MODERN MASCULINITY : Why Strong Men Suffer in Silence — The Hidden Cost of Masculinity
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fRbtFQmc7OU
Transcript:
(00:06) మగాడు ఏడవడు మగాడు బాధపడినా చెప్పడు మగాడు కూలిపోతున్న నిటారుగా నిలుచుంటాడు. మగాడు ఏ ఒక్కడిని హెల్ప్ అడగడు. ఇవి మగాడికి రూల్స్ కాదు ఇవి సంకెల్లు కానీ ఆ సంకెల్లు బంగారంతో చేసినట్టు కనిపిస్తాయి. కాబట్టి మగాళ్ళు వాటిని గర్వంగా ధరిస్తారు. ప్రపంచంలో అత్యంత లోన్లీ క్రియేచర్ ఏది అని అడిగితే ఆన్సర్ ఒక మగాడు చావు బతుకుల్లో ఉండి కూడా నాకు ఏ నొప్పి లేదు నేను సరిగ్గానే ఉన్నాను ఐ యామ్ ఓకే అని చెప్పగలిగే ఒకే ఒక జీవి మగాడు మాత్రమే అతనికి నొప్పి తెలుసు బట్ అతను దాన్ని వీక్నెస్ అని తప్పుగా నేర్చుకున్నాడు.
(00:45) అతనికి భయం తెలుసు బట్ అతను దాన్ని పిరికితనం అని తప్పుగా నేర్చుకున్నాడు. అతనికి అందరిలాగే ప్రేమ కావాలి బట్ నాకు లవ్ కావాలి అని అడగడం గొప్పతనం కాదు అని నేర్చుకున్నాడు. సో ఈ తప్పుడు పాఠాలు ఒక మగాడికి ఎవరు నేర్పారు తన తండ్రి నేర్పాడు తన తండ్రికి తన తండ్రి నేర్పాడు ఈ సమాజం నేర్పింది తరాల తరబడి సినిమా నేర్పింది పాట నేర్పింది చదువు నేర్పింది.
(01:11) ఇప్పుడు ఈ తప్పుడు పాఠాల వల్ల మగాళ్ళు గుండెపోటుతో చస్తున్నారు. ఎందుకంటే ఈ మగజీవితం స్ట్రెస్ ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. మగాళ్ళు సూసైడ్ చేసుకోవడంలో అన్ని దేశాల్లో విమెన్ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హెల్ప్ అడగరు బాధని షేర్ చేసుకోరు. మగాళ్ళు థెరపీకి వెళ్ళరు ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం లేదు అని వాడిని వాడే నమ్మించుకొని మోసం చేసుకుంటాడు.
(01:39) ఈ ప్రాబ్లం ఒక్క ఆర్డినరీ మగాళ్లకే కాదు ప్రపంచంలోని మోస్ట్ బ్రిలియంట్ మైండ్స్ కి కూడా వర్తిస్తుంది. వాళ్ళు హ్యూమన్ సఫరింగ్ గురించి ఎమోషన్స్ గురించి బంధాల గురించి వాల్యూమ్స్ రాశారు. కానీ తమ సొంత పెయిన్ గురించి మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఎంత మేధావి అయినా మాస్క్లిన్ కండిషనింగ్ ని దాటడం అంత ఈజీ కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిగ్మెంట్ ఫ్రాయిడ్.
(02:03) మనుషుల అన్కాన్షియస్ ని మ్యాప్ చేసి తన పెయిన్ ని హైడ్ చేసుకున్న మనిషి ఇతను ఫ్రాయిడ్ సైకాలజీ మొత్తం ఒకే దాని చుట్టూ తిరుగుతుంది. అతను అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ గురించి రాశడు. మనం మన బాధని సప్రెస్ చేస్తే అవి సింటమ్స్ గా బయటిక వస్తాయని చెప్పాడు. కానీ మీకు తెలుసా అతని సైకాలజీకి అతనే కట్టుబడి లేడు. కారణం ప్రోగ్రామింగ్ మాస్క్లనిటీ.
(02:27) ఫ్రాయిడ్ కి జాక్ క్యాన్సర్ వచ్చింది. దాదాపు 16 సంవత్సరాలు ఆ పెయిన్ తో బ్రతికాడు. 33 సర్జరీస్ జరిగాయి. అతని జానీ దాదాపు పూర్తిగా రిమూవ్ చేశారు. ఒక ప్రాస్థ జా పెట్టారు. దాన్ని తీయడం పెట్టడం ఎక్స్ట్రీమ్ పెయిన్ గా ఉండేది. అసలు మాట్లాడడమే కష్టంగా ఉండేది. బట్ అతను ఈ విషయాన్ని పబ్లిక్ కి తెలియకుండా కావాలని దాచాడు.
(02:52) ఎందుకంటే మగధనానికి ఫ్రాయిడ్ కూడా అతీతుడు కాదు. మాస్క్లిన్ కండిషనింగ్ కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అతనికి తెలుసు ఎమోషన్స్ సప్రెస్ చేయడం ప్రమాదకరం అని కానీ అతను దాచి సప్రెస్ చేశాడు. ఎందుకంటే తన బలహీనత బయట పడకూడదని అలాగే డార్విన్ కూడా తనకున్న యంజైటీని ఇల్నెస్ పేరుతో మారువేషం వేసుకొని తిరిగిన మనిషి ఇతను డార్విన్ గురించి చాలా మందికి తెలిసిన కోణం ఎవల్యూషన్ థియరీ గాలాపాగోస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కానీ తెలియని కోణం ఏంటంటే అతను దాదాపు 40 ఇయర్స్ క్రానిక్ ఇల్నెస్ తో బాధపడ్డాడు.
(03:29) వామిటింగ్ హార్ట్ పల్పుటేషన్స్ ఎగ్జిమా సివియర్ యంజైటీ అటాక్స్ తో బాధపడ్డాడు. మోడర్న్ హిస్టోరియన్స్ అండ్ సైకాలజిస్ట్ులు అనలైజ్ చేసి ఒక కంక్లూజన్ కి వచ్చి ఒక విషయం చెప్పారు. అతనికి చాలా భయం ఉండేది గిల్ట్ ఉండేది ఆ భయాన్ని అనిచి వేసేవాడు. ఆ అణచివేయడం వల్ల ఫిజికల్ సింటమ్స్ గా కన్వర్ట్ అయింది. అసలు డార్విన్ కి ఈ యంజైటీ ఎందుకు వచ్చింది? అందుకు రెండు కారణాలు ఉన్నాయి.
(03:58) అందులో నెంబర్ వన్ అతని థియరీ సొసైటీని చర్చ్ ని తనకి ఎంతో ఇష్టమైన తన రిలీజియస్ భార్య అయిన ఎమ్మాని అప్సెట్ చేస్తుందని 19 సెంచరీలో విక్టోరియన్ ఇంగ్లాండ్ లో దేవుని క్వశ్చన్ చేయడం దేవుడు లేడు అని చెప్పడం జస్ట్ ఆ థాట్ రావడం ఎంత ప్రెజర్ అంటే అది ఇప్పటి మనిషి ఊహకు కూడా అందదు. ఇక రెండవది తనకి ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. నా థియరీ తప్పైతే నా పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ విషయం ఏంటి సో నాకు భయంగా ఉంది నాకు యంజైటీ వస్తుందని ఎవ్వరికీ చెప్పుకోలేదు.
(04:32) కారణం సింపుల్ అతను ఒక మగాడు తన బాధని ఎవ్వరికీ చెప్పుకోకూడదు చెప్పుకుంటే వీక్ అయిపోతావ్. ఇక ఈ మాస్క్లినిటీ మేధావుల దగ్గరికి వచ్చేసరికి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఒక మేధావి తన వీక్నెస్ ని తన భయాన్ని బయట చెప్పుకుంటే పబ్లిక్ అతన్ని ఎలా చూస్తుందో అతనికి బాగా తెలుసు. అందుకే డార్విన్ తన గార్డెన్ లో ఒంటరిగా నడిచేవాడు.
(04:57) దానికి థింకింగ్ పాత్ అని పేరు పెట్టాడు. బట్ నిజానికి తన బాధని ఆ గార్డెన్ పై పరిచేవాడు. ఆ దారి మీద చెప్పుకోలేని బాధ ఎన్నో రోజులు నడిచింది. సో పాయింట్ ఏంటంటే మగవాడు బాధపడకూడదు అనే కండిషనింగ్ తెలివిని చూడదు పొజిషన్ చూడదు ఫేమ్ చూడదు అది అందరిని ఈక్వల్ గా బంధిస్తుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మగతనం అనే మిత్తికి స్టోయిసిజం ని యాడ్ చేస్తున్నారు.
(05:23) ఈ మధ్య రీల్స్ ఫిలాసఫీలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నిజమైన మగాడు ఏడవడు బాధ పెట్టుకోడు అన్ని తనే భరిస్తాడు అనే బుల్షిట్ నమ్మకాలకి పేట్రియార్కి ఫిలాసఫీకి స్టోయిసిజం అనే లేబుల్ అంటిస్తున్నారు. మార్కస్ అరీలియస్ తన మెడిటేషన్స్ లో ఎమోషన్స్ ని అనిచివేయమని ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే ఫీలింగ్స్ ని అర్థం చేసుకోమన్నాడు వాటిని వేగంగా జడ్జ్ చేయకుండా కారణంతో చూడమన్నాడు.
(05:50) బట్ అది నేను బాధపడకూడదు అనే స్టూపిడ్ స్టోయిసిజం కాదు ఈ బాధ ఎందుకు వస్తుందో నాకు తెలుసు సో దానికి నా ప్రతిస్పందన నేను నిర్ణయించుకుంటాను అని అర్థం అసలు స్టోయిసిజం అంటే ఎమోషనల్ సప్రెషన్ కాదు ఎమోషనల్ రెగ్యులేషన్ తేడా చాలా సూక్ష్మంగా ఉండొచ్చు బట్ అర్థం లోతుగా ఉంటుంది. సప్రెషన్ అంటే ఒక ఫీలింగ్ ని లోపల ఉక్కిరి బిక్కిరి చేసి పైన మాస్క్ వేయడం లాంటిది బట్ రెగ్యులేషన్ అంటే ఆ ఫీలింగ్ ని గుర్తించి అర్థం చేసుకొని దాన్ని ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేయడం బట్ మోడర్న్ మగతనం ఏం చేస్తుందంటే స్టోయిసిజం పేరు చెప్పి సప్రెషన్ ని ప్రచారం చేస్తుంది. ఈ మోడర్న్ మగతనం వల్ల మగాళ్ళు
(06:32) పైకి చాలా ధైర్యంగా బలంగా కనిపించొచ్చు బట్ లో లోపల కుల్లి కుళ్లి చేస్తారు. చూడు డియర్ రాయిలా ఉండడం బలం కాదు అది నంబనెస్ స్ట్రెంత్ అంటే తనలో ఏం జరుగుతుందో తెలుసుకోగలగడం దాన్ని మరొకరికి షేర్ చేయగలిగే కెపాసిటీ ఉండగలగడం ఇది మార్కస్ అరీలియస్ నేర్పిన లెసన్
No comments:
Post a Comment