Tuesday, August 20, 2024

అదే మనము చదవ వలసిన నిజమైన చదువు...

🌹గుడ్ మార్నింగ్ 🌹నేను అని మనం అనుకునే శరీరం పదార్ధము.కదులుతూ అన్ని రకాల అనుభవాలకు అందుతూ ఉంటుంది. అన్ని రకాల అనుభవాలను పొందుతూ ఉంటుంది.
దీనికంటే సూక్ష్మ మైన - నేను - లోపలి మనసు అంటే భావాలు, ఆలోచనలు. ఎంత సూక్ష్మము అంటే - వున్నాయి అని తెలుస్తాయి, ఆ భావాలకు స్పందనలుంటాయి అవి శరీరాన్ని కదుపుతూనే ఉంటాయి, కాని ఎక్కడ వున్నది? ఎలా వున్నది తెలియదు.
దీనికంటే సూక్ష్మమైన - నేను - ప్రాణశక్తి.ఇది అసలు ఉన్నట్టు కూడా తెలియదు. మనిషి చనిపోవటము ఒక్కటే దీనికి సాక్ష్యము. అప్పుడు నేను అనుకునే శరీరము ఇక్కడే వున్నది కనుక ప్రాణము పోయింది అని అర్ధమవుతున్నది. ఉన్న శరీరము, మనసు కదలికలు లేవు కనుక - కదలికలకు మూలము ప్రాణశక్తి అని తెలిసింది.దీనినే ఆత్మశక్తి అని పెద్దలు పిలిచారు.
ప్రాణముతో శరీరము, మనసు కదులుతూ ఉండగానే ఈ ప్రాణశక్తి -ఆత్మశక్తిని తెలుసుకునే అవకాశము వున్నది. ఈ అవకాశాన్ని కల్పిస్తూ - ఆ జ్ఞానాన్ని తెలియచేసేదే నిజమైన ఆధ్యాత్మికము. అదే మనము చదవ వలసిన నిజమైన చదువు. ఆత్మజ్ఞాన చదువు. 🌹god bless you 🌹

No comments:

Post a Comment