ఆధ్యాత్మిక రహస్యం అనగానేమి???
*మన జీవితంలో సర్వ సాధారణముగా మనకి ఏది లేదో, ఏది దూరం అయిందో, ఏది దక్కలేదో మనం ఎక్కువగా ఆలోచిస్తాం.*
*భగవంతుడికి ఎన్నో పూజలు చేసినా, ఆయన కరుణ పొందలేకపోయామని వాపోతాం...*
*అప్పుడప్పుడు మనం అంతర్ముఖులమై వివేకంతో విశ్లేషించి చూస్తే కొన్ని విషయాలు మనకే ఋజువు అవుతాయి.*
*మనం పొందలేక పోయినవి కాక, పొందినవి, సంపాదించుకున్నవి, నిద్రాణంగా ఉన్నవి, ప్రతిభలు*
*సేవ చేయడానికి లభించే అవకాశాల గురించి ఎప్పుడన్నా ఆలోచించామా??...*
*భగవంతుడు మనకి పుట్టుకతోనే ఎన్నో సుగుణాలు అర్హతలు,యోగ్యతలు, ప్రతిభలు, సేవ చేయగల శక్తి అవకాశాలు కూడా ఇచ్చాడో ఎప్పుడన్నా ఆలోచించామా??*
*మనలో అంతర్గతంగా ఉన్న శక్తులను నిరంతరం జాగృతం చేసి, చైతన్యం చేసి సేవ చేసే ఒక చిన్న అవకాశం కూడా వదిలి పెట్టకూడదు!!...*
*ఒకవేళ బద్ధకముతో వీటిని నిర్లక్ష్యం చేస్తే, మనలో ఆ శక్తులు చైతన్యం కావు, సేవ చేసే అవకాశాలు మళ్లీ లభించకపోవచ్చు.*
*మానవ పరిణామమే చాలా మందగిస్తుంది.*
*10 జన్మల్లో చేసే పని చేయడానికి 20 జన్మలు పట్టచ్చు...*
*అందుకే శ్రీ కృష్ణుడు "జ్ఞాని కాని వాడు సదా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి" అన్నాడు..*
*మన గురించి మనం సంపూర్ణముగా తెలుసుకుంటే, పిరికితనం , సోమరితనం, అలసత్వం, దుఃఖం ,అవిద్య దూరం అవుతాయి.*
*ఎన్ని అవరోధాలు వచ్చినా, నిందలు, అవమానాలు, కన్నీళ్లు, దుష్కర్మలు ఎదురైనా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానముతో కర్మలని ఎదిరించాలి..*
*ఇదే ఆధ్యాత్మిక రహస్యం*
*లోకా సమస్త సుఖినోభవంతు*
No comments:
Post a Comment