కుండలినీ యోగం
[జూన్ 21, అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా...]
✍️ 'లేవండి మేల్కొనండి' స్వామి వివేకానంద లండన్ ఉపన్యాసాల నుంచి...
🙏🌹🥀🪷🌻✳️🌹🥀🪷🌻🙏
తెలిసి చేసినా, తెలియక చేసినా యోగానికి ఫలితం ఉంటుంది. అయితే కుండలినీ శక్తిని జాగృతం చేసిన యోగి జ్ఞానసంపన్నుడవుతాడు. ఆ జ్ఞానాన్ని లోకసంక్షేమం కోసం వినియోగిస్తే వ్యక్తి వివేకానందుడు అవుతాడు♪. స్వార్థ ప్రయోజనాలకోసం వినియోగించుకుంటే పతనమవుతాడు♪. అటువంటి కుండలినీశక్తిని ప్రాణశక్తిలో మిళితం చేసే రాజయోగ రహస్యాలను స్వామి వివేకానంద బోధించారు♪.
🪷┈┉┅━❀🌀❀┉┅━🪷
🪷 వెన్నెముకలో ఇడ - పింగళ అనే రెండు నాడులున్నాయని యోగులు అంటారు♪. వెన్నెముక కిందినుంచి పైవరకూ మధ్యలో బోలుగా ఉండే కాలువ ఉంది♪. ఈ కాలువకు కింది చివర కుండలినీ చక్రముంది♪. కుండలినీ చక్రం లేదా పద్మం త్రికోణాకారంగా ఉంటుంది♪. యోగపరిభాష ప్రకారం ఆ పద్మంలో కుండలినీ అనే శక్తి చుట్టచుట్టుకుని ఉందంటారు♪. ఈ శక్తి మేలుకొన్న వెంటనే, సుషుమ్నా నాడిలో ప్రవేశించి, పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది♪. ఇలా పైకి వెళుతున్న కొద్దీ, మనసు పొరలు ఒకటొకటిగా తొలగిపోతాయి♪. యోగికి రకరకాల దివ్యదర్శనాలు కలుగుతాయి; అద్భుతశక్తులు సంక్రమిస్తాయి♪. ఆ శక్తి మెదడును చేరగానే, మనస్సు శరీరాల నుండి యోగి పూర్తిగా విముక్తుడైపోతాడు; ఆత్మ స్వాతంత్ర్యాన్ని పొందుతాడు♪.
✳️ శరీరశాస్త్రం ప్రకారం... 🌹
🪷 వెన్నుపాము చాలా విచిత్ర నిర్మాణం కలిగి ఉంటుంది♪. అది మనకు తెలుసు♪. ఎనిమిది అంకెను అడ్డంగా (∞ - దీనిని అనంతానికి Infinity కి గుర్తుగా వేస్తారు) వేస్తే, రెండు భాగాలు మధ్యలో అతికినట్లుంటుంది♪. ఈ అంకెను అడ్డంగానే ఒకదానిమీద మరొకటి పేర్చుతూ వెళ్లండి; అప్పుడది వెన్నుపామును సూచిస్తుంది. దీన్లో ఎడమవైపున ఇడానాడి ఉంటుంది. కుడివైపున పింగళనాడి ఉంటుంది. ఈ రెంటి మధ్యలోనున్న కాలువ భాగం సుషుమ్నానాడి♪.
🪷 వెన్నుపూసలు 'త్రోటిక' అనే కటి ప్రదేశంలో అంతమౌతాయి♪. వాటినుండి ఒక సన్నని తంతువు క్రిందికి వెళుతుంది♪. దాంట్లో కూడా సుషుమ్నా ద్వారముంటుంది. కాని అది చాలా సూక్ష్మంగా ఉంటుంది♪. దాని క్రింది చివర మూసుకుని ఉంటుంది♪. ఈ చివర నుండే తంతుసముదాయం త్రికోణాకృతిగా కనిపిస్తుందని శరీర శాస్త్ర శాస్త్రజ్ఞులంటారు. అటువంటి సుషుమ్నా ద్వారంలో యోగులు కొన్నిచక్రాలను లేదా పద్మాలను దర్శిస్తుంటారు.
🪷 మూలాధారం నుండి మెదడులోని సహస్రారం వరకూ, సుషుమ్నలో కొన్ని పద్మాలున్నాయని యోగులు చెబుతారు♪. నాడీ సముదాయాలే పద్మాలనుకుంటే, నూతన శరీరశాస్త్ర పరిభాష ప్రకారం యోగుల భావం మనకు సులభంగా అర్థమౌతుంది♪. నాడుల్లో రెండు రకాల క్రియలు జరుగుతుంటాయి♪. వాటిలో ఒకటి అంతర్ముఖమై ఉంటే, రెండవది బహిర్ముఖమై ఉంటుంది♪. ఒకటి జ్ఞానకారకమైతే, రెండవది చలనకారకం♪. ఒకటి కేంద్రంవైపు తిరిగి ఉంటే, రెండవది కేంద్రానికి పెడముఖమై ఉంటుంది♪. ఒకటి బయటి వార్తలను మెదడుకు అందిస్తుంది; మెదడు నుండి సూచనలను రెండవది బయటికి తెస్తుంది♪. నాడీ స్పందనలన్నీ కూడా మెదడుతో సంబంధం కలిగి ఉంటాయి♪. కానీ, ఎముక మజ్జలోని ఒకరకమైన అండం మెదడుతో చేరదు; అది మెదడులోని ఒక ద్రవపదార్థంలో తేలుతూ ఉంటుంది♪. వెన్నుపాము మెదడును చేరి, ఆ అండంలోనే అంతమౌతుంది♪. దానినే సహస్రార శివునిగా యోగులు భావిస్తారు♪. దీనిని తెలుసుకోవాలంటే మూలాధారం - మెదడులోని సహస్రారం - నాభిలోని మణిపూరం - వీటిని ప్రధానంగా గమనించాలి♪.
✳️ దేహమే ఒక విద్యుత్ యంత్రం 🌹
🪷 విద్యుచ్ఛక్తిని గురించి మనకు తెలుసు♪. విద్యుత్తుకు రూపంలేదు♪. అది ఒక చలనం మాత్రమే♪. ఏ పదార్థంలోని పరమాణువులనైనా సరే, విద్యుచ్ఛక్తి సాయంతో ఒకేవైపు చలింప చేయవచ్చు♪. ఒక గదిలోని వాయు పరమాణువులన్నింటినీ ఒకేవైపు కదిలింపచేయండి; అప్పుడా గది బ్రహ్మాండమైన విద్యుత్ యంత్రమౌతుంది♪. అదేవిధంగా మనం క్రమగతిలో శ్వాసిస్తే, శరీరంలోని పరమాణువులన్నీ ఒకేవైపుకు కదిలేందుకు సిద్ధమై ఉంటాయి. అలా సిద్దపరిచేందుకు మనసు సంకల్పం చేస్తుంది♪. అప్పుడు మన నాడీవాహినులన్నీ విద్యుచ్ఛక్తిలాంటి చలనంలోకి మారతాయి♪.
🪷 నాడులపై విద్యుత్తును ప్రసరింపు చేస్తే, నాడులు ధ్రువాభిముఖత్వాన్ని చూపుతాయని వైజ్ఞానికులు నిరూపించారు. సంకల్పం నాడీ ప్రవాహంగా రూపొందినప్పుడు, అది విద్యుత్తులాంటి ఒకశక్తిగా మారుతూ ఉంటుంది♪. శరీరంలోని చలనాలన్నీ పూర్తిగా క్రమగతిలో జరుగుతూ ఉంటే, అప్పుడు ఈ శరీరం సంకల్పమనే భారీవిద్యుత్ యంత్రంగా తోస్తుంది♪. ఇలాంటి మహాసంకల్పశక్తినే, యోగి పొందాలను కుంటాడు♪. కాబట్టి, శారీరకశాస్త్ర దృష్టితో చూచినా, శ్వాసనియంత్రణాన్ని అభ్యాసం చేయటం ఎంత అవసరమో తెలుస్తోంది♪. శ్వాస నియంత్రణం శరీరంలో ఒక క్రమగతిని ఏర్పరుస్తుంది♪. కాబట్టి శ్వాసకోశం ద్వారా ఇతర కోశాలను కూడా వశం చేసుకోవటానికి ఈ శ్వాసనియంత్రణం మనకెంతో దోహదం చేస్తుంది♪. మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలినీశక్తిని జాగృతం చేయటమే, ప్రాణాయామం వల్ల మనకు కలిగే పరమ ప్రయోజనం♪.
✳️ దాస్యం నుంచి విముక్తి 🌹
🪷 చూడటం - భావించటం - కలకనటం ఇలాంటి అనుభవాలన్నీ మనకు ఒక సామాన్య ప్రదేశంలోనే సంభవిస్తాయి♪. ఆ సామాన్య ప్రదేశమే మహా ఆకాశం లేదా భౌతిక ప్రపంచం♪. యోగులు తమ సంకల్పాలను స్వప్నరూపంలో చూస్తుంటారు; అతీంద్రియ విషయాలను కూడా దర్శిస్తుంటారు♪. ఇలాంటి అనుభవాలను వారు మరో ప్రదేశంలో పొందుతుంటారు; అదే మానసిక దేశం; దాన్నే చిత్తాకాశమంటారు♪. నిర్విషయ జ్ఞానావస్థలో ఆత్మ స్వయంజ్యోతియై ప్రకాశిస్తూ ఉంటుంది♪. ఆ దేశాన్ని జ్ఞానదేహ మంటారు; అదే చిదాకాశం♪.
🪷 కుండలినీ శక్తి జాగృతమై సుషుమ్నలో ప్రవేశించేటప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతాయి; అవన్నీ చిత్తాకాశానికి సంబంధించినవి♪. కుండలినీ సుషుమ్నను దాటి మెదడులోకి వెళ్లగానే, నిర్విషయజ్ఞానం కలుగుతుంది♪. ఇది చిదాకాశానికి సంబంధించినదై ఉంటుంది♪.
🪷 ప్రకృతిని, విద్యుత్తును పోల్చి చూద్దాం. మనిషి విద్యుత్తును తీగల ద్వారానే పంపగలడు; కాని తన శక్తులను ప్రసారం చేయటానికి ప్రకృతికి ఎలాంటి తీగల అవసరం లేదు♪. కాబట్టి, శక్తి ప్రసారానికి తీగల ఆవశ్యకత లేదు; కాని మనకింకా ఆ సామర్థ్యం రాలేదు కాబట్టి, విద్యుత్తు ప్రసారానికి తీగలను ఉపయోగిస్తున్నాం♪.
🪷 అలాగే, దేహంలో కలిగే ఇంద్రియానుభవాలు, చలనాలు నాడీ తంతులనే తీగల ద్వారా మెదడులోకి వెళతాయి; మరల బయటికి వస్తుంటాయి. ఈ తంతువులన్నీ వెన్నుపాములో ఉంటాయి: వీటిలో జ్ఞానాన్ని కల్గించే తంతువులు ఇడానాడిగా, క్రియలను కలిగించే తంతువులను పింగళనాడిగా చెబుతారు♪.
🪷 మెదడునుంచి లోపలికి, వెలుపలికి వార్తలన్నీ ఈ తంత్రుల ద్వారానే వెలువడతాయి. అయితే ఈ తంత్రుల సహాయం లేకుండా వార్తలను పంపటం, గ్రహించటం మనసుకు సాధ్యమేనా? అంటే సంకల్ప ప్రవాహాన్ని సుషుమ్నా మార్గంలో పంపగలిగితే సాధ్యమేనని యోగులు చెబుతారు. నాడీకోశమనే ఈ తంతు సమూహాన్ని మనసే నిర్మాణం చేసుకున్నది. ఈ తంతిసమూహాన్ని భేదిస్తే, జ్ఞానమంతా మన వశమౌతుంది. శరీర ప్రకృతికి ఇక దాస్యం చేయనవసరం లేదంటారు♪.
✳️ విషయజ్ఞానం - అతీంద్రియ జ్ఞానం 🌹
🪷 సామాన్యుల్లో సుషుమ్న క్రింది చివర మూసుకుని ఉంటుంది. ఆ స్థితిలో అది క్రియారహితమై ఉంటుంది♪. ఈ చివరను తెరచి, నాడీ ప్రవాహాన్ని సుషుమ్న ద్వారా ఊర్ధ్వమార్గం పట్టించాలి. దీనికోసం యోగులు ఒక సాధనా విధానం చెబుతారు. నాడీ కేంద్రానికి ఒక వార్త వెళితే, అక్కడ ఒక ప్రతిక్రియ కలుగుతుంది. ఆ ప్రతిక్రియ ఆ నాడీకేంద్రాన్ని నడిపిస్తున్న జ్ఞానకేంద్రాల్లో చలనానికి కారణమవుతుంది♪.
🪷 కానీ, ముందుగా మనలో విషయజ్ఞానం కలగాలి. ఆ తర్వాతే చలనం ఏర్పడుతుంది. మనకు ప్రత్యక్షానుభవం లేని సందర్భాల్లో మనలోని స్పందనలన్నీ మూలాధారంలో అణిగిపోయి ఉంటాయి. ఆ అణగి ఉన్న క్రియాశక్తినే కుండలిని... అంటే చుట్టుకొని ఉన్నది - అని పిలుస్తారు♪.
🪷 ఏకాగ్రంగా అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మూలాధార ప్రాంతంలో వేడి పుడుతుంది. కుండలినీ శక్తిని మేల్కొల్పి, ప్రాణవంతం చేసి, సుషుమ్నలో పైకి వెళ్లేలా చేస్తే, అప్పుడు ఈ శక్తి ఒక చక్రం తర్వాత మరొక చక్రంపై తన ప్రభావం చూపుతుంది. ఆ స్థితిలో అత్యద్భుత ప్రతిక్రియ కలుగుతుంది♪.
🪷 కుండలినీ శక్తిలోని ఒక సూక్ష్మాంశం నాడీతంతువు నుండి పైకివెళితే, ఆయా కేంద్రస్థానాలు తమంతతామే ప్రతిక్రియ చేస్తాయి♪. అప్పుడే మనకు స్వప్నం లేదా మానసిక కల్పనలు కలుగుతాయి♪. ఇలా చాలాకాలంపాటు ధ్యానం చేస్తే ఎంతో బలం లభిస్తుంది; ఆ బలంతో కుండలినీ శక్తిని మొత్తంగా సుషుమ్న ద్వారా పైకి పంపించవచ్చు; అప్పుడా శక్తి అలా పైకి వెళుతూ, ఆయా కేంద్రాలను తాకుతుంది. అప్పుడు స్వప్నాదుల కన్నా గొప్ప ప్రతి క్రియ ఏర్పడుతుంది. అదే అతీంద్రియ జ్ఞానం.
🪷 మెదడు ఇంద్రియానుభవాలకు కేంద్రస్థానం. కుండలినీశక్తి దీన్ని చేరగానే, మెదడంతా ప్రతిస్పందిస్తుంది. దానితో పూర్ణచైతన్య ప్రకాశరూపమైన ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. కుండలినీశక్తి పైకి వెళుతూ ఒక్కొక్క చక్రాన్నే దాటుతూ ఉంటుంది. అలా దాటుతున్నప్పుడు మనసులోని పొరలు ఒకటొకటిగా తొలగిపోతుంటాయి♪. అప్పుడు యోగులు విశ్వ సూక్ష్మరూపాన్ని లేదా కారణరూపాన్ని దర్శిస్తారు. శబ్దాది విషయాల్లో, ఇంద్రియానుభవాల్లో వ్యక్తమయ్యే జగత్కారణాలను ప్రత్యక్షంగా చూస్తారు. జగత్కారణాలు తెలిస్తే చాలు - కార్యజ్ఞానం తప్పక కలుగుతుంది♪.
🪷 కాబట్టి, అతీంద్రియ జ్ఞానం - దివ్యజ్ఞానం - ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే కుండలినీశక్తిని జాగృతం చేయటం తప్ప మరో 'మార్గం లేదు. తాత్త్విక విశ్లేషణతో నిత్యానిత్యవస్తు వివేకంతో ఈశ్వర ప్రేమతో - సిద్ధపురుషుల అనుగ్రహంతో - - ఇంకా అనేక మార్గాల్లో కుండలినీశక్తిని జాగృతం చేయవచ్చు. తెలిసి చేసినా, తెలియక చేసినా ఉపాసన ఫలం తప్పక ఉంటుంది♪.
Courtesy: 'భక్తి' మాసపత్రిక
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
🙏🌹🥀🪷🌻✳️🌹🥀🪷🌻🙏
No comments:
Post a Comment