“జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *కేనోపనిషత్తు* - 2వ భాగము.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
ద్వితీయఖండము - మంత్రముల వివరణ :
గురువు : బ్రహ్మమంటే ఏమిటో నాకు తెలుసు అని నువ్వు భావిస్తే, నువ్వు తెలుసుకున్నది చాలా స్వల్పం మాత్రమే. అలాగే దేవతులలో నీవు దర్శిస్తున్న బ్రహ్మము కూడా స్వల్పమైనది. కనుక నీవు బ్రహ్మమును గూర్చి ఇంకను తెలుసుకోనే ప్రయత్నం చెయ్యాలి.
అంటే ఆత్మస్వరూపము తెలిసినదానికంటే, తెలియనిదానికంటే అతీతమైంది.
ఆత్మ/బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది కాబట్టీ జ్ఞానంతో దాన్ని తెలుసుకోవచ్చు అన్నది ఇక్కడ భావము. జీవుని జ్ఞాననికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మచైతన్యస్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటివుంటుంది. అది సత్యము.
ప్రతివిషయాన్ని సూక్ష్మబుద్ధితో/జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు అమృతత్వమును పొందుతాడు. ఆత్మద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు. జ్ఞానము ద్వారానే జీవుడు అమరుడవుతాడు.
జీవుడు దీనిని ఈ జన్మలోనే గనుక తెలుసుకుంటే, సత్యము అవగతమౌతుంది. తెలుసుకోలేకపోతే నాశనం(బంధం) గొప్పగా తెలుస్తుంది. కావునా ధీరులు సర్వభూతములలో ఒకే ఆత్మను దర్శించి, బంధరహితులై, జీవన్ముక్తులవుతున్నారు.
తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.... 🙏🏻
No comments:
Post a Comment