Sunday, December 14, 2025

Dhyanam Anapanasathi

ధ్యాన దినోత్సవ ప్రసంగం
ఆనాపానసతి - శ్వాస మీద ధ్యాస (10 నిమిషాల వేదిక ప్రసంగం)
గౌరవనీయులైన వేదికపై ఉన్న పెద్దలకు, ప్రియమైన యోగా గురువులకు, ధ్యాన సాధకులకు,
నా సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప
ఈ రోజు మనం ఒక గొప్ప దినాన్ని -- ధ్యాన దినోత్సవాన్ని -- జరుపుకుంటున్నాం.
ధ్యానం అంటీ ఏమిటి?
అది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడమేనా? లేదా కొంతమందికే సాధ్యమైన ఆధ్యాత్మిక సాధనా? కాదు.
ధ్యానం అంటే -- మన శ్వాసను మనం గమనించడం.
ఆనాపానసతి అంటే ఏమిటి?
సుమారు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన అత్యంత సరళమైన, సహజమైన
ధ్యాన పద్ధతే ఆనాపానసతి.
ఆన అంటే — ఉచ్చ్వాసం
అపాన అంటే -- నిశ్వాసం
సతి అంటే -- జాగ్రత్తగా గమనించడం అంటే -- డ మన శ్వాసతో మనం కూడుకుని ఉండడం.
ఏ మంత్రం లేదు, ఏ ఊపిరి ఆపడం లేదు, ఏ కష్టమైన నియమాలు లేవు
కేవలం శ్వాస వస్తోంది... శ్వాస వెళ్తోంది... అని గమనించడమే.
 ఎందుకు శ్వాసే మార్గం?
ప్రకృతి ఎప్పుడూ సహజంగా ఉంటుంది.
ఏది సహజమో -- అదే సత్యం.
మన శ్వాసను చూడండి... మనకు తెలియకుండానే అది లోపలికి వస్తోంది బయటికి వెళ్తోంది మన జీవితమంతా
ఈ శ్వాస మీదే ఆధారపడి ఉంది.
కానీ... మన శ్వాసను మనం ఎప్పుడైనా గమనించామా?
గౌతమ బుద్ధుడు అన్నాడు: “& శ్వాసే నీ గురువు.”
బయట ఎవర్నీ వెతకాల్సిన అవసరం లేదు లోపల ఉన్న శ్వాసే మనకు మార్గం చూపిస్తుంది
9 ధ్యానం ఎలా చేయాలి?
ధ్యానం చాలా సులభం...
హాయిగా కూర్చోండి , వెన్నెముక నిటారుగా ఉంచండి కళ్ళు మెల్లిగా మూసుకోండి
Ippudu
గాలి ముక్కులోనికి వస్తోందా? బయటికి వెళ్తోందా? అంతే. శ్వాసను నియంత్రించవద్దు



బలవంతం చేయవద్దు, ఊపిరి ఆపవద్దు

కేవలం ఒక సాక్షిలా గమనించండి, మనస్సు తప్పుతుంది, ఆలోచనలు వస్తాయి ఇది సహజం మనస్సు తప్పిన
ప్రతిసారి కోపపడకండి నిరాశ చెందకండి నెమ్మదిగా మళ్లీ శ్వాస మీదకే తీసుకురండి

ఇదే ధ్యానం.

ఎంతసేపు ధ్యానం చేయాలి?

ప్రతిరోజూ కనీసం ఒక్కసారి అయినా నిశ్శబ్దంగా కూర్చోవాలి

ఉ ఒక సరళమైన నియమం ఉంది

వయస్సు ఎంత ఉంటే అంత నిమిషాలు ధ్యానం.

ఇరవై ఏళ్లు -- ఇరవై నిమిషాలు

ముప్పై ఏళ్లు -- ముప్పై నిమిషాలు

నలబై ఏళ్లు -- నలబై నిమిషాలు

నిరంతరం చేస్తే ఫలితం తప్పక వస్తుంది ధ్యానం కూడా అన్నంలాంటిదే ఉడకడానికి సమయం కావాలి అలాగే
ఆత్మకు కూడా ధ్యాన సమయం కావాలి

శ ధ్యానం లో ఏమవుతుంది?

ధ్యానం చేస్తూ ఉంటే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి

ఎక్కడో నొప్పి, ఎక్కదో కంపనం, ఎక్కడో శక్తి ప్రవాహం భయపడకండి. ఇవి వ్యాధులు కాదు

౮ ఇవి నాడీమండల శుద్ధి లక్షణాలు

మన శరీరంలో లక్షల సంఖ్యలో నాడులు ఉన్నాయి ధ్యానం ద్వారా ఆ నాడులు శుద్ధమవుతాయి కొద్దికాలం ఓపిక
అవసరం దీనినే శాస్త్రం

“తితీక్షూ అంటుంది ,సహనం ఉన్నవాడే, సాధనలో ముందుకు వెళ్తాడు

క్ల ధ్యానం వల్ల ఉపయోగాలు

* మానసిక ఒత్తిడి తగ్గుతుంది

* బీపీ నియంత్రణలోకి వస్తుంది

* షుగర్‌ స్థాయులు మెరుగుపడతాయి

* డిప్రెషన్‌ తగ్గుతుంది

* నిద్ర ప్రశాంతంగా వస్తుంది

* కోపం తగ్గుతుంది

* ఏక్రాగ్రత పెరుగుతుంది

* జ్ఞాపకశక్తి బలపడుతుంది

శః ఆత్మవిశ్వాసం పెరుగుతుంది





* భయాలు పోతాయి
* వ్యసనాలు విడిపోతాయి
* నిర్ణయశక్తి పెరుగుతుంది
* సరీరంలో శక్తి పెరుగుతుంది
* మనస్సు స్థిరపడుతుంది
* కరుణ, మైత్రి పెరుగుతాయి
* అహింస భావన పెరుగుతుంది
* జ్రీవితం సార్థకమవుతుంది
* మరణ భయం తగ్గుతుంది
* ఆత్మజ్ఞానానికి మార్గం తెరుచుకుంటుంది
* మనిషి నుంచి మహానుభావుడిగా మారే దారి కనిపిస్తుంది
శీ బుద్ధుడి చివరి సందేశం
గౌతమ బుద్ధుడు తన చివరి క్షణాల్లో ఒక మాట మాత్రమే చెప్పారు:
“అప్పో దీపో భవి
అంటే ౮ నీ దీపం నీవే వెలిగించుకో ఆ దీపం ఏమిటి?
నీ శ్వాస
నీ అవగాహన
నీ ధ్యానం
ఉి ముగింపు
ఈ ధ్యాన దినోత్సవ సందర్భంగా మనమందరం ఒక చిన్న సంకల్పం చేద్దాం
రోజుకు కొద్దిసేపైనా
మన శ్వాసతో మనం కూడుకుని ఉండాలని ఎందుకంటే...
శ్వాసను గమనిస్తే -- మనస్సు మారుతుంది
మనస్సు మారితే -- జీవితం మారుతుంది
ఇదే ఆనాపానసతి
ఇదే సహజ ధ్యానం
ఇదే శాంతి మార్గం
షమీ అందరికీ నా ధన్యవాదాలుమ్ల







No comments:

Post a Comment