Sunday, March 29, 2026

 విశ్వనాథ సత్యనారాయణగారు కాస్త చీకటి పడింది తన ఇంటికి కారులో వెళుతున్నారు. ఒకచోట మొల్ల రామాయణం ఎవరో చెబుతున్నారు. పావుగంట ఆగి రామాయణం విన్నారు చాలా బాగా చెబుతున్నారు. కారు దిగి వెళ్లి రామాయణం చెప్పే వ్యక్తిని కలిసి తాను ఎవరు పరిచయం చేసుకున్నారు
ఆయన చేతిలో వెయ్యి రూపాయలు పెట్టారు
ఆ వ్యక్తి పుచ్చుకోలేదు స్వామి నేను యజ్ఞం లాంటిది ఒకటి చేస్తున్నాను 108 గ్రామాల్లో మొల్ల రామాయణం చెప్పాలి పూర్తి అయ్యేవరకు ఆ గ్రామములోనే ఉంటూ వాళ్లు పెట్టే శాకాహారము భోజనం తింటూ పూర్తి అయ్యేవరకు అక్కడే పండుకోవాలి ఎలాంటి కానుకలు పుచ్చుకోకూడదు.
అతనికి నమస్కారం చేసి సత్యనారాయణ గారు తిరిగి వస్తూ తన మనసులో ఎంత చక్కటి వ్యక్తి.

నేను నా రామాయణం కల్పవృక్షాన్ని పబ్లిషర్ కు లక్ష రూపాయలు అమ్ముకున్నాను అనుకుంటూ కార్ ఎక్కారు.

Hiranyamurtyrao
Thorangal

No comments:

Post a Comment