*మానవ జన్మ తీసుకుని ఎవరైతే ధ్యానసాధన, అహింసపాలనలో ఉంటారో వారు మాత, పితృ ఋణం తీర్చుకున్నవారు అవుతారు.💥*
*దైవం మానుష రూపేణా*

*’మానుష రూపేణ’ అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన దగ్గర ఉంటుంది అని అర్థం..! మరి ఆ యొక్క దైవస్వరూపం ఎవరు అంటే .. మొదటగా మనను నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి,(రెండవది మనం ఈ భౌతిక శరీరధారణకు కారణమైన 'తండ్రి'), మూడవది మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు, అజ్ఞానం తొలగించిన గురువు. చివరిగా నాలుగవది.. మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి..!*
అందుకే మన సనాతనధర్మం నినదిస్తుంది .. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ !’ అని.
మాతృదేవోభవ:
ఇలలో తల్లిని మించిన దైవం లేదు అన్న ప్రాథమిక సత్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలి.. డిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే కదా..! అసలు భూలోకంలో అద్భుతం ఏదైనా ఉంది అంటే అది 'నువ్వే'.
మరి అటువంటి అద్భుతాన్ని సృష్టించిన తల్లికి మించిన వేరే దైవం ఏమి ఉంటుంది. తన రక్త మాంసంతో మనిషిని సృష్టించి, ప్రత్యక్షంగా కంటికిరెప్పలా కాపాడుతూ పెంచి, పోషించి, ప్రయోజకుడిగా సరిదిద్దడంతో తల్లి పాత్ర ప్రతి మనిషి జీవితంలోనూ సుస్పష్టం..! మరి అటువంటి తల్లి ఒకరోజు వృద్ధురాలు అయినప్పుడు ఆ యొక్క తల్లితో మనం ఎలా వ్యవహరిస్తున్నాం? మనకు మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం? తనకు స్వాంతన కలిగించడమే మనం తల్లి ఋణం తీర్చుకోవడం. తల్లితో అమర్యాదగా వ్యవహరించకపోవడమే ఋణం తీర్చుకోవడం ! తల్లిని గౌరవించడమే.. తల్లికి అగ్రతాంబూలం.
పితృదేవోభవ:
తల్లి .. తండ్రి.. రెండుకళ్ళు ప్రతి మనిషికి. నిరాకార భగవంతునికి సాకార ప్రత్యక్షమే తండ్రి.. మన ఎదుగుదలకు అనుక్షణం ఆరాటపడుతూ.. జీవితంలో ప్రత్యక్షంగా నిత్యం పోరాడుతూ.. మన ఉన్నతికి బాటలు వేసిన అలుపెరుగని యోధుడు ‘తండ్రి..!’ సమసమా
ధర్మసందేహాలు:
*గోత్రము తెలియనివారి గోత్రము?*
*గోత్రం తెలియనివారు భగవంతుని గోత్రంగాని, కశ్యప ప్రజాపతి
గోత్రమైన “కాశ్యపస” గోత్రాన్నిగాని, గురువు తండ్రితో* సమానముగాబట్టి గురువుగారి గోత్రాన్ని గాని తన గోత్రంగా చెప్పవచ్చు.*
No comments:
Post a Comment