Sunday, March 29, 2026

 *వారసత్వంగా వచ్చేది కేవలం ఆస్తి మాత్రమే,*

*కానీ నీ కష్టంతో నువ్వు సంపాదించుకునేది 'గౌరవం’.*

*ఆ గౌరవమే రేపు నీ పిల్లలకు నువ్వు ఇచ్చే గొప్ప ఆస్తి!*

అనవసరం అనుకుంటే ఆ పని ఎంత సులువైనా చేయకు.అవసరం అనుకుంటే – ఆ పని ఎంత కష్టమైనా వదలకూ.

ఇతరులతో పోల్చుకోవడం అనే వ్యాధి మన ఆనందాన్ని హరించేస్తుంది. మనకున్నదాన్ని చూసి ఆనందించడం నేర్చు కుంటేనే నిజమైన సంతోషం దొరుకుతుంది.

ఏ సమస్య లేకుండా గమ్యం చేరితే — విజయం. సమస్యలు వచ్చినా ఎదుర్కొని గమ్యం చేరితే - చరిత్ర.

అనుకున్న లేదని, జరిగినది నచ్చలేదని దేవుడిపై ఈర్ర్మ్య పెంచుకోకు. కొన్ని అద్భతాల ముందు ఆటంకాలు రావడం సహజం.
 
సాధారణంగా మనుషులు ఆభరణాలు ధరిస్తారు. కానీ ఉత్తములు ఓర్పునే భూషణంగా ధరిస్తారు.

ఈర్య, ద్వేషం, అహంకారం వదిలేస్తే మనమే మనకు స్వచ్ఛంగా, అందంగా, ఆనందంగా కనిపిస్తాం.

వేయి అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడంకంటే ఒక్క నిజం చెప్పి “క్షమించు” అని అడగడం ఎంతో ఉత్తమం._

స్వార్ధం లేనప్పుడు మనసు శాంతిస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు బుద్ధి సహకరిస్తుంది. తప్పు చేయనప్పుడు మానసిక, శారీరక ఆరోగ్యం వికసిస్తుంది.

నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు.


నువ్వు ప్రతిస్పందించటం మానినప్పుడే, ఈ దుఃఖ చక్రం ఆగుతుంది. ఏ విషయం లోను ఉద్వేగం వద్దు.

మనసు దుఃఖానికి ఎంత కారణమో, ఆనందానికి అంతే కారణం, కానీ చాలా మంది జీవితాలలో మనసు కేవలం దుఃఖం ఇచ్చే యంత్రంలా అవుతుంది.

త్యజించటం అంటే అన్నిటినీ వదిలివేయమని కాదు, నీది అనే భావననే వదిలివేయమని.

No comments:

Post a Comment