Are you tearing your clothes saying HAPPY NEW YEAR...? #trending#motivation#society#newyear#cultu...
https://youtube.com/shorts/9tb1ub6STOU?si=kQu6YcfAjDS1g5Rm
https://www.youtube.com/watch?v=9tb1ub6STOU
Transcript:
(00:01) హాయ్ అండి డిసెంబర్ 31 వచ్చేస్తుందండి మీరందరూ అలర్ట్ గా ఉన్నారా అదేనండి మీ పేరెంట్స్ అలర్ట్ గా ఉన్నారా ఎందుకు అంటే మన కల్చర్ కాని కల్చర్ పండగలా చేసుకుంటారు కదా హ్యాపీ న్యూ ఇయర్ దీని గురించే మాట్లాడుతున్నాను రోడ్ల మీద గంతులు వేయటం తాకి తందనాలు ఆడటం ఒకరినొకరు కొట్లాడుకోవటం నడి రోడ్డు మీద కేకులు కట్ చేసుకోవడం ఒకరి మొక్కాలకఒకరు పూసుకోవటం ఇవే కదండీ సరదాలు వీటి గురించే చెప్తున్నా అన్నమాట దురదృష్టకరమైన విషయం ఏంటంటే మీరు ఎంతమంది చెప్తున్నా వినరు కదండీ ఎల్లవమ్మా చెప్పేవలే నీ పని నువ్వు చూసుకో అంటారు.
(00:36) ఉండలేక వీడియో చేస్తున్నా అన్నమాట ఎందుకు అంటే 31 తర్వాత ఎన్ని ఘోరాలు వినాలో ఎన్ని చూడాలో అన్నట్టు అంతటితో ఆపుతారా ఆ బైక్ స్పీడ్ చూస్తేనే మనుషుల మీద నుంచి దూసుకుంటూ వెళ్ళిపోతాయి. 100 స్పీడ్ లో సైలెన్సర్ తీసేసి మరీ మోత మోగించుకుంటూ వెళ్తారు. ఇటువంటి సరదాలు అవసరమా మీ పిల్లల్ని మీరు ఎంతవరకు ఆపగలరు. ఇదే కల్చర్ భారతదేశ కల్చర్ గా మీరు వ్యవహార శైలిలో తీసుకొచ్చేశారు.
(01:01) తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఈ సరదాలు మనకు అవసరమా ఇది మన కల్చరా? మన తెలుగు సంప్రదాయంలో ఉన్నదా మీ పిల్లలకి మీరేం చెప్తున్నారు మీరు ఏం నేర్పుతున్నారు ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతారు సరదాలు, ఎంజాయ్మెంట్స్ అవన్నీ మనకెందుకు అర్ధరాత్రి వరకు కొట్లాడుకోవటాలు, బైక్ యాక్సిడెంట్లు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, తలకాయలు పగలకొట్టుకోవటాలు మీ పిల్లలు చేయజారిపోతారు. మీరే చేయజారుస్తున్నారు.
(01:22) ఆ భయం ముందు మీకు ఉండాలి. తర్వాత వాళ్ళని కట్టడి చేయగలుగుతారు. నిజమేనండి 2025 వెళ్లి 2026 లోకి వెళ్తున్నాం అంటే సంవత్సరం మారుతుంది కానీ ఇది మనకి కొత్త సంవత్సరం కాదు మనకి కొత్త సంవత్సరం అన్నది ఉగాది తెలుగు కొత్త సంవత్సరాది అని మనం పిలుస్తాం అన్నమాట కానీ సంవత్సరం మారుతుంది అంటే మనం ఈ మారుతున్న పాత సంవత్సరం 2025 లో ఏం నేర్చుకున్నామో ఏం పోగొట్టుకున్నాము ఏం నేర్చుకోవాలి అన్నది మీరు తెలుసుకోవాలి అలాగే 2025 చేదు జ్ఞాపకం మీకు మిగిల్చకూడదు.
(01:56) అలాగే 2026 లో మీరు కొత్తగా ఏం నేర్చుకోవాలి ఎటువంటి విజయాలు సాధించాలి పనికి రానివి ఏమి పక్కన పెట్టాలి అన్నది ఫోకస్ పెట్టండి. మీ కెరీర్ ఏంటి అలాగే మీ చదువు కొత్తగా ఏ జాబ్ కొట్టాలి ఇంకా ఫ్యామిలీని ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇటువంటి వాటిల మీద ఫోకస్ పెట్టండి. అంతేగాని ఈ పనికి రాని సరదాల మీద వ్యామోహంతో ఆ కాసేపు క్షణిక ఆనందం కోసం మీ లైఫ్ ని పాడు చేసుకోకండి.
(02:24) హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ గుడ్డలు చింపుకొని తిరగకుండా మన సంప్రదాయాన్ని పాటించండి. మీ తల్లిదండ్రులకి మరీ మరీ చెప్తున్నాను మీ పిల్లల్ని కట్టడి చేయండి. ముందు మన తల్లిదండ్రులకు తెలిస్తేనే కదా పిల్లల్ని కట్టడి చేసేది యాక్సిడెంట్లు జరిగి జీవితాలు నాశనం అయిపోతుంటే తరువాత బాధపడి ప్రయోజనం ఉండదండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.
(02:43) అందరి యూత్ కి అలాగే పేరెంట్స్ వరకు చేరాలి. మీ పిల్లల్ని మీరు మన సంప్రదాయం ఏంటో నేర్పండి.
No comments:
Post a Comment