*_ఈ విలయం నీ లయమే..!_*
😡😡😡😡😡😡😡
*_ఓ మనిషీ.._*
నువ్వే వికృతై
ప్రకృతిని మింగేస్తూ
కరవని ఏకరవు పెడితే ఎలా..
ఇది నీ ఖేలా..
ఇలా అయితే
ఈ జగతిన
*_నువ్వే మిగులుతావు అఖేలా..!_*
*_ఓ మనిషీ.._*
నిన్ను మించిన విలనున్నాడా..
నీ తిండి కోసం..
నీ నివాసం కోసం..
నీ విలాసం కోసం..
మొత్తంగా నీ అన్నిటి కోసం
చెట్టు చేమ..పండు కాయ..
రాయి రప్ప..
పుష్పం..తోయం..
ఆకు అలమ..
అన్నిటినీ
హరియించేస్తూ పోతే
*_ఒకనాటికి నువ్వే_*
*_హరీ అనవా మరి..!_*
*_ఓ మనిషీ.._*
నేల..నింగి..గాలి..
నీరు..నిప్పు..
ఇలా పంచభూతాలు
నీ స్వార్థానికి సమిధలై..
నీ ఎదుగుదలకు పునాదులై..
ఇలా నువ్వే విధ్వంసరచన
సాగిస్తుంటే..
*_నేటి సమిధలే_*
*_రేపటి నీ సమాధులు..!_*
*_ఓ మనిషీ.._*
ఉట్టికెగరలేనమ్మ
స్వర్గానికి ఎగరబోయినట్టు
నువ్వు నివసిస్తున్న
భూమినే ధ్వంసం చేసి
చంద్రుడిపై ఇల్లు కడతావట..
ముందు నీ కింద నేలను
సక్రమంగా ఉంచి
అప్పుడు నింగికి
వెయ్యవయ్యా నిచ్చెన..
ఇలాగే అత్యాశకు పోతే
*_విలయమే..విధ్వంసమే..!_*
*_ఓ మనిషీ.._*
ఇప్పటికే నీ చుట్టూ
ఎంతో కరవు..
మంచితనం..మానవత్వం..
జాలి..కరుణ..దయ..
ఇవన్నీ ఎప్పుడో గయా..
ఇప్పుడేమో
ప్రకృతి వనరుల కరవు..
మండుతోంది భూగోళం..
ఎండుతోంది పాతాళం..
భవితేమో గందరగోళం..
ఇన్ని జరిగినా మారని
నీ మేళం..
ఒకనాటికి ప్రకృతి అనే ఖజానాకు
*_నీకు నువ్వే వేసేసే తాళం..!_*
*_ఓ మనిషీ .._*
నదులు ఎండుతున్నా..
పొలాలు బీటలు వారుతున్నా..
వానలు లేకున్నా..
సునామీలు ముంచెత్తుతున్నా..
తుపానులు కమ్ముకొస్తున్నా..
*_అడవులు అంతరిస్తున్నా.._*
ఎండలు మండిపోతున్నా..
అంతమే పొంచి ఉన్నా
వింతగా నువ్వు మారవేం..
నీ ఎదుట
*_కనిపిస్తున్న దృశ్యం.._*
*_నీ ఆత్మహత్యాసదృశం..!_*
_సురేష్..9948546286_
_7995666286_
No comments:
Post a Comment