఆకాశానికి ఎగిరిపోవాల్సిన పని లేదు. ఎవరో మనల్ని విమర్శించినంత మాత్రాన మనం పాతాళానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన అంతర్గత నిశ్చలత్వమే మనకి రక్షణ కవచం. ఎప్పుడైతే మనం లోపల ప్రశాంతంగా నిజాయితీగా ఉంటామో అప్పుడు బయటి అశాంతి మనల్ని తాగడానికి కూడా భయపడుతుంది.
(12:10) జీవితాన్ని శపించడం ఆపి మన అంతర్గత తలుపులు మూసుకుందాం. అప్పుడు శాంతి అనేది ఎక్కడో వెతుకోవాల్సిన విషయం కాదు, మన సహజ స్వభావంగా మారిపోతుంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ [సంగీతం] [సంగీతం] హ

No comments:

Post a Comment