Wednesday, December 18, 2024

 🍀🌺🍀🌺🍀 🌺🍀 🌺 
నేటి…

        *ఆచార్య సద్బోధన:*
            ➖➖➖✍️

```
ఏ జీవికైనా...మాత కడుపునుండి జననం,
భూమాత కడుపులో మరణం!

పంచభూతాల్లో 
జీవులకు..భూమి ప్రధానం!
ఏజీవి జన్మకైనా
తల్లిదండ్రులే ప్రధానం!

శివ మంటే  పరమాత్మ.
శవమంటే జీవాత్మ!

జీవాత్మలోని ఆత్మ
పరమాత్మలో కలసిపోవడమే.. మోక్షం!

అది...తెలుసుకొని, జీవించడమే
ఙ్ఙానం!
ఒక్క మానుష జన్మకే...అదిసాధ్యం!

అందుకే....
మానుషజన్మ..అన్నిజన్నలకన్నా
మిన్న!

అందుకే..జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,భూమాతకు
నిద్రలేచినపుడు,నిద్రకుపోవునపుడు
రోజూ..నమస్కారం..చేయడం శ్రేయోదాయకం!!

కోరికలే ఆలోచనలు!
ఆలోచనలే కర్మలు!!
కర్మలే..జన్మలు, పునర్జన్మలు!!!

కోరికలే...
నెగిటివ్, పాజిటివ్ ఆలోచనలకు
మూలం!
దానివలననే..కష్ట సుఖాలు!!

కోరికల నదుపుచేసుకొని,
కూడు,గూడు,గుడ్డ,యిచ్చిన
దానితో,ఏజీవికి హానిచేయకుండా,
త్రికరణ శుద్ధితో, ధ్యానంతో తృప్తిగా
జీవించడమే...జీవన విధానం!!!

భార్యభర్తల సంయోగం..సంతానం!
ఆత్మ పరమాత్మల సంయోగం మోక్షం!

కామ సంతోషం...అస్థిరం!
యోగ సంతోషం... సుస్థిరం!!

ఇదే జీవన రహస్యం!
ఇదే జీవన కైవల్యం!!✍️
```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment