*శ్రీ గాయత్రి!!!*
మహామంత్రస్య చా.. ప్యస్య స్థానే స్థానే పదే పదే గూఢ రహస్యగర్భో నంతోపదేశ సముచ్చయం ॥
గాయత్రీమంత్రము ఒక పెద్ద ఉపదేశ సముచ్చయము. అదొక అగాథసాగరము వంటిది. దానిలో వున్న రత్నాలను వారివారి యోగ్యత, ప్రజ్ఞ, ఆకాంక్షలకు అనుగుణ్యంగా అందరూ పొందవచ్చును. అనేక మహర్షులు దాని ప్రతి ఒక్క అక్షరమునకు వ్యాఖ్యానమును రచించినారు. అయిననూ, గాయత్రీ జప సాధనవల్ల మాత్రమే ఆ మంత్రముయొక్క సంపూర్ణ సారము అనుభవానికి వచ్చేది.
గాయత్రిలో మూడు ముఖ్యమైన విషయములున్నవి. 2. అట్టి
1. పరమేశ్వరుని దివ్యగుణముల మననము, పరమేశ్వరుణ్ణి అంతరంగములో ధారణ చేసికొనేది, విచారణశక్తిని ప్రసాదించి ప్రేరణ చేయమని
3. సద్బుద్ధిని, వారిని ప్రార్ధించుట. ),
1. ఓం (బ్రహ్మ), భూః (ప్రణవ స్వరూపము), భువః (దుఃఖనాశనము), సువః (సుఖస్వరూపము), తత్ (ఆ), సవితుః (తేజస్వి, స్వప్రకాశవంతము), వరేణ్యం (శ్రేష్ఠము), భర్గః (పాపనాశనము
"యద్భావం తద్భవతి" అన్నట్లు, ఏ విషయముపైన చిత్తము ఏకాగ్రత పొందుతుందో ఆ దిక్కులోనే అన్ని మానసికశక్తులూ, ఇంద్రియములూ, ప్రవహిస్తాయి,
ఏకాగ్రత కుదురుతూ కుదురుతూ నానా ప్రకారముల గుప్త - ప్రకటిత, దృశ్య అదృశ్య సహాయములు సాధకునకు దొరకుతాయి. అదే ధ్యానయోగముయొక్క మాహాత్మ్యానికి కారణము. ఆత్మయొక్క సచ్చిదానంద స్వరూపంయొక్క చింతన; దుఃఖశోకరహిత బ్రహ్మీస్థితి యొక్క చింతన, శ్రేష్టత, తేజస్వీస్థితి, నిర్మలత్వము వీని చింతన, ఇవన్నియూ ఆనందానుభూతికి సోపానములే!
2. రెండవ భాగమున, ఈ గుణములను ధరించిన తేజఃపుంజాన్ని (అంటే, పరమాత్మను) ధారణ చేస్తాడు. బ్రహ్మచారి.
దేవస్య (దివ్యుని), ధీమహి (ధారణ చేయుము) ಅಜ್ಜಿ ధారణ తొలగిపోవును. చేయడంవల్ల. అహంభావం
3. మూడవ భాగమున, "మాలో సద్బుద్ధిని ప్రేరణ చేయుము. మాకు సాత్వికబుద్ధిని ప్రదానము చేయుము, మా మస్తకములోవున్న కువిచారపు నీచవాసన దుర్భావనలను నిర్మూలనము చేసి, వివేకాభివృద్ధిని ప్రసాదించుము" అనే ప్రార్ధన చేస్తాడు సాధకుడు.
ధియః (బుద్ధిని), యః (ఈనాడు), నః (మాకు), ప్రచోదయాత్ (ప్రేరణ చేయుము).
ప్రథమ భాగమున వివరించబడిన దివ్యగుణాలను పొందేకొరకు, ద్వితీయభాగమున ప్రస్తావింపబడిన బ్రహ్మధారణ కొఱకు, ఆచరించవలసిన_క్రమశిక్షణ తృతీయ భాగమున చెప్పబడి ఉన్నది. బుద్ధిని నిర్మలముగా, శుద్ధీకరించాలి.
నిష్కల్మషముగా వేదములో జ్ఞానకాండము, కర్మకాండము, ఉపాసనా కాండము మూడూ చేరియున్నవి. గాయత్రీ మంత్రంలోనూ ఈ మూడూ చేరియున్నవి. సద్గుణముల చింతనయే జ్ఞానము, బ్రహ్మధారణయే కర్మము, బుద్ధియొక్క సాత్వికత కొరకు, అభీష్టప్రాప్తికొరకు చేసే ప్రార్ధనయే ఉపాసన. గాయత్రీ మంత్ర జపము సాధకునకు సర్వవిధములైన కల్యాణములను ప్రసాదిస్తుంది.
*~హెచ్.వి. నారాయణరావు.*
*సనాతన సారథి - 06/2024.*
*~('సనాతన సారథి' 1964 జూన్ సంచిక నుండి)*
No comments:
Post a Comment