Sunday, March 29, 2026

 *తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -10* 
🛕
*పశ్చిమ గోదావరి జిల్లా* 

*శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ క్షేత్రం : పెనుగొండ*

పులస్త్యుడు మహాయజ్ఞాన్ని నిర్వహించిన గుండమే పులస్త్యగుండము. అదే పెనుగొండ. యజ్ఞకుండం పులస్త్యతీర్థంగా వర్థిల్లింది. ఒకయజ్ఞ ఫలితంగా త్రిమూర్తులు మూడు పద్మాలుగా  పెనుకాండంలో వెలిసారు. దీని కారణంగా అది 'పెనుగొండ'గా పేరు పొందింది. దీనికి బృహదాద్రి, స్థూలాద్రి అనే నామాంతరాలు ఉన్నాయి. మార్కండేయపురాణంలో ఇది 'ఫేనుకొండ'గా పేర్కొనబడింది. వాసవీ మాతకోసం విశ్వకర్మచేత నిర్మించబడిందని ప్రతీతి. తూర్పు గోదావరి దక్షిణమున సముద్రము, పడమట గోస్తనీ నది, ఉత్తరమున వసిష్ఠ గోదావరీశాఖ సరిహద్దులుగా గల పుణ్యక్షేత్రం పెనుగొండ.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
పెనుగొండను కుసుమశ్రేష్ఠి పాలించేవాడు. రాజమహేంద్రవరం రాజధానిగా చేసికొని పరిపాలించే విష్ణువర్ధన చక్రవర్తికి కుసుమ శ్రేష్ఠి సామంతరాజు. అతని భార్య కుసుమాంబ. వీరికి పుత్రకామేష్ఠియాగ ఫలంగా విరూపాక్షుడు అనే పుత్రుడు, వాసవీ అనే పుత్రికా కలిగారు. విష్ణు వర్ధనుడు దిగ్విజయానంతరము ప్రయాణిస్తూ పెనుగొండ దగ్గరగా ఉద్యానవనంలో విడిది చేశాడు. జనార్దనుని పూజకై పూలు సేకరించ డానికి వచ్చిన 'వాసవి'ని చూసి మోహించాడు. వివాహ విషయం కుసుమశ్రేష్ఠితో ప్రస్తావించాడు. 714 గోత్రాలుగల 8 పట్టణాల వైద్యులను సమావేశపరచి విషయాన్ని విన్నవించాడు. రాజు వద్దకు రాయబారం పంపారు. అది విఫలమైంది. రాజు దండయాత్రకు బయలుదేరాడు. 612 గోత్రాల వైద్యులు భీతిల్లి పారిపోయారు. 'వాసవి' ధైర్యంగా రాజుకు నేను వశం కాను. ధర్మంకోసం అగ్నిగుండంలో ప్రవేశించి మోక్షం పొందుతాను అని ప్రకటించింది. ఆమెతోపాటుగా 102 గోత్రాలకు చెందిన దంపతులు అపూర్వత్యాగం చేశారు. కుల గౌరవాన్ని కాపాడిన వీర వనిత ఈమె. ప్రాణంకన్న శీలరక్షణ, ధర్మరక్షణ మిన్న అని నిరూపించింది. మహాకవి గురజాడ వీరనారీ రత్నంగా కన్యకను చిత్రించాడు.
📖

పెనుగొండ పశ్చిమ గోదావరిజిల్లా మార్టేరు సమీపంలో వాణిజ్యకేంద్రం వాసవీ కన్యకా పరమేశ్వరీ జన్మస్థలం. ఇచ్చట నగరేశ్వరీ దేవాలయాలు ఉన్నాయి. దర్శనార్థం ఆర్యవైశ్యులు అధికసంఖ్యలో వస్తూ ఉంటారు. మంగళవారం, శుక్రవారం నవరాత్రి దినాలలో విశేషంగా అర్చనలు జరుగుతూ ఉంటాయి.

వైశాఖ శుక్ల శ్రవణా నక్షత్రయుక్త శుభదినంనాడు, వైశాఖ శుద్ధ దశమీ శుక్రవారం నాడు శ్రీ కన్యక జయంతి ఘనంగా జరుగుతుంది.

'పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంపాదించుకొన్న క్షేత్రం.
📖


*క్షీరారామలింగేశ్వరస్వామి : పాలకొల్లు*

వారణాసిలో ఒక సంవత్సరమున్న ఫలము ఒకరోజు క్షీరారామ క్షేత్రంలో నున్నచో లభించును. పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో సరసా పురమునకు 8 కి.మీ. దూరములో నున్నది.

దీనికి దుగ్గోపవనపురము, ఉపమన్యుపురము, పాలకోట, పాలకొలను అను పేర్ల కూడా వాడబడినవి. రావి, మట్టి, మొదలగు పాలచెట్లు చాల ఎక్కువగా నున్నప్రదేశమగుటచే ఇది 'పాలకోట'. బాల భక్తుడైన ఉపమన్యుడు, తన త్రిశూలముతో తవ్విన పుష్కరిణిలో పాలు లభించినవి. దానివలన ఇది పాలకొలను, ఉపమన్యుపురము అయినది.

120 అడుగుల శిఖరంతో క్షీరారామం శోభిల్లుతోంది. క్షీర సాగర మధనంలో పుట్టిన అమృత లింగాన్ని తారకాసురుడు ఆరాధించి అనేక శక్తుల్ని సంపాదించాడు. దేవతల్ని, ప్రజలను బాధించాడు. కార్తికేయుడు (కుమార స్వామి) తారకాసురుని చంపుటకూ, అతని శక్తిని తగ్గించుటకు ఆ లింగాన్ని ఐదు ముక్కలు చేశాడు. అవే పంచారామాలుగా విలసిల్లినవి.

వాటిలో ఒకటి ఈ క్షీరారామలింగేశ్వర స్వామి. ఇది నారద ప్రతిష్ఠ. అష్ట దికాల్పకులు ఈ స్వామిని రక్షిస్తూ ఉంటారు. వీరుకాక బ్రహ్మ, విశ్వేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, లక్ష్మీ ఆలయములు గలవు.

1773 లో ప్రతిష్ఠింపబడిన అష్టభూలక్ష్మీ నారాయణస్వామి ఆలయములు కూడ ఇక్కడ కలవు.

క్రీ.శ. 1157 లో గుండాంబిక వెలంటి చోళుని భార్య అఖండ దీపము బహూకరించినట్లు శాసనము కలదు. నరనారాయణ చక్రవర్తి శనివార మంటపమును కట్టించినట్లు క్రీ.శ.1306 శాసనము గలదు. కోన గణపతి దేవ మహారాజు తూర్పున కంచుద్వారము ఏర్పాటు చేసినట్లు, మండపం కట్టించినట్లు క్రీ.శ. 1198 శాసనము గలదు. శిఖరమును, విఘ్నేశ్వరా లయమును బచ్చు అమ్మయ్య అను ఒక వైద్యుడు క్రీ. శ. 1777 లో కట్టించినట్లు తెలియుచున్నది. చెల్లా పిన్నమనేని నరసింహనేని అనునతడు కళ్యాణమంటపము కట్టించినట్లున్నది.

మాఘ బహుళ చతుర్దశినాడు, మహాశివరాత్రి ఉత్సవం ఎంతో ఘనంగా జరుగును.
📖

*గోష్పాదక్షేత్రం - కొవ్వూరు*

పశ్చిమగోదావరీ తీరము కొవ్వూరు గోష్పాద క్షేత్రము విజయవాడ -విశాఖ రైల్వేలైనులో స్టేషను కలదు.

గౌతమ మహర్షి ఈ తీరమున వరదగోపాలస్వామి ఆలయమును నిర్మించినాడు. "గోవూరు" గౌతముడు పెట్టిన పేరు. అది 'కొవ్వూరు'గా మారినది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
పన్నెండు సంవత్సరాల కరువుకాలంలో గౌతముడు తన తపశ్శక్తిచే సృష్టించబడిన ధాన్యరాసులతో ప్రజలను పోషిస్తున్నాడు. ఒకనాడు ఈశ్వరుడు గోవుగా, విఘ్నేశ్వరుడు దూడగా ఆ పంటను పాడు చేయుచుండెను. అది చూసి గౌతముడు దర్భతో ఆ గోవును అదలించ గా ఆవు మరణించినది. గోహత్య పాపపరిహారార్ధ ము విగ్రహ ప్రతిష్ట కొరకు ఆలోచించుచుండగా, గోపాలస్వామి కనిపించి అతని పాపము పరిహారము చేయుటకు రుక్మిణీ, సత్యభామా సహితుడనై భూమికి వత్తునని పల్కెను. ఏడు మృదువైన ఆకులలో ఆ విగ్రహాలను పెట్టించి తీసుకు వెళ్ళుచుండగా ఆ ఆకులు ఎక్కడ వాడిపోవునో అక్కడ ప్రతిష్ఠించుమని చెప్పెను.

మరునాడు గౌతముడు సూర్యునకు అర్ధ్యము నిచ్చుచుండగా గోపాలస్వామి విగ్రహము అతని చేతులలో ప్రత్యక్షమయ్యెను. ప్రస్తుతమున్న చోట ప్రతిష్ఠ జరిగినది. గౌతముడు అహల్యా సహితుడై ఈ ప్రతిష్ఠ కావించెను. రుక్మిణీ, సత్యభామలతో ఈ విగ్రహము కన్నులకు పండుగ చేయును. ప్రాకారము లోపల గరుడాలయం, ధ్వజస్తంభము కుడివైపు దశాంజనేయుని విగ్రహము, దక్షిణము న కళ్యాణ మంటపము కలవు. కర్రతో చెక్కబడి ఆరు అపూర్వ ఫల వృక్షములు కలవు.

నిజాంకాలంలో ఒక రెడ్డిగారు ఈ ఆలయమునకు 40 ఎకరముల భూమిని ఇచ్చినట్టుగా తెలియుచున్నది. 100 సం|| క్రితము గోవర్ధనం రంగాచార్యులు గరుడ వాహనాన్ని, శేషవాహనాన్ని స్వామికి బహూకరించారు. 1907 లో రామాలయం కట్టబడినది. గోపాలస్వామి ఉత్తరమున లక్ష్మీదేవిని గొణముక్కు లచ్చమ్మగారు ప్రతిష్ఠించిరి.

వరదగోపాలస్వామి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశినాడు జరుగును. ముక్కోటి ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ప్రత్యేక ఉత్సవము జరుగును.
🛕
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment