Thursday, August 8, 2024

****ఐశ్వర్యము అంటే ఏమిటి

 *🙏🌹 ఐశ్వర్యము అంటే ఏమిటి 🌹🙏* 

*🪷\|/ఐశ్వర్యం అంటే అందరూ ఏమనుకుంటారంటే*

*🪷\|/ధనము, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అని అనుకుంటారు. కాని  నిజమయిన ఐశ్వర్యము అంటే ...*

*🪷\|/ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవిస్తూ ఉంటాడో ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆనందముతో జీవిస్తూ ఉంటాడో ,*

*🪷\|/ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో అతడే ఐశ్వర్య వంతుడు. దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు. అంతే గాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ, సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యమంటే!*

*🪷\|/చనిపోయేంతవరకు ఇంటిలో గాని , వీధిలోగాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యమంటే,*

*🪷\|/చనిపోయేంతవరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను , ఈర్ష్యాపరులను, ఏర్పరచుకుని ఎవరు నాకు హాని తలపెడతారో అని భయముతో జీవించడము కాదు ఐశ్వర్యమంటే ,*

*🪷\|/చనిపోయేంతవరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా భగవంతునికోసం గుడి గోపురం తిరగడం , తీర్ధయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యమంటే ,*

*🪷\|/వీటినన్న్నిటిని జయించినవాడే ఐశ్వర్య వంతుడు.శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే ఎవరైనా సరే*

*🪷\|/పుట్టినవాడు మరణించక తప్పదు , మరణించినవారు మరలా పుట్టక మానరు .*

*🪷\|/ఆత్మ అవినాశి. ఆత్మకు చావులేదు , పుట్టుకాలేదు .కాని వున్నదంతా ఈ శరీరానికే .*

*🪷\|/అది తెలియక నేను-నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరూ.*
*ఈ జీవితంలో ఏవిధంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో , ఏ విధంగా ఆనందంగా జీవించాలో , ఏవిధంగా ఐశ్వర్యవంతునిగా జీవించాలో , ఏవిధంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియజేసేదే యోగ సాధన.*

*🪷\|/ఎవరు శరీరంతో వున్నంతవరకు ఏవిధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు.*
🕉️🚩🕉️

No comments:

Post a Comment