20-08-2022:-శనివారం
ఈ రోజు _AVB_ మంచి మాట.లు
జీవితం చాలా కష్టమైన పరీక్ష, ఆ పరీక్షలో ఏ యిద్దరి ప్రశ్నా పత్రాలు ఒకేలా వుండవనే విషయం గ్రహిస్తే విజయం తధ్యం..
అన్నిచోట్లా మనిషిని తెలివి మాత్రమే కాపాడదు, అప్పుడప్పుడు మంచితనం కూడా రక్షిస్తుంది..
బాధలు అనుభవించినప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది, పడరాని మాటలు భరించినప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది..
యవ్వనం, సౌందర్యం అదృశ్యం అవుతాయి, జీవితం, సంపద మాయం అవుతాయి, పేరు ప్రఖ్యాతులు అంతరిస్తాయి..
పర్వతాలు సైతం ధూళిగా మారుతాయి, సౌభాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి, కానీ సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలిచిపోతుంది...
మనవి అనుకున్నంతవరకే ఈ బంధాలు అప్యాయతలు, మన మనసు ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వెవరో.. నేనెవరో..
ఎంతసున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగనిదే, ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించనిదే..
బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారుంటే వారితో జీవన పయనం ప్రతీరోజు అగ్నిపరీక్ష...
🌹 సర్వేజనా సుఖినోభవంతు🌹
సేకరణ ✍️ _AVB_ సుబ్బారావు 🍇🥭🍫🎁🤝
No comments:
Post a Comment