Friday, June 28, 2024

 శ్రీమద్రామాయణము.

అహం కరోమితి వృథాభిమానః||
స్వకర్మ సూత్ర గ్రథితో హి లోకః||,""
(ఆథ్యాత్మ రామాయణము( 6-6),

ఎవ్వరికైనా సుఖదుఃఖాలు కలిగితే దానికి మరెవ్వరో భాధ్యులనుకోవటం తప్పుడు భావన. వీడి వలన నాకు కష్టము కలిగింది.నా కుటుంబ సభ్యులను అవమానించాడు.అందుకు నాకు దుఃఖము ఏర్పడినదని బాధపడుట,లేదా నా వల్లనే వీళ్లందరు సుఖముగ యున్నారనుకొని విర్రవీగటము ఒక రకమైన దురహంకారము.కారణము ఎవరైనా సరే తమకు తాముగ చేసుకున్న దుష్కృత సుక్రృతముల వలనే అలా వారికి ప్రాప్తిస్తుంటాయని పై రామాయణము మనకి తెలియచేస్తున్నది.

వాల్మికి రామాయణంలో కూడ అయోధ్యకాండములో  ధశరథమహారాజుఇచ్చిన వరాల వలన,  కైక కోరికల కారణముగ రాముడు వనవాసమునకు వెడుతు  లక్ష్మణునితో  "" తమ్ముడూ మన తల్లుల ప్రేమాభిమానాలలో హెచ్చుతగ్గులు లేవు.కైకేయి మాత నాపైగానీ తన కుమారుడైన భరతునిపైగానీ ఏనాడు భేదభావము చూపి ఎరగదు,

"" కశ్చ దైవేన సౌమిత్రే! యోద్దుముత్సహతే పుమాన్|,
యస్య న గ్రహణం కించిత్ కర్మణో~న్యత్ర దృశ్యతే||,(22-21),

ఓ లక్ష్మణా! కైకేయి మాత సాదుస్వభావి,మనకు కీడు తలపెట్డు విధముగ ఆలోచన చేయదు.ఇవన్నియు మన పూర్వజన్మ దుష్క్రతకర్మల ఫలముల ప్రభావమే.విధి నిర్ణయమును నిగ్రహించగల ఉపాయము ఎవరికిని దొరకదు.కారణము ఎవ్వరైనా సరే వారివారి దుష్కృత ఫలాలు అనుభవించుటయే తప్ప విధిని నిందించి ఉపయోగము లేదు.కారణము

"" అసంకల్పితమేవేహ  యదకస్మాత్  ప్రవర్తతే|,
నివర్త్యారంభమారబ్థం నను దైవస్య కర్మ తత్||,(22-24),

ఓ లక్ష్మణా!  మనము ప్రయత్నపూర్వకముగ ఆరభించిన పనులు ఆగిపోవుటకు,అదే సమయములో మనమనుకొనని విధముగ అకస్మాత్తుగా ప్రత్యేక నూతన సంఘటనలు ఏర్పడుట ఇవన్నయు మన చేతిలో లేని కార్యములుగ తెలుసుకో.ఇవన్ని దైవనిర్ణయ ఫలితములే తప్ప కైక మాతయో, మరెవ్వరో ద్వేషముతో లిఖించినవి కావు.మనకి ఆ విధి నిర్ణయాలు "అవశ్యమను భోక్తవ్యం"" అని హితవు పలుకుతాడు

మనము ఎవరినైన నిందించినా
 మనమెవరినైనా నిందించినా ఆ ఫలాలు మన పూర్వ జన్మ దుష్కృతాలుగ ఎరిగి రాముని వలే ఒకరినొకరు నిందించుకొనకుండగ ప్రవర్తిల్లాలని రామాయణము మనకి  హితవు పలుకుతుంది.

No comments:

Post a Comment