Monday, March 30, 2026

 *ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం!!* 


 *సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన* 
 *బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన* 
 *అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు.* 

ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి 
చాలా ప్రత్యేకమైనది. 
హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. 
శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని 
ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా 
స్మరిస్తూ ఉంటారు.

ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల.. 
శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. 
ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, 
మానసిక సంతోషం కలుగుతుంది. 
అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా 
ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. 
మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

 *వాస్తవాలు* .🌹
ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి. 
ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.

🙏 *స్మరణ* .
యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.

 *ప్రయోజనాలు* 🌹.
ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, 
నిర్మలంగా ఉంటుంది. 
జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది.

*అనుకూల పరిస్థితులు* 🌹
ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అనుకూల పరిస్థితులు
 ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుంది.

 *తీవ్రమైన మానసిక ఒత్తిడి* .🌻
ఈ మంత్రాన్ని క్రమంతప్పకుండా స్మరించడం వల్ల 
మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. 
అలాగే డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. 
ఒత్తిడి తగ్గించి, ప్రశాంతత కలిగిస్తుంది.

🙏 *108 సార్లు.* 
ప్రతి రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. 
జీవితంలో ప్రశాంతత పొందుతారు.

🍀 *ఎప్పుడు స్మరించాలి?* 
ఓం నమః శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. 
వేకుజామున స్నానం చేసి, కాళ్లు ముడుచుకుని, నిటారుగా కూర్చోవాలి. 
కళ్లు మూసుకుని జప మాల తీసుకుని ఓం నమః శివాయ మంత్ర జపం మొదలుపెట్టాలి. 
ఒకవేళ జపమాల లేకపోతే.. వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు.

🙏 *ధ్యానం* .
108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత 
అలాగే.. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. 
దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది.

🙏సర్వే జానాః సుఖినో భవంతు 🙏

 *అన్యధా శరణం నాస్తి,త్వమేవ* *శరణం మమ, తస్మాత్కారుణ్య భావేనా,* *రక్షరక్ష మహేశ్వరా.* 

 *_శివోహం,శివోహం,శివోహం_*🙏🌹.        

No comments:

Post a Comment