Sunday, March 29, 2026

  [3/25, 08:04] +91 94945 49969: రెండు పద్ధతులు ఉంటాయి 
సెకెండ్ హేండ్ పుస్తకాలు కొనే విషయంలో 

విక్రేత దగ్గర 
కాస్త బేరసారమాడి
తక్కువ ధరకే ఏకమొత్తంగా కొనేయడం 
మొదటి పద్దతి

పుస్తకాలన్నీ వెదికి వెదికి
చక్కని పుస్తకాలను ఓపికగా ఎంపిక చేసి 
కాస్త ఎక్కువ ధరకే సొంతం చేసుకోవడం 
రెండవ పద్దతి

**********

పుస్తకాలతో....
కేవలం వ్యాపారం చేయాలి అనుకున్నవాడు 
మొదటి పద్దతి ని అవలంబిస్తాడు 

ఇందులో....
నష్టభయం లేక పోలేదు
అయితే... సాధారణంగా లాభమే ఎక్కువ 

ఎందుకంటే 
చదువరులు భిన్న రకాలు కాబట్టి 
మార్కెట్ చేసుకునే టెక్నిక్ వంటబట్టించుకుంటే చాలు ...

అంటే... అంటే ...
అది సాదా సీదా పుస్తకమైనా 
ఇది అద్భుతమైన అమోఘమైన పుస్తకమనీ 
ఇది రీప్రింట్ లో లేని అయ్యే అవకాశమే లేని...
రేరెస్ట్ ఆఫ్ ది రేర్ బుక్ అనీ 
చదువరిని నమ్మించగలిగితే చాలు 

నష్టభయం ఉండదు
లాభాలకేమీ ఢోకా ఉండదు 

**********

మంచి సాహిత్యాన్ని
అందరికీ పెంచాలి అని అభిలషించేవాడు మాత్రం
రెండవ మార్గాన్నే ఎంచుకుంటాడు

ఇందులోనూ 
నష్టభయం లేకపోలేదు 
కానీ... చాలా లాభమే అతనికి 

ఎందుకంటే...
ఒకవేళ ఎవరూ ఆ పుస్తకాలను కోరకపోతే 
స్వయంగా అతనే స్వంతం చేసుకొని 
హృదయానికి పొదవుకుంటాడు కనుక

ఇది చాలా మంచి పుస్తకం 
ఇప్పుడెక్కడా అందుబాటులో లేని పుస్తకం
ఇది మీ జీవితాలను మలచే పుస్తకం 
మీ దగ్గరిది లేకపోతే బతుకే వృథా ...

అని చదువరులను 
ఊరించాల్సిన అగత్యం
ఆతనికి లేనే లేదు కనుక

మంచి సాహిత్యాన్ని
మంచి చదువరి కి చేర్చాలనే 
అభిలాషే అతనిది కనుకా కనుకా
నష్టభయం... ఈషన్మాత్రమైనా ఉండదతనికి 

**********

ఎటొచ్చీ 
నష్టమంతా చదువరులకే 

మంచి సాహిత్యాన్ని 
పదే పదే ప్రదర్శించినా
రోజూ ఇవేనా అని చులకనగా చూసి 

అమ్ముడు పోకే 
వాటినలా రోజూ రోజూ 
ప్రదర్శనకు పెడుతున్నారని శంకించినా

ఇంకా అవీ
అందుబాటులో లేనేలేనప్పుడు
వాటి కోసం ఎంత యత్నించినా 
అది గతజలసేతుబంధనం

*********

ఔను ఔను
నష్టపోయేది చదువరులే వరులే

టక్క టమార 
గజకర్ణ గోకర్ణ విద్యలకు 
పారవశ్యం పరవశం చెంది చెంది 

చెత్త పుస్తకాలతో 
ఇల్లంతా నింపేసుకుంటే
జేబులన్నీ గుల్ల చేసేసుకుంటే 

అటు తరువాత 
ఎంతెంత విచారించినా 
శూన్యం... శూన్యం.... ప్రయోజనం

-  రత్నాజేయ్ (పెద్దాపురం)
[3/25, 08:04] +91 94945 49969: ఇది చదివిన తరువాత

*******

మూడవ 
విధానం కూడా ఉంది

కేవలం
చదువరులే కాదు

రచయితలమైన 
మేమూ మోసపోతుంటాం

అని వాపోయారు
ఓ సన్నిహిత మిత్రుడు 
నాయీ పై పోస్టు చూసిన తరువాత 

*********

ఇంతకూ విషయం ఏమిటీ
అని ఆరా తీస్తే...

గ్రంథాలయం స్థాపిస్తున్నాము 
మీ పుస్తకాలు మాకు పంపండి
అని అభ్యర్థించారట ఒకరు 

సరే.. అని 
సదురు రచయిత
తన రచనలను ఉచితంగానే 
పోస్టల్ చార్జీ భరించి మరీ పంపాడట 

తీరా చూస్తే...
ఆయా పుస్తకాలను 
వాట్సేప్ వేదికల్లో అమ్మకానికి పెట్టాడట 
ఆ ప్రబుద్ధుడు

ఏమీ అనలేక 
మౌనం దాల్చాడట ఈ రచయిత 

********

అంతటితో...
అయితే ఫర్వాలేదు 
తనకు జరిగినట్లే ఎందరెందరో రచయితలకూ 
ఇదే అనుభవం ఎదురయ్యిందట 

వారందరి దగ్గరా 
గ్రంథాలయం స్థాపిస్తున్నాము
మీ పుస్తకాలు పంపండి అనీ ...
ఇదే పాట పాడి 

అలా సేకరించిన పుస్తకాలన్నీ 
అమ్ముకుంటున్నాడట ఆ ప్రబుద్ధుడు

**********

తన పుస్తకం
నలుగురూ చదువుతారు 
అని ఆశించి మోసపోయిన రచయిత 
మానసిక వేదనకు ఎంతని విలువ కట్టగలం 

గ్రంథాలయం స్థాపిస్తాను
అనీ రచయితలను సాహిత్యాభిలాషులనూ 
నమ్మించి వంచించి వారి దగ్గర పుస్తకాలు ఉచితంగానే తీసుకుని
అమ్ముకునే సదరు వ్యక్తి మనస్తత్వాన్ని 
ఏమని అంచనా వెయగలం

ఎవరిని 
తప్పు బెట్టాలి
మరెవరిపై సానుభూతి చూపాలి

*********

రచయితలారా 
సాహిత్యాభిమానులారా 
బహు పరాక్ ఇటువంటి వారితో 

పుస్తకం
ఉచితంగా ఇవ్వడం
అనుచితమేనంటాను నేనైతే

అయినా సరే...
ఒకవేళ ఇవ్వదలచుకుంటే 
తగిన విచారణ చేసి నమ్మకం కుదిరిన తరువాతే 
బహూకరించండి మీ పుస్తకాలను

********

పుస్తక విక్రేతలారా 
కాసింతైనా నైతికతను పాటించండి 

కపటం వంచన మోసంతో
ఉచితంగా పుస్తకాలను ఊరకనే సంపాదించి 
ఏదో లాభాన్ని మూటగట్టుకుందాం అనే ఆలోచనను విరమించండి 

ఉన్న విషయం
సూటిగా స్పష్టంగా చెప్పండి
తక్కువ నెలకు కొని కూసింత లాభం చేర్చి 
అమ్ముకునే జీవనోపాది నాదని 

**********

ఇది కేవలం 

తన పుస్తకాలను
ఉచితంగా ఇచ్చిన రచయితకూ 

ఆ నమ్మకాన్ని వమ్ముచేసి 
ఆయా పుస్తకాలను అమ్ముకున్న వ్యక్తికీ 

సంబంధించిన వ్యవహారం మాత్రమే

********

మంచి పుస్తకాన్ని 
కొని చదువుదామనకున్న చదువరి కి
ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదు

తను కొన్న పుస్తకం
దాన్ని అమ్మిన వాడు
ఎలా సంపాదిస్తే తనకెందుకు 

తను మాత్రం
తగిన వెల చెల్లించే 
సొంతం చేసుకుంటున్నాడు కదా

పాపం పుణ్యం
(పాప పుణ్యాలు ఉంటే గింటే)
చదవరికి అంటనే అంటవు

No comments:

Post a Comment