*🍁జ్ఞానం అంటే ఏమిటి.? విజ్ఞానం అంటే ఏమిటి.? ఆత్మజ్ఞానం అంటే ఏమిటి.?🍁*
*ముందుగా జ్ఞానం -*
*జ్ఞానము అంటే శుద్ధ ఎఱుక! జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయముపై సంపూర్ణమైన అవగాహన కలిగివుండటం!శాస్త్రజ్ఞానం కూడా జ్ఞానం క్రిందకే వస్తుంది! శాస్త్రజ్ఞానం అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇత్యాదిపై అవగాహన వుండటం అన్నమాట!*
*జ్ఞానం రెండు రకాలు - ఒకటి భౌతిక జ్ఞానం, రెండోది ఆధ్యాత్మిక జ్ఞానం!*
*భౌతిక జ్ఞానం - "పదార్ధము"తో కూడినది! ఆధ్యాత్మిక జ్ఞానం -* *"పదార్ధము"తో చేరినది పదార్ధం యొక్క లక్షణాలు తెలిపేది భౌతిక జ్ఞానం!పదార్ధము యొక్క చైతన్యాన్ని తెలుసుకోవడం ఆధ్యాత్మిక జ్ఞానం!*
*ఇప్పుడు విజ్ఞానం -*
*జ్ఞానమనగా శాస్త్రజ్ఞానం. విజ్ఞాన మనగా అనుభవపూర్వకమైన జ్ఞానము.*
*ఆధ్యాత్మికవిద్యకు అనుభవజ్ఞానమే ప్రధానము. ఆత్మను తెలుసుకొనుటకు జీవునికి జ్ఞానముతో పాటు విజ్ఞానము అవసరము!*
*అనుభవమునకు రాని విద్యవలన ఉపయోగంలేదని, కేవలం శాస్త్రజ్ఞానంతో పరమాత్మను అనుభూతి పొందలేరని జగద్గురువు గీతలో చెప్పడం జరిగింది!*
*ఇక ఆత్మజ్ఞానం -*
*ఆత్మజ్ఞానము అంటే తనను తాను స్వస్వరూపంగా, సహజ సిద్ధమైన చైతన్యంగా తెలుసుకోవడం! అంటే జీవాత్మకి మరియు పరమాత్మకి ఉపాధిలో తేడావున్నా ఇరువురు ఒక్కటే అన్న అనుభవపూర్వక జ్ఞానం! ఎందుకంటే ఆత్మే భగవంతుడు! ఆత్మ కంటే భిన్నంగా వుంటే అతడు “పరమాత్మ” కాలేడు కదా అన్న ఆత్మానుభవం!*
No comments:
Post a Comment