Friday, August 19, 2022

అజ్ఞానం, అహం

 *అజ్ఞానం, అహం*

*మానవుణ్ణి భగవంతునికి సన్నిహితునిగా చేయకుండా అజ్ఞానమనెడి గోడ అడ్డుగా ఉంటుంటే, ఈ గోడను పడగొట్టి ముందుకు వెళ్ళినవారు సహితం అహంకారమనెడి మరొక గోడచే వెనుకకు నెట్టివేయ బడుతున్నారు.

 *'భగవంతుడు నిజంగా ఉన్నాడు' అని గ్రహించడం ఎంత ముఖ్యమో ఆ భగవంతుడిని మనసులో నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం.

*కేవలము పుస్తకములను చదివినంత మాత్రమున భగవంతుని తత్వం అర్థమైపోదు! 

*దానిని అనుభవించాలి!

 *చదివిన దానిని, తెలుసుకున్న దానిని ఆచరిస్తేనే జ్ఞానం అనుభవంగా రూపాంతరం చెందుతుంది.

*'నాకు అన్నీ తెలుసును, నేను అన్నీ చదివాను, నా కంటే గొప్పవారు లేరు..' ఇలా అనుకుంటే ఇంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు.

 *అజ్ఞానం ఉన్న చోట ఆధ్యాత్మికతకు చోటుండదనేది ఎంత సత్యమో అహం ఉన్న చోట ఆత్మారాముడు నిలువలేడనేది కూడా అంతే సత్యం. 
దీనిని మనం గుర్తుంచుకోవాలి.

           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.

No comments:

Post a Comment