Monday, March 30, 2026

స్త్రీల ఆరోగ్య రక్షణ - గర్భాశయ దోషాల నివారణ - రక్షావిధానం | Women's Health Care & Natural Healing

స్త్రీల ఆరోగ్య రక్షణ - గర్భాశయ దోషాల నివారణ - రక్షావిధానం | Women's Health Care & Natural Healing

Author Name:శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA

Youtube Channel Url:https://www.youtube.com/@SRIRAVINDRAJYOTISHALAYAMS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NhqHMB-rZfI



Transcript:
(00:01) శ్రీమాత్రే నమః ఇప్పుడు మనం ఒక స్త్రీలకు సంబంధించినటువంటి రక్ష చర్య గురించి తెలుసుకుందాము. ఇది ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ఈ దోషం ఏందంటే ఇది రక్త ప్రదర దోషం లేదా గర్భదోష నివారణ రక్షా విధానం అయితే ఒక మూడు కారణాల వల్ల స్త్రీలకు సంబంధించి ఆ గర్భపరంగా రక్త సంబంధించినటువంటి సమస్యలు గాని రక్తస్రావ సమస్యలు గాని గర్భాశయ దోషాలు గాని ఎదురైతుంటాయని అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు అధైర్య పడకుండా శాస్త్రోక్తంగా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఇదొక చతుర్విధ స్వస్థత విధానం ద్వారా తెలుసుకుందాం.
(00:40) మొట్టమొదలు దీనికి నిదానం అంటే సమస్య యొక్క కారణం గురించి ఏ కారణాల వల్ల ఈ దోషం సంభవిస్తుందో ఈ మొదటి శ్లోకం లోపల చెప్తున్నారు. దేహే పిత్త ప్రకోపాస్చ రక్తధాతు వికారకం చింతాశోక భయ క్లేషైహి ప్రాణశక్తిహి క్షయంగతః దృష్టిదోష ప్రభావేన అదృశైహి బాధకైస్తతః ఏతైహి త్రివిత హేతుబిహి రోగవృద్ధి ప్రజాయతే అని అంటే మొదటి కారణం ఏమంటున్నారంటే స్త్రీ శరీరం లోపల సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల లేదా తినకున్నటువంటి పదార్థాలు తినడం వల్ల గాని ఇంకా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల గాని పిత్త దోషాలు అంటే వాతము పిత్తము కపమని మూడు గుణాలు ఉంటాయి ఆయుర్వేదం
(01:20) ప్రకారం అందులోపల పిత్త దోషాలు పెరగడం వల్ల రక్తం లోపల ఇట్లాంటి సమస్యలు అంటే రక్తస్రావ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ మొదటి విధానానికి తగినటువంటి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి అదేవిధంగా శరీరంలో ప్రకోపిస్తున్నటువంటి పిత్త దోషాన్ని తగ్గించుకుంటందుకు చక్కని ఆయుర్వేద వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకొని ఆ అలవాట్లను రూపొందించుకోవాలి తగిన ఔషధాలను కూడా ఇది మొదటి కారణం వల్ల ఈ దోషం సంభవిస్తే వచ్చేది.
(01:45) ఇక రెండవది ఏమని చెప్తున్నారంటే చింతాశోక భయ క్లేషి ప్రాణశక్తి క్షయంగతః అంటే ఏ స్త్రీలైతే అధికంగా స్ట్రెస్ గా అంటే ఆందోళన భయము తర్వాత అతిగా ఒత్తిడితోని మానసికంగా ఉంటారో అప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు సంభవిస్తాయి. ఈ దోషాలకి ఏమని చెప్పింటే ఈ కారణాలు ఉంటే ఆ స్త్రీ తెల్లవారు జామున నిద్రలు ఇవ్వడం సూర్యోదనలో స్నానం చేయడం ఆ తగిన ఆహారం తీసుకోవడం అంటే అతన లోపల ఆత్మ విశ్వాసం పెరిగేటువంటి దినచర్య రూపొందించుకోవడం తర్వాత ఉపవాసాలు చేయకపోవడం అలాగే తల మీదకి వెళ్లి శిరస్నానాలు చేయకుండా ఉండడం తర్వాత రాత్రి తొందరగా నిద్రించడం సమయము వ్యర్థం
(02:21) చేయకపోవడం ఇట్లాంటి నియమాలు పాటించడం వల్ల మానసికంగా ఆ ఉన్నటువంటి అశాంతి తొలిగిపోయి ఒక ఆత్మవిశ్వాస అనేది తిరిగి క్రమంగా ఈ సమస్య తొలుగుతుంది అంటే ఆ స్త్రీలో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గుతుంది. ఇది రెండవ దాని కారణంగా ఒకవేళ ఈ సమస్య ఉత్పన్నం అయితే అంటే మానసికంగా అధిక ఒత్తిడి ఉండడం వల్ల ఈ కారణం అయితే తగినంత నిద్ర తగిన విధంగా కొద్ది కొద్దిగా ఎక్కువ ఆహారము ఆ సరైన విధంగా వ్యవహరించడం వల్ల అంటే ఒకేసారి ఎక్కువ మొత్తం తినడము లేదా ఉపవాసాలు ఉండడం లేకుంటే సరిగా తినకోవడం వల్ల కూడా శరీరం లోపల ఈ పిత్త దోషాలు ప్రకోపిస్తాయి.
(02:54) కాబట్టి అశాంతి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవడం వల్ల ఈ రెండవ కారణం అన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇక మూడవ కారణం ఏమని చెప్తున్నాడఅంటే ఇది గ్రహ దృష్టి గాని లేదా ఇంకా ఇతర దృష్టి దోషాల వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు రావచ్చు అప్పుడు ఏమంటే ఇంత ఇంతమంది డాక్టర్లకు ఉపయోగించుకున్నా గానీ ఇంతమంది వైద్యుల దగ్గర సలహాలు తీసుకొని ఆశించినా గాని అప్పుడు ఈ సమస్య తగ్గకపోవచ్చు.
(03:18) అప్పుడు ఈ విధానాన్ని ఆచరించి ఆ సమస్యను నిర్మూలనం చేసుకొని మరి చక్కని ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ మూడో కారణం ఏందటంటే ఒకవేళ గ్రహ దృష్టి దోషం కానీ ఇతర దృష్టి దోషాలు కానీ ఉంటే అప్పుడు చేయవలసినటువంటి రక్షా విధానం గురించి చెప్తున్నారు. ఇది ఈ విధానం వల్ల బయట నుంచి వచ్చినటువంటి ప్రతికూల నెగటివ్ ఎనర్జీ దోషాలు తొలిగిపోయి మరి చక్కని ఆరోగ్యము ఆ స్త్రీకి చేకూరుతుంది.
(03:40) దీనికి ఏమని చెప్తున్నారు అంటే లవణం మరీచం చేయవ సరషపం నింబ పల్లవం కదిరంవ పలాశంవ కరవీరం తతేక్షుకం ఏతానిచ సమాదాయ దృష్టి దోషం యపోహతు దీనికి దిష్టి ద్రవ్యాలు ఏమని చెప్తున్నారంటే ఒకటి దొడ్డు ఉప్పు రెండవది మిరియాలు మూడవది ఆవాలు తర్వాత తెల్ల ఆవాలు గాని నల్లవాలు గాని ఏదైనా సరే తర్వాత వేప ఆకులు మరియు చండ్ర చెక్క అంటే ఈ ఐదు వస్తువులను సేకరించాలి.
(04:14) దొడ్డుప్పు, మిరియాలు, ఆవాలు వేప ఆకులు మరియు చండ్ర చెక్క ఒకవేళ చండ్ర చెక్క దొరకని పరిస్థితి ఉంటే దానికి ఏమని చెప్తున్నారంటే దానికి బదులుగా మోదుక పుష్పాలు గాని మోదుక పుష్పాలు అంటే మనకు ఆ శివరాత్రి నాడు శివుడి మీద పెట్టేటువంటి ఆ ఎరుపు రంగులో ఉండేటువంటి పుష్పాలు ఒకవేళ ఆ పుష్పాలు లభించకుంటే వాటి చిగుళ్లు గాని లేదా కరవీర పుష్పం అంటే కన్నేరు పూలు గాని అది కూడా దొరకకుంటే ఇక్షుకం అంటే చెరుకు ముక్కలు గాని అంటే మొత్తం ఐదు ద్రవ్యాలు మాత్రమే వాడాలి.
(04:44) ఉప్పు మిరియాలు ఆవాలు వేప ఆకులు ఈ చండ చెక్క గాని లేదా దాని బదులుగా మిగతా ద్రవ్యాలు గాని ఇవన్నీ కలిపి వీటిని ఇంతకుముందు ఒక వీడియో దిష్టిని ఎలా తీయాలి ఎక్కడ వేయాలి అనేటువంటి విధానాలతో కూడుకున్నటువంటి ఆ మా ఛానల్ లోపల ఒక వీడియో ఉంది దాన్ని చూసి ఇప్పుడే కొత్తగా చూస్తున్న వారు దాని ప్రకారంగా ఆ ఎవరైతే ఈ సమస్యను అనుభవిస్తున్నారో ఆ స్త్రీ చుట్టూరుగా తింపి ఏడు సార్లు దీన్ని అగ్నిలో వేయాలని చెప్పేసి చెప్తున్నారు.
(05:10) దీనివల్ల ఆ దోషం అనేది తొలిగిపోతుంది అంటే ప్రతి ఆదివారము మంగళవారం అంటే వారంకి ఒకసారి గాని లేదా వారంకి రెండు సార్లు గాని తమ తమ అవకాశం బట్టి ఈ యొక్క రక్షాచర్య చేయడం వల్ల ఈ గ్రహ దృష్టి గాని దృష్టి దోషం వల్ల వచ్చినటువంటి సమస్య ఉంటే అది తొలగిపోతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇక దీనితో పాటు శరీరం లోపల ఒక తగిన విధంగా ఆ అంతర్గత శుద్ధి గురించినటువంటి కొన్ని సూత్రాలు చెప్తున్నారు.
(05:33) ఇక్కడ ఏమని చెప్తున్నారుంటే అశోక వల్క సిద్ధంచ కషాయం రక్త స్తంభనం పలాష పుష్ప బాలకహి దేహతాప నివారణం ధాత్రీపల సమాయుక్తం రక్తశుద్ధి కరం పరం అంతఃకరణ శుద్ధిర్థం వైద్యదేవ స్మృతిం కురు క్షీరం క్షీర వికారంంచ వర్జయేత్ బేసజక్షనే అని అంటే దీనికి ఒక కషాయం చెప్తున్నారు ఆ కషాయం ఏమిటంటే అశోక వృక్షం యొక్క బెరడు ఇది ఏదన్నా ఆయుర్వేద మందులు అనేటువంటి షాపుల్లో రూపంలో దొరుకుతుంది తర్వాత మోతుకు మోతుకు పూలు ఆ శివరత్నాడు శివుని పెట్టేటువంటి పుష్పాలు తర్వాత వట్టి వేర్లు తర్వాత ఉసిరికాయలు పచ్చివి గాని లేదా వాటి యొక్క ఎండబెట్టినటువంటి వరుగు గాని వీటిని మరిగించి కషాయం
(06:16) చేసుకోవాలి. అది ఎన్ని నీళ్లు వస్తాయో అందులో సగమయ్యే వరకు మరిగించి వాటిని ఇక్కడ ఏమంటున్నారంటే దేవవైజ్ఞునైనటువంటి అశ్వినీ దేవతలను స్మరించి అంటే శ్రీ అశ్విని దేవతాభ్యా నమః అని స్మరించి ఈ కషాయాన్ని స్వీకరించాలి దీనివల్ల శరీరం లోపల ఇంకేమైనా శరీరగతమైనటువంటి దోషాలు ఉంటే తొలగిపోతాయి అని అయితే దీనికి ఒక పత్యం ఏమని చెప్తున్నారంటే ఈ కషాయం తీసుకుంటూ ఉన్నప్పుడు లేదా ఈ చికిత్సకు తగిన ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు పాలు గాని పాల వస్తువులు గాని మానేయాలి తీసుకోవద్దు.
(06:45) తప్పనిసరి ఎవరికైనా టీ కాఫీలు అలవాటు ఉంటే కనీసము ఈ కషాయం తీసుకున్న తర్వాతమూడు గంటల కాలము మరి వ్యవధానం ఇచ్చి అంటే గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. వీళ్ళైతే పూర్తిగా ఈ కషాయం తీసుకున్న రోజులు ఆ పాలు గాని పాల వస్తువులు గాని మానేస్తే మంచిదని చెప్పేసి సూచిస్తున్నారు. అలాగే భోజన సూచనలు కూడా తక్కువ మోతాదు లోపల ఎక్కువసార్లు తీసుకోవాలని ఆ కడుపు ఎక్కువ ఉపవాసాలు ఉండడం వల్ల సరిగ్గా భోజన ఆహారం అలవాట్లు తీసుకోకపోవడం వల్ల అంటే ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా శరీరం లోపల ఈ పిత్తము ఉష్ణం పెరిగి ఇట్లాంటి దోషాలు సంక్రమిస్తాయి కాబట్టి మొట్టమొదట ఆహార
(07:15) నియమాన్ని సరైన విధంగా ఆ చేసుకోవాలి అలాగే నిద్ర సరిగ్గా లేకుంటే కూడా ఇట్లాంటి శరీరం లోపల ఈ పిత్తము వాత ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి కాబట్టి ఆ తగిన నిద్ర తగిన ఆహారం అది కూడా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఉండేటట్టు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాడు. ఇంక దీనితో పాటు మంత్ర ఔషధం అనే ఒక ఆధ్యాత్మిక రక్షణ కూడా ఇక్కడ వివరిస్తున్నారు.
(07:33) అంటే ప్రతిరోజు ఈ దేవతలను స్మరించడం వల్ల ఇట్లాంటి దోషాలు ఏఉన్నా అంటే గ్రహ దృష్టితోని గానీ ఇంకేదైనా దృష్టి దోషాలు గాని ఎప్పటి కూడా తగలకుండా ఉంటాయి ఉన్నాయి కూడా ఆ దోషాలన్నీ కూడా ఈ దేవతలను స్మరిస్తే ఆ నెగటివ్ ఎనర్జీస్ అన్నిటి వెంటనే అక్కడి నుంచి అదృశ్యం తొలిగిపోతాయి. ఇక్కడ ఏమని చెప్తున్నాడుంటే ఇంద్రాణీంచ తథా ఇంద్రం అశ్వినో దేవ వైద్యకౌ హిరణ్య గర్భ పుండరికాక్షౌ దామోదర మతో తథ శీతలాంచ తథాదేవి కామేశ్వరౌచ భక్తితః భక్త్యా స్మరదయానారి రక్షారోగ్య మంత్రౌషధం అని ఇది మంత్రౌషధం అంటే ఈ దేవతలను స్మరించడం వల్ల అంటే ఈ నామాలను జపం చేయడం వల్ల ఇంకా
(08:08) పూర్తి రక్షణ సిద్ధిస్తుంది. అంటే ఆ గర్భదోష నివారణ అంతా కూడా జరిగి ఆమె ఆరోగ్యము త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలై మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే పూర్తి ఆత్మ విశ్వాసంతోనే ముందటి అడుగు వేస్తు ఇక్కడ దేవతలు ఎవరంటే ఇంద్రాని ఇంద్రుడు తర్వాత దేవైద్యులు ఉన్నటువంటి అశ్వని దేవతలను తర్వాత హిరణ్య గర్భముడు తర్వాత పుండరీకాక్షుడు దామోదరుడు శీతలాదేవి కామేశ్వర కామేశ్వరి అంటే కామేశ్వరి సేమత కామేశ్వరులను ఈ కామేశ్వరి అంటే సాక్షాత్తు లలితా పరమేశ్వరి ఆమె ఆ ఇది కామేశ్వరి సమేత కామేశ్వరులు వారి యొక్క నామాలను భక్తి చేత ఏ స్త్రీ అయితే ఏ నామాలను స్మరిస్తూ
(08:43) నిరంతరం స్మరిస్తూ జపిస్తూ ఉంటుందో ఆమెకు ఒక రక్షణ ఆరోగ్యము ఇచ్చేటువంటి ఒక మంత్రం ఔషధం లోపల మంత్రౌషధంగా ఇది పని చేస్తుంది అని చెప్పేసిని శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ ఏమని స్మరించాలంటే ఎనిమిది నామాలు ఇచ్చారు వాటిని వరస క్రమంలో చెప్తున్నాను. ఇవి ఆ మీకు తగిన విధంగా ఒక పెన్న పేపర్ పెన్ తీసుకొని ఒక పేపర్ పెన్ రాసుకొని ప్రతి నిత్యం స్నానం తర్వాత ఇవి జపం చేయాలి.
(09:01) కనీసం ఒక్కొక్కటి 108 సార్లు జపం చేయొచ్చు మరీ తొందర ఉంటే ఒక్కొక్క నామం 24 సార్లు చేసినా గన సరిపోతుంది. శ్రీ ఇంద్రాన్యే నమః శ్రీ ఇంద్రాయే నమః శ్రీ అశ్విని దేవతాభ్యా నమః శ్రీ హిరణ్య గర్భాయ నమః శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ దామోదరాయ నమః శ్రీ శీతలాదేవ్యే నమః శ్రీ కామేశ్వరాభ్యాం నమః వీటిని ఈ విధానాలను పాటించడం వల్ల శారీరక స్వస్థతతో పాటు మానసిక ధైర్యం కూడా లభిస్తుంది.
(09:32) ఈ రకమైనటువంటి నియమాలు పాటించి మరి చక్కని ఆరోగ్యం చేకూర్చుందురు గాక స్వస్తి శుభం భవతు శ్రీమాత్రే నమః ఓం

No comments:

Post a Comment