Sunday, March 29, 2026

 *రం అను తేజో బీజమే రామస్వరూపము*.
🎊🎊🎊🎊🌈💫🌈💫💫💫🎊🎊🎊🎊🎊🎊

రామ మే దేహమనే పాంచభౌతిక తత్వముతో మమేకమైన సీతా స్వరూపము. తేజస్సు పృధ్విగా పరిణమించిన ఘన దివ్య దీప్తి సీతా మాత..!!
ఈ మధ్య లో ఎంతో పరిణామ క్రమం.. ఎంతో పార దర్శక పర్వం.
మహా దివ్య తేజము బిందువుగా సింధువుగా ఎనుబది నాలుగు లక్షల జీవ రాశీ భూత పరా ప్రకృతిగా పరిణమించటంలో స్థల కాల ఆవరణాల...అనువర్తనాల మహా చైతన్యసాగర అనంత వైవిధ్య తరంగ ధారా వాహక సీత...తో మహా కళ్యాణం ...
కళ ల విస్తరణా ...పరిణామ శీలతల ...వాహకత్వ కేళీ విలాస ప్రయాణం.....శ్రీ మద్రామాయణం.. సీతా రామ కళ్యాణం...మనకు..ఆ మహాధార శ్రీ రామ పాదాన్ని తిరిగి చేరే మహా చైతన్య చక్ర పార్శ్వాన్ని దర్శనీయం చేసే కమనీయ ఆరోహణా క్రమమే శ్రీ సీతారామ కళ్యాణం.
అదే నవ నవోన్మేషమైన శక్తి ప్రవర్ధనం.
మిత్రులందరికీ శ్రీ రామ నవమీ శుభాకాంక్షలు.

No comments:

Post a Comment