Sunday, March 29, 2026

 🔔 *సత్సంగం* 🔔

 *మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా, ఏదో బాహ్యంగా పైపైన చేస్తూఉంటాము. బయటకు మాత్రం "ఓ భగవాన్! నేను నీ దాసుడను, నాకు నీవుతప్ప వేరే దిక్కులేదు"అంటూ ఉంటాము. కాని మన ప్రవర్తన అందుకు విరుద్దంగా ఉంటుంది.* 

 *మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు, మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం ?* 

 *మనం బయట ఏం మాట్లాడుతామో, మన మనస్సులోని ఆలోచనలు కూడా అదేవిదంగా ఉండాలి. అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. "భగవంతుని నామం, ఆయన రూపం వేరుకాదు".* 

 *భగవన్నామస్మరణలో ఆనందం అధికమౌతుంది. ఆయన ప్రేమమయుడు.* *ఆనందమయుడు.ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము.* 

 *సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతుని పై కేంద్రకరించడానికి ప్రయిత్నించాలి.అదే అభ్యాసమంటే.* 

 *సూదిబెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చేయాలి. దారపుపోగులు విడివిడిగా ఉంటే సూదిబెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం"...* 

 *అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్యవిషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి.* 

 *ఇంద్రియనిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు.* 

 *భగవంతుణ్ణి పొందాలంటే పరితపనే పరమోత్తమ సాధనం.* 



🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment