Monday, March 30, 2026

జీవిత పరమార్థం ఇదే మిత్రమా | Discover Your True Self Today | Satyagrahi

జీవిత పరమార్థం ఇదే మిత్రమా | Discover Your True Self Today | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=P17sLvhIg0g



Transcript:
(00:00) ఈ భూమి మీదకి మీరు ఒంటరిగా వచ్చారు. రేపు వెళ్లేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తారు. మధ్యలో కలిసే మనుషులు ఈ బంధాలు ఈ ఆత్మీయతలు ఇదంతా ఒక అందమైన నాటకం మాత్రమే కానీ మనం ఏమనుకుంటాం అంటే ఈ నాటకమే నిజం అని నమ్మి అందులో పాత్రలకే మన జీవితాన్ని అంకితం చేసేస్తాం. చివరికి మిగిలేది ఏంటో తెలుసా ఒంటరితనం మరియు తీరని వేదన. ఈ వీడియో ముగిసేసరికి బంధాల మధ్య ఉంటూనే మీ ఆత్మను ఎలా స్వతంత్రంగా ఉంచుకోవాలో మీరు అర్థం చేసుకుంటారు.
(00:28) ఇది మిమ్మల్ని మీరు వెతుక్కునే ప్రయాణం అన్నమాట. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. మనం పుట్టిన దగ్గర నుంచి మన చుట్టూ ఒక మాయ లోకాన్ని నిర్మించుకుంటాం. నా అమ్మ, నా నాన్న, నా భార్య, నా పిల్లలు, నా స్నేహితులు ఈ నా అనే పదం మనల్ని ఎంతలా బంధిస్తుందంటే మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతాం. మీరు గమనించారా మన సంతోషం ఎప్పుడూ వేరే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది.
(00:52) అవతల వ్యక్తి మనల్ని బాగా ఇష్టపడ్డాడు అనుకోండి మనం కూడా వాడిని ఇష్టపడతాం. మనం కూడా వాడితో బాగా ఉంటాం. ఒకవేళ మనల్ని ఇబ్బంది పెడితే తిరిగి మళ్ళీ అతన్ని మనం ఇబ్బంది పెట్టాలని చూస్తాం. అంతేకాకుండా ఆ ఇబ్బంది పెట్టాలి అనే ప్రాసెస్ లో అవతల వాడు ఇబ్బంది పడకపోతే తిరిగి మనం ఇబ్బంది పడతాం. కాబట్టి సమస్య ఎక్కడఉందంటే మనం ఇతరుల జీవితాల్లో ఒక ఉనికిని వెతుక్కుంటాం.
(01:15) ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఒక అద్దం ముందు నిలబడినప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ ఆ ప్రతిబింబమే నేను అని మీరు అనుకోరు కదా అలాగే ఈ బంధాలు కూడా మీ జీవితానికి ప్రతిబింబాలే కానీ అవే మీ జీవితం కాదు దురదృష్ట శాతో చాలా మంది ఈ బంధాలనే ప్రాణంగా భావించి అవి కొంచెం బీటలు వారైనా సరే లోపల కుప్పకూలిపోతున్నారు. ఎవరికో ఏదో నిరూపించుకోవాలని ఎవరినో సంతోష పెట్టాలని మీ అమూల్యమైన కాలాన్ని ప్రశాంతతని బలిస్తున్నారు.
(01:43) స్వామి శివానంద గారు ఒక మాట అనేవారు. మనం ఈ ప్రపంచంలోకి అతిథులుగా వచ్చాం. కానీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయే యజమానుల్లా ప్రవర్తిస్తున్నాం. ఈ బ్రమలో బతకడమే అసలైన సమస్య ఎందుకు మనకి బంధాల మీద ఇంత వ్యామోహం ఎందుకు మనం ఒంటరిగా ఉండటానికి భయపడతాం. ఎందుకంటే మన లోపల ఒక పెద్ద శూన్యం ఉంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం కంటే ఎదుటివారు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం.
(02:08) ఇది దొరకనప్పుడు బాధపడతాం. మరో ముఖ్యమైన కారణం అతిగా అతుక్కుపోవడం అన్నమాట. అటాచ్మెంట్ మనం ఒక వస్తువును గాని ఒక వ్యక్తిని గాని మన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తాం. కానీ ఈ ప్రకృతి నియమం ఏంటో తెలుసా ఇక్కడ ఏది శాశ్వతం కాదు. మీరు గట్టిగా పట్టుకోవాలని చూసే కొద్దీ అది మీ చేతుల్లోనుంచి ఇసుకలా జారిపోతూనే ఉంటుంది. మనం బంధాలని ఒక భద్రతగా భావిస్తాం.
(02:30) కానీ నిజానికి ఏ బంధం కూడా మీకు పూర్తి భద్రతను ఇవ్వలేదు. ఎందుకంటే మనుషుల మనస్తత్వం మారుతూనే ఉంటుంది. పరిస్థితులు మారుతున్నట్లు మారుతూనే ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఆలోచించేవాడిని అందరూ నా చుట్టూ ఉండాలి అందరూ నన్ను మెచ్చుకోవాలని చెప్పేసి ఆశపడేవాడిని కానీ ఒకానొక దశలో అర్థమైంది మనం ఎంతమంది మధ్యలో ఉన్నా మన ఆలోచనలతో మనం పోరాడాలి.
(02:51) ఈ లోకం ఒక రైలు ప్రయాణం లాంటిది. ఒక స్టేషన్ లో ఎవరు ఎక్కుతారు ఇంకో స్టేషన్ లో ఎవరు దిగిపోతారు. ఎవరు మీతో చివరి వరకు రారు రాలేరు కూడా ఈ సత్యాన్ని అంగీకరించలేకపోవడమే మనల్ని మానసిక బానిసలుగా మారుస్తుంది. ఈ బంధాల చర నుంచి బయట పడటం అంటే అందరినీ వదిలేసి అడవులకు వెళ్లిపోవడం కాదు అది పిరికితనం అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? స్వామి శివానంద గారు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపారు.
(03:14) అదే డిటాచ్డ్ అటాచ్మెంట్. అంటే తామరాకు మీద నీటి బొట్టుల ఉండటం. తామరా ఆకు నీటిలోనే ఉంటుంది కానీ నీరు దాన్ని అంటుకోదు. మీరు కూడా సమాజంలో ఉండండి కుటుంబంతో ఉండండి బాధ్యతలు నెరవేర్చండి కానీ మనసు మాత్రం దేనికి అంకితం చేయకండి ప్రేమించండి కానీ ఆ ప్రేమలో బానిసత్వం ఉండకూడదు. ఎవరైనా మీ జీవితం నుండి వెళ్ళిపోతుంటే వారిని గౌరవంగా వెళ్ళనివ్వండి.
(03:37) ఎందుకంటే మీ సంతోషానికి మూలం మీ లోపలే ఉంది. బయట వ్యక్తుల్లో లేదు. జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ఒక రహస్యం ఉంది. అదే మెమంటోమెరీ అంటే మీరు చనిపోతారనే నిజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించొచ్చు కానీ ఇదే మిమ్మల్ని అసలైన స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవుగానే ఒకసారి అనుకోండి.
(03:57) ఈరోజు నా జీవితంలో చివరి రోజు అయితే నేను ఎవరి మీదో కోపంగా ఉంటానా? ఎవరు మెప్పించడానికి తాపత్రయ పడతానా అనవసరమైన బంధాల కోసం ఏడుస్తానా లేదు కదా మరణం గురించి స్పృహ ఉన్నప్పుడు మీరు అనవసరమైన విషయాలకు ఇచ్చే విలువ తగ్గుతుంది. మీ దృష్టి కేవలం ప్రస్తుతం మీద మీ ఆత్మ ఎదుగుదల మీద మాత్రమే ఉంటుంది. నిజమైన విజయం అంటే డబ్బు సంపాదించడం కాదు మనుషులను సంపాదించడం కూడా కాదు మిమ్మల్ని మీరు గెలవడం ఇతరుల నుండి ఏమి ఆశించకుండా ఉండటమే అతి పెద్ద శక్తి.
(04:24) మీరు ఎప్పుడైతే నాకు ఎవరు లేకపోయినా నేను సంతోషంగా ఉండగలను అనే స్థితికి చేరుకుంటారో అప్పుడు మీరు నిజంగా బతకడం మొదలు పెట్టినట్లే కాబట్టి ఇప్పటి నుంచే మారండి. బంధాల మాయలో పడి మీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోకండి. అందరినీ ప్రేమించండి కానీ మీ సంతోషాన్ని మాత్రం మీ చేతుల్లోనే ఉంచుకోండి. మీరొక అద్భుతమైన చైతన్యం.
(04:46) దాన్ని ఈ చిన్నపాటి బంధాల కోసం కుంచుంచుకుపోయేలా చేయకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అంతే కాకుండా ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ ఓం

No comments:

Post a Comment