Sunday, March 29, 2026

 (585) (28.03.2026)

ఓ శ్రీమతి అలనాడు అరుంధతి చూపిస్తూ అందుకుంటి నీ చేతిని
నాడు అనుకుంటిమి చేతిని ఏనాడూ విడవరాదని 
ఈ 60 ఏళ్ళ జీవితంలో ఏనాడూ చేతిలోంచి చేయి విడిపోలేదు
అనారోగ్య కారణంతో ఈ రోజు నీ చేయి నా చేతి లోంచి విడిపోక తప్పలేదు //

మన ఇద్దరి చేతులు ఎందరిని ఆశీర్వదించింనాయో
మన ఇద్దరి చేతులు ఎన్ని సంసారాలు కలిపినాయో
మన ఇద్దరి చేతులు ఎన్ని గుప్తదానాలు చేసినాయో
మన ఇద్దరి చేతులు ఎందరు పేదవారిని ఆదుకున్నాయో //

ఇన్నాళ్ళు నీ చేతిని నా కుడి చేతిగా భావించినాను
ఇన్ని రోజులు ఆ చేతిని చూచి ఎంతగానో మురిసినాను
నాటి నుంచి ఈనాటి వరకు చేతులు పట్టుకునే అడుగులు వేసినాము
ఎక్కడికి వెళ్ళ వలసి వచ్చినా జంటగానే వెళ్ళినాము //

ఎవరేమి అనుకున్నా – ఎంతగా నవ్వుకున్నా చేయి మటుకు వదల లేదు
ఇన్నేళ్ళ తరువాత నీ చేయి నా చేతి నుంచి వేరు కాక తప్పలేదు
ఈనాడు నా చేతిలో నీ చేయి లేకుంటే ఏదోలా ఉంది
నీవు లేని లోటు మటుకు నాకు స్పష్టంగా కనిపిస్తోంది //

ఈ  రోజు నుంచి నను చేయి పట్టి ఎవరు నడిపిస్తారు
ఆకలేస్తే గోరుముద్దలు ఎవరు తినిపిస్తారు
ఇన్నాళ్ళు బాధ కలిగితే నీ చేతితో కన్నీరు తుడిచినావు
ఈ రోజు నుంచి నను ఒంటరిని చేసినావు //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment