Wednesday, December 18, 2024

 🦚 *భగవాన్ శ్రీరమణ మహర్షి ప్రసాదం* 🦚

ప్రశ్న : *బ్రహ్మాన్ని సచ్చిదానందమంటారు కదా. అంటే అర్థమేమిటి?*

భగవాన్ : *సంస్థతమైనది- సత్. దానినే బ్రహ్మమంటారు. సత్ యొక్క కాంతి చిత్. దాని స్వరూపం ఆనందం. ఇవి సత్ కి  భిన్నం కావు. మూడింటినీ కలిపి సచ్చిదానందమంటారు.*

ప్రశ్న: *ఆత్మే సత్,చిత్. అటువంటప్పుడు ఆత్మకీ సత్-అసత్ లకీ, చేతనా చేతనములైన వాటికీ భేదముందని ఎట్లా అంటారు?*

భగవాన్:  *ఆత్మ సత్తే. అన్నీ దానిలో ఉన్నాయి, ఆత్మకి సంబంధించినంత వరకూ ద్వయీభావానికి తావు లేదు. అంటే అది సత్యమా, అసత్యమా అని. అందువల్లే ఆత్మ సత్, అసత్ లకి భిన్నమంటారు. ఆ విధంగానే ఆత్మ చైతన్యం. అందువల్ల ఆత్మ ఎరుగవలసింది గాని, ఎరుక కలిగించవలసింది గాని ఏమీ లేదు. ఆ కారణంగా ఆత్మ చేతనాచేతనములైన వాటికి భిన్నమంటారు.* 

*పరమమైనది సత్-చిత్- ఆనందం. అంటే అది అసత్ కాదు. అచిత్ కాదు, అనానందం కాదు. మనం దృశ్యమానమైన ప్రపంచంలో ఉండటం వల్ల ఆత్మని సత్-చిత్-ఆనందమంటాం.*

సేకరణ : *"నీ సహజ స్థితిలో ఉండు"* నుండి  (పే.11)  

*అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా*🙏🙏

No comments:

Post a Comment