Wednesday, June 12, 2024

కర్మానుభవం

 కర్మానుభవం

🌷🌷🌷

వచ్చిన కష్టం కానీ సుఖం కి కానీ తానే కర్త అనుకుంటాము మనం,  ఇది పొరపాటు, దీని వెనకాల గొప్పశక్తి దీనిని నడిపేది, మనం ఒక పనిముట్టు మాత్రమే ! దీన్ని ఆమోదిస్తే గొడవ లేదు. భాధ లేదు, లేకుంటే అన్ని భాధలే.... ఎలా....?!!!

గోపురాన్ని భుజస్కంధాలపై మోస్తునట్లుండే విగ్రహాన్ని చూస్తుంటాము!! బరువంతా తానే భరిస్తున్నట్లు ఫోజు ఉంటుంది, కానీ ఆ బరువు గోపురం వెనకాల భూమిలోని పునాదుల మీద ఉంటుంది, అదే రీతిలో తానే పనులన్నీ చక్కపెట్టేస్తున్నాను అనుకునే మనిషీ కూడా అంతే...

ఈ జగత్తు లో జరిగే ఖర్మలకు కూడా మనం సాక్షిభూతులమే, వెనకాల నడిపించేది భగవత్ శక్తి మాత్రమే, మనం చేసుకున్న పాప పుణ్యములు మాత్రమే అనుభవించడానికి మనం జన్మ ఎత్తినాము, ఇది తథ్యం, మరి అన్ని ముందే డిసైడ్ అయినప్పుడు మనము చేయాల్సింది ఏమిటి అనేది ప్రశ్న...

కొన్ని కర్మలు అనుభవించాలి, అనుభవించక తప్పదు, ఈ భాధ లలో కూడా భగవన్నామ స్మరణ విడవకుండా ఉండి, సంపూర్ణ శరణాగతి పొందితే భగవత్ అనుగ్రహముతో అనుభవించే ఖర్మను కూడా కొంత తగ్గించుకోవచ్చు, లేదా తప్పించుకోవచ్చు...
అదెలాగంటే, మహాభారత యుద్ధం లో అర్జునుడి పై ఎదుటి పక్షం వేసిన బాణాలు ఇంతా అంత శక్తివంతమైనవి కాదు, చాలా అఖండమైన శక్తి వంతమైనవి, కేవలం శ్రీ కృష్ణుని అనుగ్రహం చేత వాటి శక్తి పని చేయలేదు, ఒకసారి శ్రీ కృష్ణుడు యుద్ధానంతరం అర్జునుని రథాన్ని దిగమని కోరతాడు, దిగిన పిమ్మట కృష్ణుడు కూడా రథం దిగుతాడు, అప్పుడు ఆ రథం భయంకరమైన శబ్దాలతో కూలి పోతూ, అతి  భయంకరమైన మంటలతో కాలి పోవడం చూసి అర్జునునుడు భయంతో వణికిపోతాడు, అప్పుడు శ్రీ కృష్ణుడు చెపుతాడు ....
ఇంతవరకు నేను ఈ రథం లో వున్నంతకాలం ఎవరి బాణములు ఏమి చేయలేకపోయాయి. ఇప్పుడు నేను దిగాను వాటి పని అవి చేస్తున్నాయి అని...
మన కర్మలు కూడా అంతే భగవంతుడు మనయందు ఉన్నంత కాలం మనల్ని ఏమి చేయలేవు, ఆయనకు మనం దూరమైన రోజున అన్ని అనుభవించాలి....
అందుకే, నిత్య నామస్మరణ మరియు నిత్య భగవత్ ఆరాధన చేసుకుంటూ, అనునిత్యం భగవత్ కార్యాలలో పాల్గొనడం మంచిది.

ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment