Monday, August 19, 2024

****ఆధ్యాత్మిక విద్య లోపం

 ఆధ్యాత్మిక విద్య లోపం
                  ➖➖➖

`
చదువు, సత్సంగం ఈ రెండూ మనిషిని జ్ఞానవంతున్ని చేస్తాయి. ఒకటి జీవనానికి ఉపాధిని అందిస్తే, ఇంకొకటి జీవితానికి ప్రశాంతతను అందిస్తుంది.

చదువుకి వయసుతో సంబంధం ఉండొచ్చు కానీ సత్సంగానికి వయస్సుకు సంబంధం లేదు.  

చిన్న మొక్కగా ఉన్నపుడే నీరు పోస్తూ ఉంటే పెద్ద అయ్యాక దృఢంగా నిలబడుతుంది. 

ఇప్పటి పిల్లల్లో పెద్దవారి పట్ల సరైన గౌరవ మర్యాదలు, గురువుల పట్ల భయ భక్తులు, దేవుని యందు ప్రేమ విశ్వాసాలు, సమాజం పట్ల బాధ్యత లేకుండా ఉండడానికి కారణం సత్సంగ లోపమే!! ఇంట్లో తల్లీదండ్రుల మాట వినరు, బడిలో గురువుల మాట వినరు. చిన్న చిన్న సమస్యలకే పెద్ద అఘాయిత్యాలు చేసుకునేంత ఒక విధమైన మానసిక వ్యాధితో నేటి పిల్లలు బాధ పడుతున్నారు. కారణం ఆధ్యాత్మిక విద్య లోపమే!

దీన్ని తల్లీ దండ్రులు గమనించాలి. తమ పిల్లల జీవితం బాగుపడాలంటే చదువుతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పరిచయం చేయాలి. చదువులో వలె ఆధ్యాత్మికతలో  కూడా విజయవంతం అయ్యేలా ప్రోత్సాహం అందించాలి.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

No comments:

Post a Comment