Sunday, March 29, 2026

 *శ్రీ రామ నవమి*

దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.


శ్రీరామ నవమి విశిష్టత ::


పురాణగాధల ప్రకారం శ్రీరాముడు, అయోధ్య రాజైన దశరధుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగన సంతానం శ్రీరాముడు. శ్రీరాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటని భక్తుల అచంచల విశ్వాసం. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.


దశావతారాల్లో 7అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం హిందువులు ఈరోజు శ్రీరాముడు జన్మదినాన్ని పండగగా జరుపుకుంటారు.


రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీసమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు. నాటి రోజే శ్రీసీతారాముల కళ్యాణం కూడా జరిగింది.  నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు "శ్రీరామ నవమి"గా ప్రజలు ఉత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణం జరుపుకుంతుంటారు.


:: రామ రాజ్యం రాముని వ్యక్తిత్వానికి నిదర్శనం ::


శ్రీరామ చరిత్రలో రామరావణ సంగ్రామం ఒకెత్తు అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు. రామరావణ సంగ్రామం గురించి పలు సందర్భాల్లో తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి రామాయణం నుండి చెప్పుకొనే కథలు అనేకం. అయితే ప్రస్తుత కాలంలో రామరాజ్య ప్రస్తావన ఎంతో అవసరం?!


నాటి నుండి నేటి వరకు అనేకమంది పాలకులు రామరాజ్యం తెస్తాం, ఇస్తాం అంటూ ప్రకటనలు గుప్పించిన వారే. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మన జాతిపిత మహాత్మా గాంధి కూడా దేశం రామరజ్యంలా సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన వారే!


అయితే నేటి పాలకుల ప్రకటనల వరకే పరిమితం చేసిన రామరాజ్యం ఎలా ఉండేది? సుభిక్షంగా, ధర్మానికి ప్రతీకగా సాగిన రామరాజ్యం సామాన్యుల స్వప్నమేనా? అంటే రాముని లక్షణాలు పునికిపుచ్చుకున్న నాయకులు వస్తారా? ఇది కోటి ఉషశ్సుల ప్రశ్న? అయితే రామరాజ్యం తెస్తామన్న పాలకులకు, కోరే ప్రజలకు  సకలగుణాభిరాముని లక్షణాలు తెలుసుకోవాలి కదా!


:: పితృ వాక్య పరిపాలకుడు, సకల గుణాభి రాముని 16 ఉత్తమ లక్షణాలు ::

.

1.      క్రమశిక్షణ కలిగనవాడు.

2.      వీరుడు, సాహసికుడు.

3.      వేదాంతి.

4.      కృతజ్ఞుడు.

5.      సత్యవాక్కు పరిపాలకుడు.

6.      గుణవంతుడు – అన్ని గుణాల్లోను ఉత్తముడు.

7.      స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని.

8.      సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.

9.      అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు.

10. సమస్తకార్యాలలోను సమర్ధుడు.

11. మంచి లక్షణాలు కలిగిన అందగాడు.

12. అత్యంత ధైర్యవంతుడు.

13. క్రోధాన్ని జయించినవాడు. ప్రశాంతచిత్తుడు.

14. సమస్తలోకల్లోనూ తెలివైనవాడు.

15. అసూయ లేని వాడు.

16. దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి.


:: శ్రీరామనవమి పూజ విధానం –పాటించాల్సిన ఆచారాలు ::


సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి" గా పూజలు జరుపుకుంటాము. భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో "రామమందిరం" ఉండనే ఉంటుంది. స్థానిక పురజనులు కమిటీలుగా ఏర్పడి ఏటేటా రాములోరి ఉత్సవాలను నవరాత్రులుగా జరుపుకొంటారు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి.

:: భద్రాచలం రామయ్య బ్రహ్మోత్సవాల విస్తృత ఏర్పాట్లు ::

 శ్రీ రామ నవమి భద్రాచలం లో అత్యంత ప్రసిద్ధమైనది. శ్రీ రామ కళ్యాణమహోత్సవము కన్నులపండుగగా జరుపుకుంటారు. ఈ దైవిక ఉత్సవం. లక్షలాది మంది భక్తులు సమావేశమయ్యే అచంచల భక్తిపారవశ్యంతో వీక్షిస్తారు. తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ల్లో రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ప్రోగ్రాంగా ఆకాశవాణి మరియు దూరదర్శన్ కవర్ చేస్తున్న ఏకైక పండుగ ఇది.

శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు

తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.

ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.

జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

👏శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. 
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, 
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

👏సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె. 
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” 
 అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే, శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. 

మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బ

No comments:

Post a Comment