ప్రతీ వ్యక్తి,ప్రతి రోజు, ఉన్న చోట మరియు ఇంటి ఒడిలో బోర్ అనిపించి! ఆటవిడుపుగా ఉంటుందని, ఎక్కడెక్కడికో పరుగులు పెడతాడు మరియు సుదూర ప్రాంతాల విహారం కోసం ఆరాటపడతాడు. తీరా అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకే ఆ ప్రాంతం పై బోరుకొట్టి, ఇంటిపై మమకారం పెరిగి, ఇంటికి ఎప్పుడు తిరిగి చేరాలా అని తాపత్రయపడతాడు... పశుపక్ష్యాదులు, ఎక్కడెక్కడ తిరిగినా, సాయంత్రానికి తమ గూటికి చేరుకుంటాయి. ఇలా ప్రకృతి తో మమేకమై అవి స్వేచ్చగా తమ జీవన సరళిని కొనసాగిస్తున్నాయి. అలా కాకుండా ప్రతి మనిషి తన జీవనభృతి కోసం మరియు ఉన్న స్థితి నుంచి సమున్నత స్థితి సాధించడానికి ఎక్కడెక్కడికో సంచారం చేస్తాడు, ఎవరెర్నో కలుస్తాడు, ఏవేవో చక్కబెడతాడు.ఇవి అవసరమే. ఇవి తీరిన తదుపరి! తన ఇంటి ఒడిలో విశ్రమించాలని కోరుకుంటాడు...అనువుకాని చోట, మనది కాని చోట, మన గురించి తెలియని మనుషుల మధ్య నివాసం అనేది ముళ్ల కంచె పై పవళించి నట్లే. ఈ విధంగా దూరపు కొండల పై మమకారం పెంచుకోవడం మనశ్శాంతికి దూరం కావడమే... ఉన్నంతలో తృప్తిగా, సుఖ జీవనం ఉత్తమోత్తమం. ఉన్న చోట, మనమన్న చోట స్థిరనివాసం సంతోషదాయకం..చేప పిల్లకు నీటిలోను, విహంగాలకు గగనం లోను, మృగాలకు అరణ్యం లోను అలాగే మనిషి తన ఇంటి లోను మాత్రమే ప్రశాంతంగా సుఖ జీవనం ఉంటుంది...... పోలిన రామకృష్ణ భగవాన్... రాజమండ్రి.
No comments:
Post a Comment