🧘 నిజమైన సాధన నిన్ను ఒక యోగిలా మారుస్తుంది... సహజంగానే వైరాగ్యం మనలో ఉంది...💠
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3_FbbO89pIQ
Transcript:
(00:01) సహయభావాంజం ప్రజయాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వైరాగ్యం మనిషి ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి ఒక నిరంతర అన్వేషణలో ఉంటాడు. అతను వెతికేది ఒక్కటే సుఖం, శాంతి, ఆనందం కానీ అతనికి అసలు కావాల్సింది ఏమిటో స్పష్టంగా తెలియదు. తన నిజమైన దివ్య స్వరూపాన్ని మర్చిపోయిన మనిషి ఈ తాత్కాలికమైన ఇంద్రియ ప్రపంచంలో శాశ్వత ఆనందాన్ని వెతుకుతూ తిరుగుతుంటాడు.
(00:30) అతని జీవితమంతా ఒక వెతుకులాటగా మారిపోతుంది. కానీ ఎంత వెతికినా అతనికి అంతరంగ శాంతి దొరకదు. ఎందుకంటే అతను వెతికే చోటు తప్పు. మనిషి సాధారణంగా ఇలా అనుకుంటాడు. చదువు పూర్తయ్యాక సుఖం వస్తుంది ఉద్యోగం వచ్చాక శాంతి వస్తుంది. డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుంది అని పెళ్లి చేసుకుంటే జీవితం సంపూర్ణం అవుతుంది అని అనుకుంటాడు.
(00:52) కానీ వాస్తవానికి ఈ అన్ని సాధించిన తర్వాత కూడా అతనిలో ఖాళీ భావన ఉంటుంది. డబ్బు పెరిగినా కొద్ది భయం పెరుగుతుంది. బంధాలు పెరిగినా కొద్దీ బాధలు పెరుగుతాయి. శరీరం ఉన్నంతవరకు వ్యాధులు తప్పవు. కాబట్టి ఈ ప్రపంచంలోని ఏ వస్తువైనా శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదు. ఇవన్నీ తాత్కాలికమైనవే మర్చిపోయేవే వైరాగ్యం అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు.
(01:17) వైరాగ్యం అంటే ప్రపంచాన్ని ద్వేషించడం కాదు బాధ్యతల నుంచి పారిపోవటం కాదు వైరాగ్యం అంటే ప్రపంచ విషయాల నిజ స్వరూపాన్ని తెలుసుకొని వాటిపై ఆధారపడకుండా ఉండటం. ఇది శాశ్వతమైనది అని లోతుగా గ్రహించి మనసును వాటి నుంచి మెల్లగా వెనక్కి తీసుకోవటం చిన్నప్పుడు మనం బొమ్మలతో ఆడుకుంటాం. కానీ పెద్దయ్యాక వాటిపై ఆసక్తి ఉండదు. ఎందుకంటే వాటి విలువ మనకు తెలుసు ఇదే వైరాగ్యం యొక్క సూత్రం మనిషి జీవితంలో చాలాసార్లు యాంత్రికంగా మారిపోతాడు తినడం నిద్రపోవడం మాట్లాడడం ఇవే రోజంతా చేస్తూ జీవితం గడుపుతాడు ఇదే పనులు జంతువులు కూడా చేస్తాయి అయితే మనిషి ప్రత్యేకత ఏమిటి
(01:53) ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం ఇవి లేకపోతే మనిషి మరియు జంతువు మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో ఆధ్యాత్మిక సాధనను తప్పనిసరిగా నేర్చుకోవాలి. మన బాధలకు మూల కారణం మన అంతరంగంలోనే ఉంది. అవిద్య అదే అజ్ఞానం రాగం, ద్వేషం, అహంకారం ఈ వాసనలు మనల్ను సంసార చక్రంలో బంధిస్తాయి. ఇది నాది అనే భవనతో మనం వస్తువులకు మనుషులకు అతుక్కుపోతాము.
(02:21) అవి పోయినప్పుడు మనం బాధపడతాము. ఈ బంధనమే మన దుఃఖానికి కారణం. మనం బయట పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తాము. కానీ అసలు మార్చాల్సింది మన దృష్టికోణం. ప్రపంచ సుఖాలు నిజమైన సుఖాలు కావు అవి తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి అంతే కానీ తర్వాత బాధను కూడా తెస్తాయి వాటితో పాటు ప్రతి ఇంద్రియ అనుభవం లోపల బాధ విత్తనం ఉంటుంది. ఉదాహరణకు మనకు ఇష్టమైన వస్తువు దొరికితే సంతోషం వస్తుంది.
(02:47) కానీ అది పోతే బాధ వస్తుంది. కాబట్టి బాధకు కారణం వస్తువు కాదు. దానిపైన మన ఆసక్తి వైరాగ్యం అంటే ఈ ఆసక్తిని తగ్గించడం. మనిషి కోరేది నిజానికి నిత్యమైన ఆనందం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మారని శాంతి ఈ ఆనందం బయట ప్రపంచంలో దొరకదు ఇది మనలోనే ఉంది. దీనిని ఆత్మానందం అంటారు. ఈ ఆనందం శాశ్వతమైనది. స్వతంత్రం అపరిమితం. దీనిని అనుభవించడానికి మనం మన అంతరంగంలోనికి ప్రయాణించాలి.
(03:16) ఇది ధ్యానం, భక్తి, జ్ఞానం ద్వారా సాధ్యమవుతాయి. వైరాగ్యం ఒక్కసారిగా రాదు. ఇది క్రమంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి మొదటి అవసరం వివేకం. సత్యం మరియు అసత్యం మధ్య తేడా తెలుసుకోవటం తరువాత సత్సాంగత్యం మంచి ఆలోచనలు మహానుభావుల ఉపదేశాలు వినటం ధ్యానం భక్తి ఈ మార్గంలో నడుస్తూ మనం క్రమంగా వైరాగ్యాన్ని పొందగలం. కాలం చాలా వేగంగా గడుస్తుంది. ప్రతిరోజు వస్తుంది పోతుంది.
(03:40) మన జీవితంలో ఒకరోజు తగ్గిపోతుంది. కానీ మనం ఏమి సాధిస్తున్నాం? మనం ఇంకా అదే పాత అలవాట్లతోనే ఉన్నామా? లేక మన జీవితానికి అసలు ఉద్దేశం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ఈ ప్రశ్న ప్రతి మనిషి తనకు తానే అడగాలి. ఈ జన్మం మనకు యాదృచ్చికంగా రాలేదు. ఇది ఒక అమూల్యమైన అవకాశం. ఈ జన్మ యొక్క అసలు లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం మనం ఈ అవకాశాన్ని వృధా చేసుకోకూడదు.
(04:05) భోగాలలో మాత్రమే మునిగిపోతే మనం మళ్ళీ మళ్ళీ ఇదే చక్రంలో పడిపోతాము. వైరాగ్యం ద్వారా మాత్రమే మనం ఈ బంధనాల నుంచి విముక్తి పొందగలం. కాబట్టి ప్రతి రోజు కొంత సమయం మన ఆత్మ కోసం కేటాయించాలి. కొద్దిసేపైనా ధ్యానం చేయాలి. దేవుని స్మరణ చేయాలి మన జీవితాన్ని పరిశీలించాలి. చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్పులు వస్తాయి. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు ప్రపంచంలో ఉండి దానికి బానిస కాకపోవటం చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి నిజమైన ఆనందం బయట లేదు అది మీలోనే ఉంది.
(04:36) మీరు వెతుకుతున్నది మీరు ఇప్పటికే కలిగి ఉన్నారు. దానిని గుర్తించడానికి వైరాగ్యం ఒక మార్గం. ఈ రోజే ఆ మార్గంలో మొదటి అడుగు వేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ [సంగీతం] చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అది వాళ్ళకి తెలిసి జరగొచ్చు, తెలియకుండా జరగొచ్చు కొన్ని కలల్లో వస్తా అంటే ప్రతి కలకి చాలా డీప్ మీనింగ్ ఉంటది.
(05:10) దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తది. నాకు కూడా కలలో చాలా సైన్స్ వచ్చేటివి అన్నమాట. సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్ లో మాట్లాడుకుందాం. మీరు కామెంట్ లో పెట్టండి సో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్సహైగవాహం ప్రవజం [సంగీతం] ప్రజయామి సహైగబాహం ప్రవజం [సంగీతం] ప్రజామిసహైగవా ఆహం దం ప్రవజం [సంగీతం] ప్రజ
No comments:
Post a Comment