Friday, June 28, 2024

 *ఈశ్వర తత్వం .....*

భగవాన్ రమణ మహర్షిని ఒక భక్తుడు ఇలా అడిగారు.. స్వామి.. దేవుడికి అలంకారం ఎమిటీ.. దేవుడికి అలంకారాలు చేసి పూజించడం భావ్యమా.. అని...
 
రమణులు నవ్వి... ప్రతి వారు నిత్యం తమ విగ్రహానికి పళ్ళు తోమి, స్నానం చేయించి, జుట్టు దువ్వి అలంకరణ చేయట్లేదా.. ఇదీ అంతే.. అన్నారు.. 

భగవాన్.. మీరు అరుణాచల పర్వతాన్ని ఈశ్వరుడిగా ఎందుకు భావిస్తున్నారు... అది మీతో మాట్లాడదు, ఉలకదు, పలకదు. అది మీకు గురువు ఎలా అయ్యింది.. అని మరో భక్తుడు అడిగాడు.

ఆ ప్రశ్నకి.. ఏది ఉలకదో, ఏది పలకదో, నీతో సంభాషించదో, నీతో ఎప్పుడూ వాదోపవాదాలు చేయదో అదే ఈశ్వర తత్వం.. అని రమణులు జవాబిచ్చారు...

No comments:

Post a Comment