Thursday, January 27, 2022

నేటి మంచిమాట. రోజులో ఒక గంటపాటు అయినా మౌనము పాటించుట అలవాటు చేసుకోవాలి.

నేటి మంచిమాట.

రోజులో ఒక గంటపాటు అయినా మౌనము పాటించుట అలవాటు చేసుకోవాలి.

దీనివలన మనసులో అలజడి క్రమక్రమముగా తగ్గుముఖం పడుతుంది.

మౌనముగా ఉండడం అంటే నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండడమని కాదు!

కలియుగములో మానవుని మనస్సు మిక్కిలి చంచలమైనది. క్షణమునకు ఎన్ని ఆలోచనలు చేస్తుందో చెప్పలేము.

అటువంటి చంచలమైన మనస్సును ఒక గంటసేపు ఎట్టి ఆలోచనలు, కోరికలు లేకుండా శూన్యముగా ఉంచుకోవడమే అసలైన మౌనము.

అంతేగానీ బయటకి నోరు తెరవకుండా, మాట్లాడకుండా లోపల ఏవేవో అలోచనలు చేస్తుంటే అది మౌనము అనిపించుకోదు.

కోరికలను అరి కట్టాలి. ఆలోచనలు, కోరికలు లేని మనస్సు సులభంగా భగవంతునిపై స్థిరం అవుతుంది.

ఈసాధన ప్రతిరోజూ చేస్తుంటే మనస్సు సులభంగా అదుపులోకి వస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉంటుంది.*

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment