Sunday, March 29, 2026

 (583) (26.03.2026)

నాన్నా నన్ను అమెరికా వెళ్ళమని అంటున్నారు
మీరేమో అనారోగ్యంతో మంచపట్టి ఉన్నారు
నేనా ఒక్కగానొక్క కొడుకుని
ఈ సమయంలో మీ దగ్గర ఉండాల్సిన వాడిని //

మీకేమో నన్ను ఉన్నత స్ధానంలో చూడాలని
నాకేమో మిమ్మల్ని చూచుకోవాలని
వైద్యులు కూడా చేతులు ఎత్తేసినారు
మీరేమో ఏమి కాదు అని అంటున్నారు //

మిమ్మల్ని వదిలి నేను వెళ్లలేను
వెళ్ళినా చదువు మీద శ్రద్ధ పెట్టలేను
ఆఖరి దశలో మీ చెంతనే ఉండాలని
మీ బాగోగులు చూచుకోవాలని //

నేనా ఈ ఇంటికి వారసుడిని
ఆపై తోబుట్టువులు అంటూ లేని వాడిని
రేపటి రోజు అవసరం వస్తే మిమ్మల్ని ఎవరు చూస్తారు
వైద్యుని దగ్గరకు ఎవరు తీసుకుని వెళతారు //

నే చదివిన చదువుకి ఇక్కడే ఓ మంచి ఉద్యోగం వస్తుంది
దగ్గరుండి మిమ్మల్ని చూచుకున్నట్టు ఉంటుంది
మీ తరువాతనే నాకూ ఏదైనా
ఈ సమయంలో  మీకు నా అవసరం ఎంతైనా //

నేను వెళితే అమ్మ ఒంటరి అవుతుంది
ప్రతి పనికి తనకి వెళ్ళడం కష్టం అవుతుంది
ఈ సమయంలో  కొడుకుగా బాధ్యత తీసుకోవాలి
 మీ కడుపున పుట్టినందుకు రుణం తీర్చుకోవాలి //

ఇంకొకసారి అమెరికా వెళ్ళమని అనకండి
ఈ సమయంలో మీకు నను దూరం చేయకండి
మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను
మీకు మటుకు దూరంగా ఉండలేను //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment