Wednesday, December 18, 2024

ఇంద్రియాలకు కాదు, ఈశ్వరునికి దాసులు కండి....!*

 *🌷 ఓం నమఃశివాయ 🌷*

*" ఇంద్రియాలకు కాదు, ఈశ్వరునికి దాసులు కండి....!*

*ఒకడే మనిషి పదిమంది దగ్గర పని చేస్తే బోలెడు ఇబ్బందులు పడతాడు. అదే ఒకడే మనిషి పదిమందిని పనికి పెట్టుకుంటే ఎంత ఉపయోగం!*

*ఒకడు బజారుకు, ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క పని చెప్పి అన్నీ చేయించుకోవచ్చు.*

 *అలాగే మీరు పది ఇంద్రియాలకు దాసులయితే నరకమే...!!!*

*అదే పది ఇంద్రియాలను మీకు దాసులుగా చేసుకొంటే ఎంత హాయి! ఎంత సంతోషం!*

*కనుక ఇంద్రియాలను మీ ఆధీనంలో , మీ ఆజ్ఞలలో పెట్టుకోవాలి.*

*ఇంద్రియనిగ్రహం అంటే పస్తులు ఉండి, దేహానికి తిండి తీర్థాలు ఇవ్వక కృశింపజేయటం కాదు. శరీరంపై వాతలు పెట్టుకొని, బాధింపజేసి సాధించేదీ కాదు. అది తామసిక లక్షణం.*

 *మనస్సుతో ఇంద్రియాలపై విజయం సాధించాలి.*

*నిరంతరం భగవత్స్మరణతోను, విచారణతోను, సత్సాంగత్యంతోను, జపధ్యానాలతోను, ప్రాపంచిక విషయ వైరాగ్యంతోను క్రమక్రమంగా సాధించాలి."*

No comments:

Post a Comment