డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా? ఎపిక్యురస్ చెప్పిన సీక్రెట్! | Nagna Satyam Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Oe3kEvMX1fk
Transcript:
(00:01) [సంగీతం] డబ్బు అనేది ఒక మాయ. కొందరు దీన్ని పాపానికి మూలం అంటారు. ఇంకొందరు డబ్బు లేకపోవడమే అసలైన దరిద్రం అంటారు. కానీ నిజం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం ఒక సర్కస్ అయితే ఆ సర్కస్ నడవడానికి కావాల్సిన ఫ్యూయల్ ఈ డబ్బే. మనిషికి డబ్బుకి మధ్య ఉన్న రిలేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న సొసైటీ మనల్ని ఒక రేసు గుర్రాల్లా మార్చేసింది.
(00:33) పక్కింటోడి దగ్గర ఏముంది వాడి కార్ ఎంత పెద్దది వాడి వాచ్ రేట్ ఎంత ఇదే మన జీవితం అయిపోయింది. కానీ ఇక్కడ నిజం ఏంటంటే నీ దగ్గర కోట్లు ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. అలాగే నీ దగ్గర రూపాయి లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండలేవు. హ్యాపీనెస్ అనేది లోపల ఉంటుంది అని వేదాంతం చెప్పడం ఈజీనే కానీ అలానే ఆకలి వేసినప్పుడు ఫిలాసఫీ కడుపు నింపదు.
(00:58) అందుకే డబ్బు అవసరం. అయితే ఆ డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంది. అది తెలియకనే చాలామంది డబ్బు ఉండి కూడా దరిద్రుల్లా బ్రతుకుతున్నారు. సో ఇక్కడ ఎపిక్యూరస్ చెప్పిన మాటలు వింటే అసలు మనం ఎంత పిచ్చివాళ్ళమో అర్థంవుతుంది. మనిషి కోరికల్ని ఇతను మూడు రకాలుగా విడగొట్టాడు. మొదటిది నాచురల్ అండ్ నెసెసరీ అంటే ఆకలి దాహం నిద్ర ఉండటానికి ఒక నీడ.
(01:29) ఇవి ఉంటే చాలు మనిషి బ్రతికేయొచ్చు. ఇవి తీర్చుకోవడం చాలా చీప్ కూడా. రెండోది నాచురల్ బట్ నాట్ నెసెసరీ అంటే మంచి టేస్టీ ఫుడ్ కావాలనుకోవడం లగ్జరీగా ఉండాలనుకోవడం ఇవి లేకపోయినా మనం చచ్చిపోం కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక మూడోది వెయిన్ డిజైర్స్ అంటే పిచ్చి కోరికలు ఒక కోటి రూపాయల వాచ్ 10 కోట్లు పెట్టి ఒక కారు కొనడం ఇక్కడ ఎపిక్యూరస్ ఏమంటాడంటే ఈ మూడో రకం కోరికల వెనక పరిగెత్తేవాడు ఎప్పటికీ సుఖపడడు.
(02:02) ఎందుకంటే ఆ కోరికలకి అంతం ఉండదు. ఒక రోలెక్స్ వాచ్ నీకు టైం చూపిస్తుంది 10 రూపాయల వాచ్ కూడా టైమే చూపిస్తుంది. కానీ ఆ కోటి రూపాయల వాచ్ కొన్నప్పుడు వచ్చే ఆ కిక్ ఉందే అది ఒక డ్రగ్ లాంటిది. కొద్దిసేపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొత్తది కావాలనిపిస్తుంది. అంటే నువ్వు వస్తువులకి బానిస అయిపోతున్నావ్. నీ సంతోషాన్ని ఒక మెటల్ ముక్క మీదో ఒక వెహికల్ మీదో ఆధారపడేలా చేసుకుంటున్నావ్.
(02:28) అది చాలా డేంజరస్. నిజానికి డబ్బుతో సంతోషాన్ని ఎలా కొనాలంటే వస్తువుల్ని కాదు సమయాన్ని టైం ని కొనాలి. ఆర్థర్ షోపెన్ హవర్ అనే ఇంకో మొండి ఫిలాసఫర్ ఉన్నాడు. అతను చాలా క్లియర్ గా చెప్పాడు. మనిషికి ఉన్న అసలైన ఆస్తి వాడి మేధస్సు వాడి ఆలోచనలు కానీ ఆ ఆలోచనలకి పదును పెట్టాలన్నా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలన్నా నీకు కావాల్సింది లీజర్ అంటే ఖాళీ సమయం.
(02:57) ఈ రోజుల్లో మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే డబ్బు సంపాదించడం కోసం మన కాలాన్ని అమ్మేస్తున్నాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎవడో బాస్ కింద కుక్కల్లా పని చేసి నెల చివరిన వచ్చే జీతంతో ఒక ఐఫోన్ కొని అదే సంతోషం అనుకుంటున్నావ్. ఇది ప్యూర్ బుల్ షీట్ నీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుతో నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నీ కాలాన్ని నువ్వు తిరిగి కొనుక్కోవడం అంటే నీకు నచ్చిన పని చేయడానికి నీకు టైం ఉండాలి.
(03:25) నీకు చదువుకోవాలని ఉంటే చదువుకోవాలి ట్రావెల్ చేయాలంటే చేయాలి లేదా ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవాలన్నా కూర్చోవాలి. దీన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అంటే నీ అవసరాల కోసం నువ్వు ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేని స్థితి అన్నమాట. అప్పుడు నీ మీద నీకు కంట్రోల్ ఉంటుంది. అదే అసలైన కిక్. చాలామంది అనుకుంటారు కోట్లు ఉంటేనే ఎంజాయ్ చేయొచ్చు అని కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే చిన్న చిన్న సంతోషాలు ఎక్కువసార్లు అనుభవించడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఒకేసారి పెద్ద లగ్జరీ వస్తువు కొనడం వల్ల రాదు.
(03:59) హార్వర్డ్ స్టడీ కూడా ఇదే చెప్తోంది. నువ్వు ఒక పెద్ద బంగళా కొన్నావ అనుకో మొదటి నెల చాలా గొప్పగా ఉంటుంది. రెండో నెల అది ఒక అలవాటు అయిపోతుంది. మూడో నెల దాన్ని క్లీన్ చేసుకోవడం నీకు తలనొప్పిగా మారుతుంది. దీన్నే హెడానిక్ అడాప్టేషన్ అంటారు. అంటే మన మైండ్ ఏ కొత్త వస్తువుకైనా త్వరగా అలవాటు పడిపోతుంది. అందుకే వస్తువుల మీద కంటే ఎక్స్పీరియన్స్ మీద డబ్బు ఖర్చు పెట్టాలి.
(04:24) ఒక ట్రిప్ కి వెళ్ళడం ఒక మ్యూజిక్ కాన్సర్ట్ చూడడం లేదా నీకు నచ్చిన వాళ్ళతో ఒక మంచి డిన్నర్ కి వెళ్ళడం ఇవి నీ మెమరీలో ఉండిపోతాయి. ఆ మెమరీస్ ని ఎవ్వరూ దొంగిలించలేరు. వస్తువులు పాడైపోతాయి కానీ అనుభవాలు నీ ఐడెంటిటీలో భాగమైపోతాయి. అందుకే షో ఆఫ్ కోసం కాకుండా నీ ఆత్మకి నచ్చే పనుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం బెటర్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కంపారిజన్.
(04:48) ఈ రోజుల్లో మనల్ని ఏడిపిస్తున్నది మన కష్టాలు కాదు పక్కోడి సుఖాలు వాడు ఒక కొత్త కారు కొన్నాడు అంటే చాలు మన దగ్గర ఉన్న పాత కారు మీద మనకు అసహ్యం మొదలవుతుంది. ఈ రేస్ కి ఎండ్ కార్డు లేదు. నువ్వు ఒక లెవెల్ కి వెళ్తే అక్కడ ఇంకోవాడు నీకంటే పైన ఉంటాడు. ఎపిక్యూరస్ అందుకే అన్నాడు. నీ దగ్గర ఏముందో దాన్ని చూసి గర్వపడు ఒకప్పుడు అవి కూడా నీకు కోరికలే కదా అని.
(05:12) మనకి ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయి లేని దాని కోసం ఏడుస్తూ బ్రతికేస్తున్నాం. డబ్బుని ఒక రక్షణ కవచంలా చూడాలి తప్ప అదిఒక అహంకారంలా చూడకూడదు. నీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను ఇబ్బందుల నుంచి కాపాడాలి. రేపు ఏదైనా అనారోగ్యం వచ్చినా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా నిలబడడానికి ఆ డబ్బు పనికి రావాలి. అంతే తప్ప దాన్ని తగలేసి మళ్ళీ ఆ డబ్బు కోసం ఎవడికో బానిసగా మారడం తెలివి తక్కువ దద్దమ్మలే చేసే పని.
(05:41) పక్కోడికి ఇవ్వడం అదే గివింగ్ ఇదేదో పుణ్యం వస్తుంది అని చెప్పే మాట కాదు ఇది ప్యూర్ సైకాలజీ [సంగీతం] నీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు నీ బ్రెయిన్ లో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. దీన్నే వార్మ్ గ్లో అంటారు. అయితే ఇది మనస్ఫూర్తిగా [సంగీతం] చేయాలి. ఎవరో ఫోర్స్ చేస్తేనో లేక సమాజం ఏమనుకుంటుందో అని చేసేది దానం కాదు.
(06:02) నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ మొహంలో వచ్చే ఆ సంతోషం చూస్తే నీకు నీ లైఫ్ మీద ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. మనుషులతో కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఆనందం ఏ రోలెక్స్ వాచ్ ఇవ్వలేదు. డబ్బు అనేది ఒక టూల్ మాత్రమే దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనేదే ఇంపార్టెంట్. అది నిన్ను బానిసని చేయొచ్చు లేదా ఒక రాజుని చేయొచ్చు.
(06:25) నువ్వు నీ కోరికల్ని కంట్రోల్ లో పెట్టుకొని నీ కాలాన్ని గౌరవిస్తూ అనుభవాలకి ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు డబ్బే నీ వెనకాల వస్తుంది. సంతోషం కూడా నీతోనే ఉంటుంది. అంతేకానీ డబ్బు ఉంటేనే అంతా అనుకొని రాత్రి పగలు కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకొని చివరికి హాస్పిటల్ బెడ్ మీదే కోట్లు ఉన్నా ఏం లాభం అందుకే బ్రతికినన్ని రోజులు ఒక క్లారిటీతో బ్రతకాలి.
(06:48) డబ్బుని ప్రేమించకు దాన్ని వాడుకో జీవితాన్ని ప్రేమించు దాన్ని అనుభవించు
No comments:
Post a Comment